CM urges PM to declare rain fury in Telangana as National Calamity

Cm Revanth Reddy Held A Meeting On National Highways 10 07 2024 (1)
  • CM Sri Revanth Reddy urges PM Sri Narendra Modi to declare rain fury in Telangana as a National Calamity.
  • Appeals to Modi to visit flood hit areas in Telangana
  • Ex-gratia of Rs 4 lakhs increased to Rs 5 Lakhs to the kin of the deceased in the floods.
  • Compensation for cattle loss was enhanced to Ra 50,000 from Rs 30,000. For Sheep and Goats, it is increased from Rs 3,000 to Rs 5,000.
  • Rs.5 crore assistance to the flood hit Khammam, Mahabubabad, Suryapet, and Bhadradri Kothagudem as immediate relief measures.
  • Special training for police forces on par with NDRF
  • CM Sri Revanth Reddy holds high level review on heavy rains and floods

Chief Minister Sri A Revanth Reddy urged Prime Minister Narendra Modi to declare the heavy rain caused damage mainly the crops and loss of life as a National calamity.

The Chief Minister directed State Chief Secretary Santhi Kumari to write a letter requesting the Prime Minister to visit the flood hit Telangana state which suffered a huge loss of life, crops and property damages The CM held a review on floods and relief operations with senior officers at the Central Command Control office in Hyderabad today (Monday) morning.

The Chief Minister enquired the Meteorological Department ( IMD) about the reasons for very heavy rains in a very short time and the rain forecast for today and tomorrow. The IMD briefed the CM the state received heavy rains more than expected and it required to conduct a detailed study to ascertain the reasons for frequent heavy rains in the state. Earlier, the state witnessed very heavy rains only once in five years or 10 years.
The IMD authorities cautioned the possibility of heavy rains in Adilabad, Nizamabad and Nirmal districts today and tomorrow.

Alerted by the weather forecast, the CM ordered the Collectors of the respective districts, officers and staff of all departments to be on high alert. Specific instructions are issued to shift people residing in the low-lying areas to the relief camps immediately, if required. The Chief Minister asked the Collectors to set up Control Rooms to receive the complaints round the clock and also monitor water levels in ponds, culverts, low level causeways and other places by deploying the officials of various departments. A weather bulletin will be released every three hours to alert the entire state.

Ex-Gratia Enhanced

CM Revanth Reddy announced the ex-gratia of Rs 4 lakhs has been increased to Rs 5 Lakh to each family of the deceased in the heavy rains and floods. Compensation for each milking cattle loss also increased to Rs 50,000 from Rs 30,000 and for Goat and Sheep, government will provide Rs 5,000 compensation as against Rs 3,000.

Chief Minister Revanth Reddy also ordered the enumeration of crop loss. Officials briefed the CM that the preliminary estimations said crops are damaged in 1.50 Lakh acres. In the wake of reports of crop damages in 4 lakh acres, the CM asked the Agriculture department to conduct a field survey and collect the details of the crop loss. The government has released compensation for crop losses in Kamareddy immediately in the previous time, the CM said instructing the officials to make arrangements on the same lines to disburse the compensation to the flood affected farmers. Arrangements are also being made to visit the Central teams and enumerate crop damages.

The Chief Minister ordered the officials to allot Indiramma houses to those who lost their shelter.

The Chief Minister directed the Chief Secretary to write a letter requesting Prime Minister Narendra Modi to visit the flood affected areas mainly the damage of railway lines and roads, breach of water bodies and collapse of electricity poles and other property damages in the state.

Intense Training for Young Cops on par with NDRF

CM Revanth Reddy directed the DGP to provide training to one-third of the 8 battalions of the young police force on the lines of NDRF. The Chief Minister enquired the officials about the emergency services by the NDRF during heavy rains and floods. The officials informed the Chief Minister that the deployment of NDRF forces will be done based on the indent and it will also consume time. In a quick response, the Chief Minister ordered to provide training to the young police of the battalions on the lines of NDRF. When the officials brought the shortage of equipment to the notice, the CM asked the authorities to purchase them though expensive. Officials informed that such teams have already been formed in Odisha and Gujarat. The chief minister suggested that the procedures should be studied and provide training with the experienced officers.

The Chief Minister directed to prepare a manual and conduct rehearsals with the trained staff before every season.

GHMC and other Commissionerates

CM Revanth Reddy ordered the officials that no untoward incident should take place anywhere in Hyderabad city and other Municipal Corporations. The officials are advised to be on high alert in the supply of electricity, traffic maintenance, drinking water supply and sanitation. Police officers have been asked to monitor vehicular traffic closely. Energy officials are instructed to address power outages and supply problems immediately. The Civic authorities are advised to shift people living in the low-lying areas to relief camps.

The chief minister ordered the officials to identify the daily laborers, who are staying at their houses during heavy rains, and distribute Rice, Pulses and other essential commodities. Ministers Komati Reddy Venkat Reddy, Sridhar Babu, Adviser to Chief Minister Vem Narender Reddy, MLA Danam Nagender, MP Anil Kumar Yadav, CS Santhi Kumari, DGP Jitender and senior officers of all departments participated.

జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించండి

  • ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి విజ్ఞ‌ప్తి… విప‌త్తు ప‌రిశీల‌న‌కు రావాల‌ని విన్న‌పం
  • మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం రూ.4 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల‌కు పెంపు
  • పాడి ప‌శువుల‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల‌కు, మేక‌లు, గొర్రెల‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల‌క పెంపు
  • త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌ల‌కు ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, సూర్యాపేట‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం క‌లెక్ట‌ర్ల‌కు రూ.5 కోట్లు
  • ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో పోలీసు సిబ్బందికి శిక్ష‌ణ‌
  • భారీ వ‌ర్షాల‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

భారీ వ‌ర్షాల‌తో పెద్ద సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం.. ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లినందున జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రాణ‌, పంట న‌ష్టాల‌తో పాటు భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లినందున స్వ‌యంగా ప‌రిశీల‌న‌కు రావాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని కోరుతూ లేఖ రాయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీమతి శాంతి కుమారిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని క‌మాండ్ కంట్రోల్ రూంలో ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం స‌మీక్ష నిర్వ‌హించారు. అతి త‌క్కువ స‌మ‌యంలో ఇంత భారీ వ‌ర్షాలు కుర‌వ‌డానికి కార‌ణాలు, ఈ రోజు, రేప‌టి ప‌రిస్థితుల‌పై వాతావ‌ర‌ణ శాఖ అధికారుల‌ను అడిగారు. ఊహించిన దానిక‌న్నా ఎక్క‌వ వ‌ర్షాలు వ‌చ్చాయ‌ని, గ‌తంలో అయిదేళ్ల‌కో, ప‌దేళ్ల‌కో ఇలా వ‌చ్చేవ‌ని.. ఇటీవ‌ల త‌ర‌చూ వ‌స్తున్నాయ‌ని, దీనిపై మ‌రింత అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు ఆదిలాబాద్‌, నిజామాబాద్, నిర్మ‌ల్ జిల్లాల్లో వ‌ర్షాలు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, అన్ని విభాగ‌ల అధికారులు, సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అవ‌స‌ర‌మైతే వెంట‌నే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. జిల్లా క‌లెక్ట‌రేట్ల‌లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంట‌లు ప‌ర్య‌వేక్ష‌ణ కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. చెరువులు, క‌ల్వ‌ర్టులు, లోలెవ‌ల్ కాజ్‌వేలు ఇత‌ర ప్ర‌దేశాల్లో వివిధ శాఖల అధికారుల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ చేయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులపై ప్ర‌తి మూడు గంట‌ల‌కో బులెటిన్ విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

ప‌రిహారం పెంపు
వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం రూ.4 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల‌కు, పాడి ప‌శువుల‌కు ఇచ్చే ప‌రిహారం రూ.30 వేల నుంచి రూ.50 వేల‌కు, మేక‌లు, గొర్రెల‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

పంట న‌ష్టంపైనా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాథ‌మిక అంచ‌నాల ప్ర‌కారం రూ.ల‌క్ష‌న్న‌ర ఎక‌రాల‌కుపైగా పంట న‌ష్టం వాటిల్లింద‌ని అధికారులు తెలిపారు. 4 ల‌క్ష‌ల‌కుపైగా ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, త‌క్ష‌ణ‌మే రంగంలోకి దిగి పంట న‌ష్టం వివ‌రాలు సేక‌రించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కామారెడ్డిలో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు పంట న‌ష్ట ప‌రిహారం వెంట‌నే విడుద‌ల చేశామ‌ని, ప్ర‌స్తుతం అలా చేసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఆయా వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా పేర్కొంటూ కేంద్ర ప్ర‌భుత్వ బృందాలు సైతం త‌క్ష‌ణ‌మే పంట న‌ష్ట ప‌రిశీల‌న‌కు వ‌చ్చే ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు

రైల్వే లైన్ సైతం కొట్టుకుపోవ‌డం, ప‌దుల సంఖ్య‌లో రోడ్లు, చెరువుల‌కు గండి ప‌డ‌డం, విద్యుత్ స్తంభాలు కూలిపోవ‌డం, ఇత‌ర ఆస్తి న‌ష్టాలు చోటు చేసుకున్నందున స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రిని ప‌ర్య‌ట‌న‌కు రావాల‌ని కోరుతూ లేఖ రాయాల‌ని సీఎస్ కు ముఖ్య‌మంత్రి సూచించారు.

యువ పోలీసుల‌కు ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో శిక్ష‌ణ‌

రాష్ట్రంలోని 8 బెటాలియ‌న్ల‌లో మూడో వంతు యువ పోలీసుల‌కు ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో శిక్ష‌ణ ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఎన్‌డీఆర్ఎఫ్ నుంచి త‌క్ష‌ణం ఎందుకు అంద‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. మ‌నం పెట్టిన ఇండెంట్ ఆధారంగా వాళ్ల ద‌గ్గ‌ర ఉన్న బ‌ల‌గాల‌ను పంపుతార‌ని, ఇందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు బ‌దులిచ్చారు. స్పందించిన ముఖ్య‌మంత్రి మ‌న బెటాలియ‌న్ల‌లోని యువ పోలీసుల‌కు ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు. ఎక్విప్‌మెంట్ స‌మ‌స్య‌గా ఉంటుంద‌ని అధికారులు తెల‌ప‌గా.. ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేద‌ని, వెంట‌నే కొనుగోలు చేయాల‌ని సూచించారు. ఒడిశా, గుజ‌రాత్‌ల్లో అలా శిక్ష‌ణ ఇచ్చి బృందాలు ఏర్పాటు చేసుకున్నాయ‌ని అధికారులు తెల‌ప‌గా… అవ‌స‌ర‌మైతే అక్కడి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని, అక్క‌డి అనుభ‌వం ఉన్న‌వారితో శిక్ష‌ణ ఇప్పించాల‌ని సీఎం సూచించారు. దానికోసం ఒక మాన్యువ‌ల్ రూపొందించాల‌ని, ప్ర‌తి సీజ‌న్ ముందు శిక్ష‌ణ ఇప్పించిన సిబ్బందితో రిహార్స‌ల్స్ చేయించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

జీహెచ్ఎంసీ.. క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో

న‌గ‌రంలో ఎక్క‌డా చిన్న అవాంఛ‌నీయ సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డానికి వీల్లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. విద్యుత్‌, ట్రాఫిక్‌, తాగు నీరు, శానిటేష‌న్ విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ట్రాఫిక్‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని, విద్యుత్ స‌మ‌స్య‌లు ఉంటే వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను స‌హాయ శిబిరాల‌ను త‌ర‌లించాల‌ని సూచించారు.

నిత్యం ప‌నికి వెళ్లే కూలీలు ప‌నులు ఉండ‌క ఇంటి ద‌గ్గ‌రే ఉండిపోతార‌ని, వారిని గుర్తించి బియ్యం, ప‌ప్పులు, నిత్యావ‌స‌ర స‌ర‌కులు పంపిణీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. స‌మీక్ష‌లో మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, శ్రీ‌ధ‌ర్ బాబు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్‌, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేంద‌ర్‌, అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.