- Job recruitment is a continuous process…
- Getting a teacher’s job is an emotion..
- Government policy is to provide quality education to the poor.
- Integrated Residential Schools in 100 Assembly Constituencies
- Appointment orders will be given on October 9 at the LB Stadium
Chief Minister Sri A Revanth Reddy said that the teaching profession is not only a job but is closely attached to emotion. The CM said that the unemployment problem played a key role during the Telangana movement and the objective of the struggle for separate state is for job recruitment. The chief minister made it clear that job recruitment is a continuous process in his government.
CM Sri Revanth Reddy released the DSC-2024 results at the state secretariat on Monday. The CM said that the KCR government conducted a single DSC exam and filled only 7,857 posts during the ten-year rule. The People’s government conducted DSC to fill 11,062 posts within 10 months of coming to power. The certificate verification will be carried out in a 1:3 ratio for each post. The appointment letters will be given to the selected candidates at LB Stadium on October 9 and fill their homes with a festive atmosphere even before the beginning of the Dussehra festivities, the CM declared.
The Chief Minister said that the unemployed youth requested to conduct the TET after the DSC notification was issued. Considering their plea, the government conducted TET and helped 1,09,168 job aspirants to get eligibility for the DSC exam. The Computer Based Test (CBT) has been conducted in 26 sessions from July 18 to August 5 for the DSC written exam. The CM congratulated the officials of the Education Department for conducting the DSC and TET exams in an efficient manner.
Integrated Residential Schools in 100 Assembly Constituencies
CM Revanth Reddy said that the government decided to establish integrated residential schools, aiming to provide quality education to poor students in 100 Assembly constituencies in the state. The CM criticized that the previous governments established SC, ST, BC and minority institutions separately which created a sense of inferiority among the children. The integrated residential school will be set up in a sprawling 20 to 25 acres in each constituency at the cost of Rs 100 crore. The official process has already started in Kodangal and Madhira constituencies and these integrated residential schools will be set up on par with Corporate school standards. The CM criticized the previous KCR government for its indifference to providing education to the poor and it was the main reason the last government issued only one DSC notification in ten year rule.
The Congress government proved its commitment to giving priority to education by issuing DSC notification within two months of coming to power in the state, the Chief Minister said that the previous government neglected education by allocating meager funds. The present government enhanced allocations to education and will also increase funds in the future. The previous government established residential schools in rented houses and poultry farms without minimum basic facilities. The CM said that some media agencies, owned by some political outfits, are spreading false propaganda about the problems in the hostels. These problems are the result of the irresponsibility of the previous government. The opposition is criticizing the present government for the lack of facilities in the residential schools, the Chief Minister said it is the reason the government decided to set up integrated residential schools. The CM lambasted the last government for not taking up the promotions and transfers of teachers for years. The Congress government took up the process for transfers and promotions soon after coming to power in the state and completed it without any controversy.
Chief Minister Revanth Reddy said that the government considered spending on education a big investment and not a financial burden. All the government schools will be run irrespective of the number of students enrolled. The CM said while replying to a question.
Government‘s objective is job recruitment
Aiming to support the unemployed, CM Revanth Reddy said that 30,000 appointment letters are given to the selected candidates within 30 days of coming to power. TGSPC has been completely reformed to recruit the Group 1, 2 and 3 posts in a transparent manner. The Chief Minister said that the exams have been conducted without any errors. The government addressed the unemployment problem by filling 60,000 jobs in the first year.
State Ministers Damodara Raja Narasimha, Tummala Nageswara Rao, Ponguleti Srinivas Reddy, Konda Surekha, State Government Advisor Kesava Rao, Chief Minister Advisor Vem Narender Reddy, Education Commission Chairman Akunuri Murali are present. Secretary to the Education Department Burra Venkatesham, Education Commissioner EV Narasimha Reddy and Additional Director K. Lingaiah also participated.
DSC details:
- DSC Notification: February 29, 2024
- Total Posts: 11,062
- School Assistant (SA): 2,629
- Language Pandits (LP): 727
- Physical Education Teachers (PET): 182
- Secondary Grade Teachers (SGT): 6,508
- School Assistant (Special Educators): 220
- Secondary Grade Teachers (Special Educators): 796
- Total applications for DSC Exam: 2,79,838
- Appeared for the written test: 2,46,584 (88.11 percent)
For General Ranking List: https://schooledu.telangana.gov.in/
ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ
- టీచర్ ఉద్యోగం ఉద్యోగం కాదు.. భావోద్వేగం..
- పేదలకు మంచి విద్యను అందించడమే మా విధానం..
- వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్
- డీఎస్సీ ఫలితాల ప్రకటనలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
- 9వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో నియామక ప్రతాలు అందజేస్తామని ప్రకటన
ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం కాదని భావోద్వేగమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగమనేది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉందని, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డీఎస్సీ-2024 ఫలితాలను రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో కేవలం ఒకసారి డీఎస్సీ నిర్వహించి 7,857 పోస్టులు భర్తీ చేస్తే, తమ ప్రజా ప్రభుత్వం పది నెలల్లోనే 11,062 పోస్టులకు డీఎస్సీ నిర్వహించిందని తెలిపారు. ప్రతి పోస్టుకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు 9వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని, ఆయా అభ్యర్థుల కుటుంబాల్లో దసరా పండగకు ముందే పండగ వాతావరణం నెలకొనేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత టెట్ నిర్వహించాలని నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తి వస్తే మరోసారి టెట్ నిర్వహించగా డీఎస్సీ రాసేందుకు అదనంగా 1,09,168 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ముఖ్యమంత్రి చెప్పారు. డీఎస్సీ రాత పరీక్షలను జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు 26 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించినట్లు సీఎం తెలిపారు. డీఎస్సీ, టెట్ నిర్వహణలో సమర్థంగా వ్యవహరించారని, బాగా కష్టపడ్డారని విద్యా శాఖ అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్….
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా తెలంగాణవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు వేర్వురుగా ఉండడంతో పిల్లల్లో ఆత్మనూన్యత భావం ఏర్పేడదని.. దానిని తొలగించి వారి సమగ్ర వికాసానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో.. రూ.వంద కోట్లతో ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు విద్యను అందించాలనే ఆలోచన గత కేసీఆర్ ప్రభుత్వానికి లేదని, అందుకనే పదేళ్లలో కేవలం ఒక్క డీఎస్సీ మాత్రమే వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే డీఎస్సీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని, తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శమని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం విద్యా శాఖను నిర్లక్ష్యం చేసిందని, బడ్జెట్ కేటాయింపులు తక్కువగా చేసేదని, తాము అధికారంలోకి వచ్చాక విద్యా శాఖకు నిధుల కేటాయింపు పెంచామని, భవిష్యత్‌లో నిధులు మరింతగా కేటాయిస్తామని సీఎం అన్నారు. గత ప్రభుత్వం కోళ్ల షెడ్లు, అద్దె గృహాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేసిందని, కనీస మౌలిక వసతులు కల్పించలేదన్నారు. ప్రస్తుతం ఆయా వసతిగృహాల్లో ఎదురవుతున్న సమస్యలపై కొన్ని పార్టీలకు చెందిన మీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే ఆ సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఆయా పాఠశాలల్లో వసతులు లేవంటూ తమపై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అందుకే తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఏళ్ల తరబడి టీచర్ల ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టలేదని సీఎం విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎటువంటి వివాదాలకు తావు లేకుండా బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ చేపట్టామని ఆయన తెలిపారు. విద్యపై పెట్టేది ఖర్చు కాదని.. పెట్టుబడి అని తాము భావిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ఉద్యోగా నియామకాలే లక్ష్యంగా
నిరుద్యోగులకు అండగా నిలవడం, ఉద్యోగ నియామకాలే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గ్రూప్ 1, 2, 3 పోస్టులను అంగడీ సరకుల్లా మార్చిన టీజీ పీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తంగా మొదటి ఏడాదిలోనే 60వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామని సీఎం చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యా శాఖ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డి, అదనపు డైరెక్టర్ కె.లింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంక్షిప్తంగా
- డీఎస్సీ నోటిఫికేషన్: 2024, ఫిబ్రవరి 29
- మొత్తం పోస్టులు: 11,062
- స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ): 2,629
- భాషా పండితులు (ఎల్పీ): 727
- వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు (పీఈటీ): 182
- సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ): 6,508
- స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేటర్స్): 220
- సెకండరీ గ్రేడ్ టీచర్స్ (స్పెషల్ ఎడ్యుకేటర్స్): 796
- డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు: 2,79,838
- రాత పరీక్షకు హాజరైన వారు: 2,46,584 (88.11 శాతం)
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌కు: https://schooledu.telangana.gov.in/