Woman is head of the house in the Family Digital Card

Cm Revanth Reddy Conducted A Review On Issuing The Family Digital Cards At Secretariat 28 09 2024 (3)
  • Ration, Health and other scheme details will be included in the single Family Digital Card
  • Family households will be determined based on currently available data
  • Field level study on a pilot project from October 3

Chief Minister Sri A Revanth Reddy ordered the officials to consider a Woman as the owner of the house and other family members will be mentioned on the back of the digital family card which is being issued soon in the state.

Cm Revanth Reddy Conducted A Review On Issuing The Family Digital Cards At Secretariat 28 09 2024 2

The Chief Minister conducted a review on issuing the Family Digital Cards (FDC) at the State Secretariat on Saturday. The authorities gave a PowerPoint presentation on the study on family digital cards conducted in Rajasthan, Haryana, Karnataka and Maharashtra from October 25 to 27. The officials explained to the CM the details collected from the states and the design of the cards and also the advantages and disadvantages.

After reviewing the use of family digital cards in other states, the CM gave orders to the officials on the design of family digital cards. CM Revanth Reddy suggested that families should be identified on the basis of the available data in the existing ration cards, Rajiv Arogyasri, IT, agriculture and other welfare schemes. The Chief Minister instructed the officials to adopt the best practices in the design and issuance of cards from the other states and also rectify the defects. The CM suggested the officials stop collecting unnecessary information like bank accounts and PAN cards.

Cm Revanth Reddy Conducted A Review On Issuing The Family Digital Cards At Secretariat 28 09 2024 4

The government will launch a pilot project to Issue family digital cards in two habitations in every assembly segment

The Chief Minister instructed the officials to submit the details related to the compilation of the information of the family details with updates in the form of a report to the cabinet subcommittee consisting of ministers – N Uttam Kumar Reddy, P Srinivas Reddy and Damodara Rajanarasimha. The CM also asked the officials to prepare a comprehensive list of items which are to be added and deleted as per the recommendations of the Cabinet Sub-Committee.

The Chief Minister instructed the officials to identify two areas ( two rural areas in the complete rural segments and two Wards or Divisions in urban segments) in all 119 Assembly Constituencies for taking up issuing family digital cards on a pilot basis. The authorities have been asked to conduct the field study (door to door) in the selected areas on a pilot project from October 3 based on the available data regarding the identification of families and details of family digital cards.

Cm Revanth Reddy Conducted A Review On Issuing The Family Digital Cards At Secretariat 28 09 2024 1

CM Revanth Reddy asked the officials to appoint RDO rank officers in every rural assembly segment and Municipal Zonal Commissioner rank officials in the urban segment to monitor the survey of the identification of the families in the pilot project. The CM instructed the state Chief Secretary to appoint the senior officials, who been appointed to monitor the floods in the recent heavy rains, as the Monitoring Officials ( Supervisors).

The Chief Minister warned that the field-level inspection should be carried out thoroughly and accurately to ensure that no errors are reported. Ministers- N Uttam Kumar Reddy, Ponguleti Srinivas Reddy, Damodara Raja Narasimha, Ponnam Prabhakar, Adviser to the Chief Minister Vem Narender Reddy, Chief Secretary Santji Kumari, Principal Secretary to the Chief Minister V. Seshadri, Special Secretary to the Chief Minister Ajith Reddy, Chandrasekhar Reddy, Chief Minister’s Secretaries Sangeeta Satyanarayana, Manik Raj, Shanwaz Qasim, Chief Minister OSD Vemula Srinivas and officials of various departments also participated.

కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని

  • ఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు
  • ప్ర‌స్తుత అందుబాటులోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధ‌ర‌ణ‌
  • అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌

కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు (ఎఫ్‌డీసీ) సంబంధించి రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వ తేదీ వ‌ర‌కు రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల్లో ప‌ర్య‌టించిన అధికారులు చేసిన అధ్య‌య‌నంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేక‌రించిన వివ‌రాలు, కార్డుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు, లోపాల‌ను అధికారులు వివ‌రించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ రూపకల్పనపై అధికారుల‌కు ప‌లు ఆదేశాలు, సూచ‌న‌లు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఉన్న రేష‌న్, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌, ఐటీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధార‌ణ చేయాల‌ని సూచించారు. ఇత‌ర రాష్ట్రాల కార్డుల రూప‌క‌ల్ప‌న‌, జారీలో ఉన్న మేలైన అంశాల‌ను స్వీక‌రించాల‌ని, లోపాల‌ను ప‌రిహారించాల‌న్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అన‌వ‌స‌ర స‌మాచారం సేక‌రించాల్సిన ప‌ని లేద‌న్నారు.

ప్ర‌తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో పైలెట్‌గా రెండు ప్రాంతాల్లో

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు స‌మ‌చార సేక‌ర‌ణ‌, వాటిల్లో ఏం ఏం పొందుప‌ర్చాలి, అప్‌డేట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ల‌తో కూడిన మంత్రివ‌ర్గ ఉప సంఘానికి అంద‌జేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రివ‌ర్గ ఉప సంఘం సూచ‌న‌ల మేర‌కు అందులో జ‌త చేయాల్సిన‌, తొల‌గించాల్సిన అంశాల‌ను స‌మ‌గ్ర జాబితా రూపొందించాల‌ని సూచించారు. అనంత‌రం రాష్ట్రంలోని 119 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు ప్రాంతాలు ఒక గ్రామీణ‌, ఒక ప‌ట్ట‌ణ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాల‌ని సీఎం సూచించారు. (పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు గ్రామాలు, పూర్తిగా ప‌ట్ట‌ణ‌/న‌గ‌ర ప్రాంతాలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు వార్డులు/ డివిజ‌న్లను ఎంపిక చేస్తారు.) కుటుంబాల నిర్ధ‌ర‌ణ‌, ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వివ‌రాల‌కు సంబంధించి అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా అక్టోబ‌రు మూడో తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి (డోర్ టూ డోర్‌) ప‌రిశీల‌న చేయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు.

పైలెట్ ప్రాజెక్టును ప‌క‌డ్బందీగా చేపట్టాల‌ని, ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, ప‌ట్ట‌ణ‌/న‌గ‌ర ప్రాంతాల్లో జోన‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి అధికారిని ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నియ‌మించాల‌ని, ప్ర‌తి ఉమ్మ‌డి జిల్లాకు ఇటీవ‌ల వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వేసిన సీనియ‌ర్ అధికారుల‌ను ప‌ర్య‌వేక్ష‌కులుగా నియ‌మించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న స‌మ‌గ్రంగా క‌చ్చిత‌త్వంతో చేప‌ట్టాల‌ని, ఎటువంటి లోపాల‌కు తావులేకుండా చూడాల‌ని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు.

స‌మీక్ష‌లో మంత్రులు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శులు అజిత్ రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు సంగీత స‌త్యానారాయ‌ణ‌, మాణిక్ రాజ్‌, షాన‌వాజ్ ఖాసీం, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీ‌నివాస్‌, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Telangana Rising