CM visit to flood-hit areas in Suryapet and Khammam

Cm Revanth Reddy Visit To Flood Hit Areas In Suryapet And Khammam 02 09 2024 (28)
  • Visiting the flood affected areas to extend all kinds of support.
  • Preliminary estimation says the state suffered a loss of Rs 5,438 crore due to heavy rains.
  • 16 people lost their lives due to heavy rains
  • Ministers and officers are working hard in the difficult times.
  • Why is the main opposition leader maintaining silence? Contribute Rs 1000 crore or Rs 2000 crore from looted public money for flood relief.
  • Political gains are not important.
  • Appeals to business and voluntary organizations to extend support to flood victims

CM Sri Revanth Reddy visits several flood affected colonies in the Khammam district and consoled the victims.

Cm Revanth Reddy Visit To Flood Hit Areas In Suryapet And Khammam 02 09 2024 26

Chief Minister Sri A Revanth Reddy instilled confidence among flood affected people by announcing the government will extend all kinds of support to the victims of untimely heavy rains.

Cm Revanth Reddy Visit To Flood Hit Areas In Suryapet And Khammam 02 09 2024 3

As part of a field visit to the flood affected districts, the Chief Minister reached Suryapet first from Hyderabad and reviewed flood situation in Mothe Mandal. Later the CM arrived in Khammam district and inspected the breached overflowing Palair canal and road damages at Nayakan Gudem.

The Chief Minister examined the collapsed left canal of Palair and then reached Khammam. The CM visited Pollepalli, Padda Thanda and Bokkalagadda colonies which are inundated due to heavy flood in Munneru Vagu and inspected the damaged houses. CM Revanth Reddy consoled the victims of the heavy rains before holding a review in Khammam Collectorate.

Cm Revanth Reddy Visit To Flood Hit Areas In Suryapet And Khammam 02 09 2024 2

The Chief Minister said that 16 people lost their lives due to heavy rains and Old Khammam, Warangal and Nalgonda districts suffered severe damages. Crops have been damaged in lakhs of acres, canals and ponds breached, road network cut off and electric sub stations and electric poles also damaged, the CM said that preliminary estimation indicated a loss of 5,438 crore property damages. Government received information that Adilabad, Nirmal and Nizamabad districts will receive more rains.

The Chief Minister said that the entire administration is busy with providing relief to the flood victims and a detailed survey on damages will be conducted after normalcy is restored.

Cm Revanth Reddy Visit To Flood Hit Areas In Suryapet And Khammam 02 09 2024 9

Round the clock vigil:

Since the state is receiving heavy rains for the last two days, CM Revanth Reddy said that he has been reviewing the flood situation with the Chief Secretary, DGP, Disaster Response Commissioner and Collectors continuously. He is visiting the flood ravaged areas to instill confidence among the victims that the government is standing by the affected families, the chief minister said some people suggested not to visit at this time as people are in distress. He turned down the suggestion because he strongly believed that support should be extended when people are suffering. The CM said that the damages occurred in the vicinity of Munneru Vagu is colossal. Old aged people between 70 and 80 years also narrated their woes and they never experienced such adverse conditions. The CM instructed officials to provide Rs 10000 as immediate relief to those who lost all their belongings like rice, pulses along with TV, fridges in the floods.

Opposition leaders are enjoying in abroad, stop criticizing Govt.

CM Revanth Reddy said that the government accorded priority to the people’s interests. The ministers and officers are extending help to the people from the day the state is witnessing incessant heavy rains. Deputy Chief Minister Bhatti Vikramarka, Ministers Tummala Nageswara Rao and Ponguleti Srinivas Reddy are visiting the flood affected areas in the midnight also in Khammam district. Minister N Uttam Kumar Reddy returned from Delhi immediately and monitoring releif activities closely.

Opposition leaders and Congress leader Sharmila are participating in relief programs in the flood affected areas in Andhra Pradesh, the CM said criticizing KCR for staying in his farm house and maintaining the silence. KTR and his friends are on holiday trip in America. The Chief Minister warned KTR to refrain from criticizing his cabinet colleagues. The Chief Minister said that he already demanded the Centre to declare flood fury in Telangana as National Calamity and requested Prime Minister Narendra Modi to visit the rain ravaged state. The CM questioned the main Opposition leaders for not demanding the centre to help the state in the difficult times.

Kalvakuntla family will not help even a single penny

CM Revanth Reddy said that former India Vice President Venkaiah Naidu announced some help to the flood affected state. The Kalvakuntla family amassed crores of wealth but not ready to support . The CM suggested to KCR family to get rid of the sins they committed by donating at least Rs 1000 crore or Rs 2000 crore from their ill gotten money for flood relief.

Warns of strict action against erring officials

Chief Minister Revanth Reddy cautioned the spread of communicable diseases in the flood affected areas. The CM instructed the Panchayat Raj and Municipal authorities to take up cleanliness a d sanitation measures and the Health Department officials should make available required medicines. An ex-gratia of Rs 5 Lakhs will be given to the kin of deceased due to heavy rains.

Rs.10,000 per acre immediate assistance will be provided to the affected farmers , Rs 50,000 for cattle loss and Rs 5000 will be given in case Goats and Sheeps dies. The officials of all department have been asked to be vigilant and coordinate each other.

The District Collectors have been asked to take disciplinary action against the officials who failed to discharge their duties. It is the government’s responsibility to support people and the officials should perform their duties.

The Chief Minister appealed to the business community , voluntary organizations and people to come forward and support the victims. The media has also been requested to bring out real issues and telecast them on TVs. Some Newspapers and TVs owned by some parties taken up a false propaganda and these institutions are not considered as media outlets.

The Chief Minister warned that the political parties will face drubbing like in Assembly and Lok Sabha elections, again if they do not mend their ways.

Deputy Chief Minister Bhatti Vikramarka, Ministers Tummala Nageswara Rao, Ponguleti Srinivas Reddy, N Uttam Kumar Reddy, Komati Reddy Venkat Reddy, Adviser to Chief Minister Vem Narender Reddy, MP Raghuram Reddy, old Khammam MLAs and senior officials are present.

అండ‌గా నిలిచేందుకే వ‌చ్చా

  • ప్రాథ‌మిక న‌ష్ట అంచ‌నా వ్య‌యం రూ.5,438 కోట్లు
  • భారీ వ‌ర్షాల‌తో 16 మంది ప్రాణాలు కోల్పోయారు..
  • మంత్రులు, అధికారులు బాగా ప‌ని చేశారు..
  • ప్ర‌తిప‌క్ష నేత మౌన ముద్ర ఎందుకు?
  • దోచుకున్న సొమ్ములో రూ.వెయ్యో.. రూ.2 వేల కోట్లో బాధితుల‌కు స‌హాయం చేయండి
  • మాకు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ముఖ్యం కాదు…
  • వ్యాపార‌, స్వ‌చ్ఛంద సంస్థ‌లు బాధితుల‌ను ఆదుకోవాలి..
  • ఖ‌మ్మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • ఖ‌మ్మంలో ప‌లు కాల‌నీల్లో ప‌ర్య‌టించి బాధితుల‌కు ఓదార్పు

అకాల వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో న‌ష్ట‌పోయిన వారికి అండ‌గా నిలిచేందుకే వ‌చ్చాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించేందుకు ముఖ్య‌మంత్రి సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి తొలుత సూర్యాపేట జిల్లాకు చేరుకున్నారు. వ‌ర‌ద న‌ష్టాల‌పై మోతెలో స‌మీక్షించారు. అనంత‌రం ఖ‌మ్మం జిల్లాకు చేరుకున్నారు. నాయ‌క‌న్ గూడెం వ‌ద్ద పాలేరు కాలువ పొంగి ర‌హ‌దారి తెగిపోవ‌డంతో దానిని ప‌రిశీలించారు. అనంత‌రం పాలేరు ఎడ‌మ కాలువ గండి ప‌డ‌డంతో దానిని ప‌రిశీలించారు. అక్కడి నుంచి ఖ‌మ్మం చేరుకున్నారు. మున్నేరు వ‌ర‌ద‌తో మునిగి తీవ్రంగా న‌ష్ట‌పోయిన పోలేప‌ల్లి, పెద్ద తండా, బొక్క‌ల‌గ‌డ్డ కాల‌నీల‌ను ప‌రిశీలించారు. దెబ్బ‌తిన్న ఇళ్ల‌లోకి వెళ్లి ప‌రిశీలించారు. బాధితుల‌తో మాట్లాడి వారిని ఓదార్చారు. అనంత‌రం ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు.

భారీ వ‌ర్షాల‌తో ఉమ్మ‌డి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ జిల్లాలకు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని, 16 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లింద‌ని, ర‌హ‌దారులు, కాలువ‌లు, చెరువులకు గండ్లు ప‌డ‌డంతో పాటు విద్యుత్ స‌బ్‌స్టేష‌న్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బ‌తిన్నాయ‌ని… ప్రాథ‌మికంగా రూ.5,438 కోట్ల ఆస్తి న‌ష్టం వాటిలిన‌ట్లు అంచ‌నా వేశామ‌ని తెలిపారు. ఇది ప్రాథ‌మిక అంచ‌నా మాత్ర‌మేన‌ని, ఇంకా వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని, ఆదిలాబాద్‌, నిర్మ‌ల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ వ‌ర్షాలు ప‌డుతున్నాయ‌ని స‌మాచారం అందిందిన్నారు. ప్ర‌స్తుతం అధికార యంత్రాంగ‌మంతా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైంద‌ని.. కొద్దిగా తెరిపి ఇవ్వ‌గానే పూర్తి స్థాయి న‌ష్టం అంచ‌నాలు వేస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

కంటిపై కునుకు లేకుండా

రెండు రోజుల క్రితం వ‌ర్షాలు ప్రారంభ‌మైన ద‌గ్గ‌రి నుంచి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డీజీపీ, డిజాస్ట‌ర్ రెస్పాన్స్ క‌మిష‌న‌ర్‌, క‌లెక్ట‌ర్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నాన‌ని, కంటిపై కునుకు లేకుండా ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వం అండ‌గా ఉంద‌నే విశ్వాసం బాధితుల‌కు క‌ల్పించేందుకు స్వ‌యంగా వ‌చ్చాన‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ప్ర‌జ‌లు బాధ‌తో ఉన్నార‌ని ఈ స‌మ‌యంలో ప‌ర్య‌ట‌న‌కు వ‌ద్ద‌ని కొంద‌రు సూచించార‌ని, ప్ర‌జ‌లు బాధ‌లో ఉన్న‌ప్పుడే అండ‌గా ఉండాల‌ని, సంతోషంలో ఉన్న‌ప్పుడు అవ‌స‌రం లేద‌ని చెప్పి తాను వ‌చ్చాన‌ని చెప్పారు.. మున్నేరు వ‌ర‌ద బాధితుల ఇళ్ల‌ను, వారిని చూసిన‌ప్పుడు క‌లిగిన న‌ష్టాన్ని మాట‌ల్లో చెప్ప‌లేమ‌ని, త‌మ‌కు ఊహ వచ్చిన త‌ర్వాత ఇంత వ‌ర్షాన్ని, వ‌ర‌ద‌ను చూడ‌లేద‌ని 70-80 ఏళ్ల వృద్ధులు చెప్పార‌ని సీఎం తెలిపారు. వాళ్ల‌కు ప్ర‌భుత్వం ఎంత చేసినా త‌క్కువేన‌ని, ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌తో స‌హా బియ్యం, ప‌ప్పులు, ఉప్పులు మొత్తం కోల్పోయార‌ని, వారికి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం కింద రూ.ప‌ది వేల చొప్పున అంద‌జేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు.

విదేశాల్లో ఎంజాయ్ చేయండి… విమ‌ర్శ‌లు మానండి

త‌మ‌కు ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ‌ర్షాలు ప్రారంభ‌మైన ద‌గ్గ‌రి నుంచి మంత్రులు, అధికారులు తాను ఊహించ‌న దానిక‌న్నా అద్భుతంగా ప‌ని చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఖ‌మ్మం జిల్లాలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అర్ధ రాత్రి దాటినా క్షేత్ర స్థాయిలో ఉన్నార‌ని కితాబునిచ్చారు. మంత్రి ఉత్త‌మ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన వ‌చ్చి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నార‌ని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నేతలు, త‌మ పార్టీకి చెందిన ష‌ర్మిల వ‌ర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నార‌ని, ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటూ మౌన ముద్ర‌లో ఉన్నార‌ని, కేటీఆర్ స్నేహితుల‌తో క‌లిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. కేటీఆర్ అమెరికాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తూ క్షేత్రంలో ఉన్న త‌మ మంత్రుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాల‌ని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని, ప్ర‌ధాన‌మంత్రి మోదీ రాష్ట్రంలో ప‌ర్య‌టించాల‌ని తాను కోరాన‌ని, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎందుకు కేంద్రాన్ని ఆ విష‌యం కోర‌ద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు.

క‌ల్వ‌కుంట్ల కుటుంబం చిల్లిగ‌వ్వ ఇవ్వ‌దు

రాష్ట్రంలో వ‌ర‌ద క‌ష్టాల‌కు చ‌లించి మాజీ ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు కొంత స‌హాయం ప్ర‌క‌టించార‌ని, రూ.ల‌క్ష‌ల కోట్లు సంపాదించిన క‌ల్వ‌కుంట్ల‌ కుటుంబం మాత్రం చిల్లి గ‌వ్వ స‌హాయం చేయ‌ర‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. రూ.వెయ్యి కోట్లో.. రూ.2 వేల కోట్లో వ‌ర‌ద స‌హాయ కింద ప్ర‌క‌టించి త‌మ పాపాల‌కు ప్రాయాశ్చితం చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు…

తీరు మార్చుకోక‌పోతే క‌ష్టం

వ‌ర‌ద‌ల‌తో అంటురోగాలు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ అధికారులు శుభ్ర‌త చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, వైద్యారోగ్య శాఖాధికారులు మందులు అందుబాటులో ఉంచుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం, ఎక‌రా పంట న‌ష్టానికి రూ.ప‌ది వేలు, పాడి ప‌శువుల‌కు రూ.50 వేలు, మేక‌లు, గొర్రెలు చ‌నిపోతే రూ.5 వేల చొప్పున ప‌రిహారం అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ప్ర‌తి శాఖ‌లో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

Telangana Rising