Govt. will demolish all encroachments at Lakes across the state

Cm Revanth Reddy Reviewed On The Rains Situation At Mahabubabad District Collectorate 03 09 2024 (2)
  • Will envisage a strong plan for the removal of all encroachment
  • Prepare a blue book on natural calamities
  • Will review the increase of the height of retaining walls at Munneru vagu
  • Three Tandas will be merged and built as a model colony
  • CM challenges BRS leader Harish Rao to cooperate in the removal of encroachments by Puvvada Ajay
  • CM Revanth Reddy reviews the flood situation in the Mahabubabad district
  • Offers condolences to the family members of young scientist Ashwini…
  • Telangana employees donate one day salary of Rs 135 crore for flood relief

Chief Minister Sri A. Revanth Reddy expressed serious concern that the natural calamities like floods, landslides and torrential rains in Uttarakhand and in Telangana state are the result of the destruction of nature. The nature took its revenge when the ecosystem was ruined, the Chief Minister said that the colonies are inundated in the heavy rains due to the encroachment of lakes and ponds. In the wake of demand for the expansion of HYDRA activities in all parts of the state, the CM ordered the officials to chalk out an action plan in every place.

Cm Revanth Reddy Reviewed On The Rains Situation At Mahabubabad District Collectorate 03 09 2024 3

CM Revanth Reddy made it clear that removal of encroachment at ponds across the state is being given a top priority and the government will not hesitate to demolish the encroachments at all water bodies. The officials have been asked to prepare a report on the encroachment of ponds and lakes and also resolve pending court cases, if any. The Chief Minister gave an example of how Ram Nagar area is made a safe zone from floods by removing encroachments on the Nala in Hyderabad recently.

Cm Revanth Reddy Visited The House Of Young Scientist Nunawat Ashwini At Sitaram Tanda 03 09 2024

The Chief Minister visited the house of young scientist Nunawat Ashwini and her father Motilal, who died when their car washed away in the floods at Aakeru river, in Gangaram Thanda of Singareni Mandal. The CM paid flower tributes to the photos of Ashwini and Motilal and consoled Ashwini’s mother Neji and other family members. The Chief Minister assured that he would look into the possibility of providing a government job to Ashwin’s younger brother Ashok and also assured that a house under the Indiramma scheme will be allotted to the family.

Government to conduct a scientific survey of Akeru vagu (river)
The Chief Minister assured that a scientific survey will be carried out on the Akeru river. Residents of Sitaram Thanda brought to the notice of CM that their habitation is flooded every time due to the overflow of the Aakeru river. After consoling Ashwini’s family members, CM Revanth Reddy reached the place of the damaged culvert and roads at the overflowing Akeru vagu in Mahbubabad district and inspected the location where the car in which Ashwini and her father Motilal were traveling swept away. The CM enquired the locals whether such incidents occurred in the past.

Cm Revanth Reddy Reviewed On The Rains Situation At Mahabubabad District Collectorate 03 09 2024 7

Local resident Jarpula Laxman informed the CM that they have been facing difficulties every time the river overflows and the road has been cut off. From there, the Chief Minister reached Sitaram Thanda which was flooded by the Akeru vagu. The CM consoled those whose houses are submerged in the Tanda and inquired about their problems. The people of Tanda poured out their woes before the CM. They explained that their Tanda and the other two Tanda people spent sleepless nights during heavy rains and requested the Chief Minister to provide safety to their lives. The CM assured that the government will merge the three Thandas and build a model colony at one place and Indiramma houses will also be granted. The Chief Minister ordered the officials to file an FIR and issue new cards, certificates and pass books to those who lost their pass books, Aadhaar cards and other certificates in the floods.

Cm Revanth Reddy Reviewed On The Rains Situation At Mahabubabad District Collectorate 03 09 2024 5

The Chief Minister also made the promise of constructing a new bridge after a scientific assessment of the water flow in the river and arrangements will be made to divert the water to the nearby ponds and ponds. The farmers are also assured a compensation of Rs.10,000 per acre for crop damages due to Akeru river flood.

Cm Revanth Reddy Reviewed On The Rains Situation At Mahabubabad District Collectorate 03 09 2024 1

Government is on high alert and reducing the threat of submergence
Like never before, CM Revanth Reddy said that the loss of life and property could be reduced by taking precautionary measures during heavy rains in Mahabubabad District. The CM viewed the photo exhibition organized on the crop and property losses at Mahabubabad district Collectorate and held a review. The Chief Minister expressed anguish at the loss of four lives despite taking precautions during the heavy rains. Two died from Khammam district and another two victims were from Mahabubabad district. About 30,000 acres of crops have been damaged in Mahabubabad district. The CM made the promise to pay a compensation of Rs 10,000 per acre for the damage to crops. 680 flood-affected people have been shifted to relief camps in the districts. The CM praised SI Naresh for saving the lives of people from the floods in the Tanda and commended the police and revenue personnel who responded promptly during heavy rains in the district. The Collectors are advised to prepare a blue book on the incidents that happened in the calamity in the districts, the efforts put to overcome the challenges and the relief measures initiated. The blue book will help the future officials to deal with such big natural calamities.

Is Harish ready to cooperate in the removal of encroachments by Puvvada Ajay?

CM Revanth Reddy said he received complaints that former minister Puvvada Ajay encroached upon lakes and it could be the main reason for heavy floods. Locals also complained that the lakes are encroached at the behest of the former minister in Khammam. The Chief Minister said that Harish Rao was the Irrigation minister for 10 years and questioned the latter for not taking action during the BRS rule. The CM ridiculed the BRS leader Harish on visiting the flood hit areas to console the victims. Is Harish Rao ready to cooperate in removing the encroachments of former minister Puvvada in Khammam..? The Chief Minister challenged Harish to come and remove the encroachments in his presence. State Revenue Minister Ponguleti Srinivas Reddy and the District Collector have been asked to probe the encroachments by Puvvada Ajay in Khammam. The Chief Minister recalled that the first tender they floated after coming to power was for raising the height of the retaining wall in Khammam. The chief minister said that as the water level reached more height, the government will review the increase of the height of the wall again.

Compare damages between Khammam and Krishna district

The CM said that Khammam in Telangana and Krishna district in Andhra Pradesh are like twins and hence compare the flood related damages between the two districts . Quick response by Deputy Chief Minister Bhatti Vikramarka, Ministers Tummala Nageswara Rao and Ponguleti Srinivas Reddy and officials helped to mitigate the rain related damages in Khammam district. Helicopters are pressed into service for rescue operations in Khammam . The choppers reached fast from the nearby Vijayawada. The Chief Minister requested the centre to declare the flood fury in Telangana as a national calamity and appealed to Prime Minister Narendra Modi to visit the state.

Opposition not visited flood hit areas and console the victims

The Chief Minister asked whether KCR, who has been the Chief Minister for ten years, ever visited the flood hit areas and consoled the victims. The BRS leader never visited the flood affected areas and also the areas where children died in a train accident in Masaipet in his own assembly constituency. A veterinary doctor was raped and murdered in Hyderabad ORR. KCR did not console their family members. The Chief Minister questioned KCR for not visiting the flood affected areas and expressed anger that KTR , who is on America visit, was criticizing the ministers for serving people on the field. The KCR family is suggested to donate at least Rs 1000 crore or Rs 2000 crore from the looted public money to the CM relief fund.

Cm Revanth Reddy Reviewed On The Rains Situation At Mahabubabad District Collectorate 03 09 2024 14
Cm Revanth Reddy Reviewed On The Rains Situation At Mahabubabad District Collectorate 03 09 2024 12

Donations pouring into CMRF

Telangana government employees donated one day basic salary of Rs 135 crore to the Chief Minister’s Relief Fund (CMRF) by handing over a cheque to the chief minister. The CM congratulated the employees. Mutyala Sai, a class 10 student from Mahabubabad, also handed over his savings of Rs.3,000 to the Chief Minister for flood relief. The CM congratulated the student and appealed to the voluntary organizations and corporate bodies to come forward and help the flood victims. Ministers Sitakka, Ponguleti Srinivas Reddy, Advisor to the Chief Minister Vem Narender Reddy, MP Balaram Naik, MLAs Murali Naik, Ramachandra Naik, Yashaswini Reddy, Gandra Satyanarayana Rao, Nagaraju are present in the Mahabubabad district review.

రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గిస్తాం

  • ఆక్రమణల తొలగింపునకు పక్కా ప్రణాళిక…
  • ప్ర‌కృతి విప‌త్తుల‌పై బ్లూ బుక్ త‌యారు చేసుకోవాలి..
  • మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై స‌మీక్షిస్తాం…
  • మూడు తండాల‌ను క‌లిపి ఒకే ఆద‌ర్శ కాల‌నీగా నిర్మించాలి..
  • పువ్వాడ‌ ఆక్ర‌మ‌ణ‌ల‌ తొల‌గింపున‌కు హ‌రీష్ స‌హ‌క‌రిస్తారా..?
  • మ‌హ‌బూబాబాద్ జిల్లా స‌మీక్ష‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • యువ శాస్త్రవేత్త అశ్వినీ కుటుంబ స‌భ్యుల‌కు ఓదార్పు…
  • వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల రూ.135 కోట్ల విరాళం….

ప్ర‌కృతిని చెర బ‌డితే అది ప్ర‌కోపిస్తుంద‌ని.. ప్ర‌కృతి ప్ర‌కోపంతోనే ఉత్త‌రాఖండ్‌లోనైనా, మ‌న ద‌గ్గ‌రైనా విప‌త్తులు సంభ‌విస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వ‌ర్షాల స‌మ‌యంలో వ‌ర‌ద‌లు సంభ‌వించి కాల‌నీలకే కాల‌నీలే మునిగిపోవ‌డానికి కార‌ణం చెరువులు, నాలాల ఆక్ర‌మ‌ణే కార‌ణ‌మ‌న్నారు. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్త‌రించాల‌నే డిమాండ్ వ‌స్తోంద‌ని, కానీ ఎక్క‌డిక‌క్క‌డ కార్యాచ‌ర‌ణ రూపొందించుకోవాల‌ని అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్ర‌మ‌ణ తొల‌గింపును ప్రాధాన్యంగా పెట్టుకున్నామ‌ని, చెరువులు, నాలాల ఆక్ర‌మ‌ణ‌లో ఎంత‌టి వారున్నా తొల‌గింపున‌కు వెనుకాడ‌బోమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ముందుగా చెరువులు, నాలాల ఆక్ర‌మ‌ణ‌పై నివేదిక రూపొందించుకోవాల‌ని, ఏవైనా కోర్టు కేసులు ఉంటే వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. హైద‌రాబాద్ లో కేవ‌లం ఒక నాలాపై ఆక్ర‌మ‌ణ‌లు తొలగిస్తేనే రాం న‌గ‌ర్‌లో ముంపు బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి ఉదాహ‌రించారు. ఖ‌మ్మంలో మంత్రి పొంగులేటి నివాసంలో మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో ఇష్టాగోష్టిలో, మ‌హబూబాబాద్ జిల్లా స‌మీక్ష‌లో ఈ విష‌యాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆకేరు వాగు పొంగ‌డంతో కారు కొట్టుకుపోయి యువ శాస్త్రవేత్త నూనావ‌త్ అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ మృతిచెందిన విష‌యం విదిత‌మే. మంగ‌ళ‌వారం ఉద‌యం ఖ‌మ్మం నుంచి నేరుగా సింగ‌రేణి మండ‌లం గంగారాం తండాలోని అశ్వినీ ఇంటికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అశ్వినీ, మోతీలాల్ చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అశ్వినీ త‌ల్లి నేజీ, ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి ప‌రామ‌ర్శించి ఓదార్చారు. అశ్వినీ అన్న అశోక్‌కు ప్ర‌భుత్వం ఉద్యోగం ఇచ్చే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ఇల్లు లేక‌పోవ‌డంతో ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఆకేరు ప్ర‌వాహం శాస్త్రీయ స‌ర్వే చేప‌డ‌తాం

ఆకేరు వాగు ప్ర‌వాహంపై శాస్త్రీయ స‌ర్వే చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆకేరు వాగు పొంగ‌డంతో ప్ర‌తి సారి తాము ముంపు బారిన ప‌డుతున్నామ‌ని సీతారాం తండా వాసులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గంగారాం తండాలో అశ్వినీ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు పొంగి క‌ల్వ‌ర్టు, ర‌హ‌దారి తెగిపోయిన ప్రాంతానికి చేరుకొని దానిని ప‌రిశీలించారు. అక్క‌డే అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ ప‌య‌నిస్తున్న కారు ఆకేరు వాగు ప్ర‌వాహానికి కొట్టుకుపోయి వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతాన్ని, ఆకేరు వాగును, క‌ల్వ‌ర్టు కొట్టుకుపోయిన తీరును ముఖ్య‌మంత్రి ప‌రిశీలించారు. వాగు ప్ర‌వాహ ఉద్ధృతి ఎలా ఉంటుంది.. గ‌తంలో ఇటువంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయా అని ముఖ్య‌మంత్రి స్థానికుల‌ను ప్ర‌శ్నించారు. ప్ర‌తిసారి వాగు పొంగ‌డంతో తాము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, ర‌హ‌దారి గ‌తంలోనూ తెగింద‌ని స్థానికుడు జ‌ర్పుల ల‌క్ష్మ‌ణ్ ముఖ్య‌మంత్రికి తెలిపారు. అక్క‌డి నుంచి ఆకేరు పొంగి ముంపు బారిన ప‌డిన సీతారాం తండాకు ముఖ్య‌మంత్రి చేర‌కున్నారు. తండాలో ఇళ్లు మునిగిన వారిని ఓదార్చి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. తాము తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని, ఆకేరు వాగు పొంగిన ప్ర‌తిసారి త‌మ తండాతో స‌మీపంలోని మ‌రో రెండు తండాల‌కు నిద్ర ఉండ‌డం లేద‌ని, త‌మ‌ను ర‌క్షించాల‌ని ముఖ్య‌మంత్రిని తండా వాసులు కోరారు.. తండా వాసుల‌ను ఓదార్చిన అనంత‌రం ముఖ్య‌మంత్రి వారిని ఉద్దేశించి మాట్లాడారు. మూడు తండాల‌ను క‌లిపి ఒకే చోట మోడ‌ల్ కాల‌నీ ఏర్పాటు చేస్తామ‌ని.. ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే FIR దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్, పాసు పుస్త‌కాలు మంజూర‌య్యేలా చూడాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఆకేరు ప్రవాహంపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మిస్తామ‌ని, నీటిని స‌మీపంలోని చెరువులు, కుంట‌ల‌కు మ‌ళ్లించే ఏర్పాటు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. ఆకేరు వాగు వరదతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు.

అప్ర‌మ‌త్త‌త‌తో ముప్పు త‌గ్గించ‌గ‌లిగాం

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా మ‌హ‌బూబాబాద్ జిల్లాలో వ‌ర్ష‌పాతం న‌మోదైనా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు చేప‌ట్ట‌డంతో ప్రాణ‌, ఆస్తి న‌ష్టాలు త‌గ్గించగలిగామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పంట‌, ఆస్తి న‌ష్టాల‌పై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను క‌లెక్ట‌రేట్‌లో ముఖ్యమంత్రి తిలకించారు. అనంత‌రం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వ‌హించారు. తాము ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. ఊహించ‌ని వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో మ‌హ‌బూబాబాద్ జిల్లాలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయార‌ని ముఖ్య‌మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారిలో ఖ‌మ్మం జిల్లాకు చెందిన వారు ఇద్ద‌రు, మ‌హ‌బూబాబాద్ జిల్లాకు చెందిన వారు ఇద్ద‌ర‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింద‌ని…. ఎక‌రాకు రూ.ప‌ది వేల చొప్పున పంట న‌ష్ట ప‌రిహారం చెల్లిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో ముంపు బారిన ప‌డిన 680 మందిని స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించామ‌ని సీఎం చెప్పారు. సీతారాం తండాలో వరద సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ఎస్సై నగేష్ కి అభినందనలు తెలిపారు. జిల్లాలో విప‌త్తు స‌మ‌యంలో స‌త్వ‌రం స్పందించిన పోలీసు, రెవెన్యూ సిబ్బందిని ముఖ్య‌మంత్రి అభినందించారు. జిల్లాల్లో విప‌త్తుల స‌మ‌యంలో ఏం జ‌రిగింది.. ఆ స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మించారు… ఎలా స‌హాయ‌క చ‌ర్య‌లు తీసుకున్నార‌నే దానిపై బ్లూబుక్ రూపొందించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఆ బ్లూ బుక్ భ‌విష్య‌త్‌లో వ‌చ్చే అధికారుల‌కు విప‌త్తుల స‌మ‌యంలో క‌ర‌దీపిక‌గా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

పువ్వాడ అజ‌య్ ఆక్ర‌మ‌ణ‌ల‌ తొల‌గింపున‌కు హ‌రీష్ స‌హ‌క‌రిస్తారా..?

ఖ‌మ్మం ముంపు బారిన ప‌డ‌డానికి మాజీ మంత్రి పువ్వాడ ఆక్ర‌మ‌ణ‌లే కార‌ణ‌మ‌ని త‌న‌కు ఫిర్యాదులు అందాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి ఇష్టారీతిగా కాలువ‌లు ఆక్ర‌మించార‌ని, దాంతో ఖ‌మ్మం ముంపు బారిన ప‌డింద‌ని తాను ప‌రామ‌ర్శిస్తున్న‌ప్పుడు స్థానికులు చెప్పార‌న్నారు. ప‌దేళ్ల కాలం నీటి పారుద‌ల శాఖ మంత్రిగా ఉన్న హ‌రీష్ రావు ఈ ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఏమంటార‌ని, వంద ఎలుక‌లు తిన్న పిల్లి తీర్ధ‌యాత్ర‌ల‌కు పోయిన‌ట్లు హ‌రీష్ రావు ఇప్పుడు బాధితుల ప‌రామ‌ర్శ‌కు బ‌య‌లుదేరారని ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. ఖ‌మ్మంలో మాజీ మంత్రి పువ్వాడ ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపునకు హ‌రీష్ రావు చిత్త‌శుద్దితో స‌హ‌క‌రిస్తారా..? ద‌గ్గ‌ర ఉండి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింప‌జేస్తారా అని ముఖ్య‌మంత్రి స‌వాల్ విసిరారు. ఖ‌మ్మంలో పువ్వాడ ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించి వాస్త‌వాలు వెలికితీయాల‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు… తాము అధికారంలోకి వ‌చ్చాక తొలిసారిగా వేసిన టెండ‌ర్ ఖ‌మ్మం మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుకేన‌ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. ప్ర‌స్తుతం అంత‌కు మించిన ఎత్తులో నీరు వ‌చ్చినందున.. ఆ ఎత్తు పెంపు స‌మీక్షిస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

రెండింటిని పోల్చి చూసుకోండి

తెలంగాణ‌లోని ఖ‌మ్మం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లాలు క‌వ‌ల పిల్ల‌ల వంటివ‌ని, కృష్ణాతో పోల్చితే ఖ‌మ్మంలోనే ఎక్కువ న‌ష్టం వాటిల్లింద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, అధికారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో మ‌రింత న‌ష్టం వాటిల్ల‌కుండా చూసుకోగ‌లిగామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు…. తాను కంటిపై కునుకు లేకుండా ప‌ర్య‌వేక్ష‌ణ చేశాన‌ని సీఎం చెప్పారు… ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో త్వ‌ర‌గా చేరుకోవ‌డానికి వీలుగా హెలీకాఫ్ట‌ర్ల‌ను పంపుతార‌ని, ఖ‌మ్మానికి విజ‌య‌వాడ ద‌గ్గ‌ర ఉన్నందునే అక్క‌డ‌కు హెలీకాఫ్ట‌ర్లు చేరుకున్నాయ‌ని.. ఈ స‌మ‌యంలో ప్రాంతం, రాజ‌ధాని వంటివి చూసుకోకూడ‌ద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. భారీగా న‌ష్టం వాటిల్లినందునే కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని రాష్ట్రంలో ప‌ర్య‌టించాల‌ని కోరామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

ఏనాడైనా బాధితుల‌ను ప‌రామ‌ర్శించారా..?

ప‌దేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడైనా వ‌ర‌ద, ప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శించారా అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. వ‌ర‌ద బాధితుల వ‌ద్ద‌కు ఏనాడూ కేసీఆర్ వెళ్ల‌లేద‌ని, సొంత నియోజ‌వ‌క‌ర్గం మాసాయిపేట‌లో రైలు ప్ర‌మాదంతో చిన్నారులు చ‌నిపోయినా, హైద‌రాబాద్ ఓఆర్ఆర్ లో ప‌శు వైద్యురాలు అత్యాచారానికి, హ‌త్య‌కు గురైతే క‌నీసం వాళ్ల కుటుంబ స‌భ్యుల‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించ‌లేద‌ని ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నేత‌లు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నార‌ని కేసీఆర్ ఏం చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న కేటీఆర్ క్షేత్రంలో ఉండి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్న మంత్రుల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌దేళ్ల‌లో దోచుకున్న రూ.ల‌క్ష కోట్ల నిధుల్లో రూ.వెయ్యి కోట్లో… రూ. రెండు వేల కోట్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాల‌ని కేసీఆర్ కుటుంబానికి ముఖ్య‌మంత్రి సూచించారు.

సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు

వ‌ర‌ద స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు గానూ ముఖ్య‌మంత్రి ఉప‌శ‌మ‌న నిధి (సీఎంఆర్ఎఫ్‌) రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ ఒక రోజు మూల వేత‌నం రూ.135 కోట్ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి చెక్ రూపంలో అంద‌జేశారు. వారికి ముఖ్య‌మంత్రి అభినంద‌నలు తెలిపారు.

మ‌హ‌బూబాబాద్ కు చెందిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని ముత్యాల సాయి సింధు రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు తాను దాచుకున్న రూ.3 వేల‌ను ముఖ్య‌మంత్రికి అంద‌జేశారు. విద్యార్థినిని ముఖ్య‌మంత్రి అభినందించారు. రాష్ట్రంలోని స్వ‌చ్ఛంద సంస్థ‌లు, కార్పొరేట్ సంస్థ‌లు వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు రావాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా స‌మీక్ష‌లో మంత్రులు సీత‌క్క‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ఎంపీ బ‌ల‌రాం నాయ‌క్‌, ఎమ్మెల్యేలు ముర‌ళీ నాయ‌క్‌, రామ‌చంద్ర నాయ‌క్‌, య‌శ‌స్వినీ రెడ్డి, గండ్ర స‌త్యానారాయ‌ణ‌రావు, నాగ‌రాజు, కోరం క‌న‌క‌య్య‌, అధికారులు పాల్గొన్నారు.