95th Birth Anniversary Celebrations of G Venkataswamy

95th Birth Anniversary Celebrations Of G Venkataswamy 05 10 2024 (5)

Chief Minister Sri A Revanth Reddy attended the 95th birth anniversary celebrations of Sri G Venkataswamy in Hyderabad on Saturday.

CM’s Speech Points:

95th Birth Anniversary Celebrations Of G Venkataswamy 05 10 2024 3

Venkataswamy was fondly called as ‘Kaka’ who is one among a few leaders from Telangana who rose to national level. Don’t know if the past leaders saw ‘Kaka’ from the Congress party’s point of view or if they wanted to distance him from the people.

Ordered the officials to organize Kaka’s birth anniversary celebrations officially by the government. Venkataswamy convinced Congress leader Sonia Gandhi in the formation of Telangana State without any hindrance.

The leaders who took Kaka’s help to win the elections are boasting about themselves today. After coming to power, the past rulers neglected to celebrate Kaka’s birth anniversary officially.

Kaka is the man of the poor and always stood by them. The senior leader provided housing to 80,000 people and also saved the Singareni organization by supporting the workers.

95th Birth Anniversary Celebrations Of G Venkataswamy 05 10 2024 1

People called Venkataswamy as kaka with great affection like Nehru is called Chacha. Venkataswamy gave his house to run the Congress party office. We owed the responsibility of taking forward Kaka’s aspirations. The party’s idea is to involve Kaka’s family actively in making decisions by the state government.

Appealing to all people living along Musi river that the government will protect every single displaced person and take responsibility of providing alternatives to them.

The government will support those living in the buffer zone and FTL of the Musi River. Don’t get carried away by the provocations and instigating comments by the opposition. The government is going ahead with a clear policy. The opposition leaders are raising the displaced issues only to protect their farm houses from demolitions.

Appealing to the poor from this platform, the government is always thinking for the wellbeing of the poorer sections. People living along Musi need not to worry.

Government is ready to spend Rs 10,000 crore to help the displaced poor along the Musi River.

Appealing to Eatala Rajender, KTR and Harish Rao to make suggestions for the welfare of the poor living in the Musi catchment area. The government is not angry with anyone. The government’s agenda is to do good for people.

If required, the government is ready to construct houses at Malakpet Race Court and Amberpet Police Academy in Hyderabad for the poor. Let all think and come forward for the wellbeing of the poorer sections.

We are not expecting the opposition to donate their assets, but at least make some good suggestions with their experience. It is not good on part of the opposition to obstruct the government like the Kalakeya gang from doing good to the poor.

The opposition waived only Rs 11,000 crore farm loans in five years and the Congress government waived off Rs. 18,000 crore loans in just one month.

Appealing to the farmers to stop taking to the streets and instead meet the Collectors to solve their problems. Some people are dreaming to come to power by using social media. They will not come to power with social media and it is certain they will go to Cherlapally jail.

రవీంద్ర భారతిలో జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, నాగరాజు, ఇతర నేతలు, అధికారులు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరు..
  • గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో.. లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదు…
  • కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని నేను అధికారులను ఆదేశించా..
  • ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియమ్మను ఒప్పించారు…
  • ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో గెలిచేందుకు కాకా సహకారం తీసుకున్నారు…
  • అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారు.
  • కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..
  • 80వేల మందికి పైగా నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకాది.
  • ఆనాడు సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి కాకా.
  • జాతీయ స్థాయిలో నెహ్రూ ను చాచా అని పిలిస్తే.. రాష్ట్రంలో గడ్డం వెంకటస్వామిని కాకా అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటారు.
  • జాతీయ కాంగ్రెస్ కార్యాలయానికి తన ఇంటిని ఇచ్చేసిన కాంగ్రెస్ వాది కాకా..
  • కాకా ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉంది..
  • రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కాకా కుటుంబ సభ్యుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నది పార్టీ ఆలోచన.
  • మూసీ పరివాహక ప్రాంతాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా
  • ప్రభుత్వం మిమ్మల్ని అనాథలను చేయదు.. మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది.
  • మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుంది..
  • రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు… ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుంది..
  • ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు పేదల ముసుగు అడ్డుపెట్టుకునే వారి మాటలు వినొద్దు.
  • ఈ వేదికగా పేదలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. మీ మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది..
  • మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురికావద్దు…
  • మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది..
  • • ఈటెల, కేటీఆర్, హరీష్ కు సూచన చేస్తున్నా.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి..
  • మా ప్రభుత్వానికి ఎవరిపై కోపం లేదు.. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా..
  • నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు..
  • మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?
  • కాకా స్పూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిద్దాం..
  • అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్టును, అంబర్ పేట్ పోలీస్ ఆకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి పేదలకు ఇండ్లు కట్టిద్దాం..
  • పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి..
  • మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి..
  • అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు.
  • ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం రూ.18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం..
  • దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్ ను కలవండి..
  • సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు….
  • సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం..

Telangana Rising