CM meeting with Govt. and Local Body Teachers

Chief Minister Sri A Revanth Reddy Meeting With Government And Local Body Teachers 02 08 2024 (7)

Chief Minister Sri A Revanth Reddy participated in the meeting with Government and Local Body teachers at LB Stadium on Friday.

Chief Minister Sri A Revanth Reddy Meeting With Government And Local Body Teachers 02 08 2024 2

CM Sri Revanth Reddy’s speech points:

The future of Telangana lies in LB Stadium as 30,000 teachers gathered here in the important meeting. Parents of 26 lakh students in 30,000 government schools put their children’s future in your hands. The role of teachers during the Telangana movement is commendable.

We expect the education system will be improved and the teachers will get more respect in the new Telangana state. We hope that noted people like Kodandaram, Haragopal and Chukka Ramaiah will also receive great respect. We witnessed what happened in Telangana state. The previous government insulted the teachers.

Chief Minister Sri A Revanth Reddy Meeting With Government And Local Body Teachers 02 08 2024 4

My government planned to allocate 10 percent of the budget for education. In view of the implementation of the Six Guarantees, the government allocated 7.3 percent ( Rs 21,000 crore ) to education.

Currently, 26 lakh students are pursuing studies in 30, 000 government schools. 33 lakh students are studying in 10,000 private schools. Do private schools have better teachers than government schools? Due to the lack of basic facilities in government schools, students are joining private institutions.

It is a fact that the condition of employees in Telangana is worse than in the erstwhile united Andhra Pradesh. Teachers are like honeycombs. If anyone tries to disturb them, they will be assaulted.

The government took all measures to pay salaries on the first of every month to instill confidence. Resolved the issue of teachers’ promotions which have been pending for the last 15 years.

Chief Minister Sri A Revanth Reddy Meeting With Government And Local Body Teachers 02 08 2024 6 1

The government organized this meeting to send a message that the government is ready to address the teachers’ problems. The Telangana future is in your hands.

I have studied in the government school and reached this level. The objective of holding this meeting is to interact with the government teachers.

All the teachers should work with more commitment and provide quality education to the students. Student admissions in government schools decreased by more than 2 lakh this year. Government schools should be upgraded to attract the students to join and studying in government schools should be considered as self-respect.

Chief Minister Sri A Revanth Reddy Meeting With Government And Local Body Teachers 02 08 2024 3

Government is open to solving the government teachers problems. Self Help Groups have been entrusted with the responsibility of improving infrastructure in government schools. The schools are called Amma Adarsh Schools.

Ordered the authorities to provide free electricity to all government schools. Everyone should work with a commitment to build a strong Telangana.

The government will take special measures to promote sports. The government is mulling to establish mini stadiums in mandal headquarters.

The unemployment rate has been increasing due to a lack of skills. The laid foundation stone for Young India Skill University at the cost of Rs.150 crores on a sprawling 50 acres at Mucherla. Skill development training and jobs will be provided to the youth in Skill University.

New Sports policy will be adopted to promote sports. Your teaching to the students will pave the way to a strong Telangana. Teachers should take initiative to provide education to more poor students.

ఎల్​ బీ స్టేడియంలో కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం.

ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే…
  • వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా..
  • 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్ ను మీ చేతుల్లో పెట్టారు.
  • తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిది.
  • రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం..
  • కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం..
  • కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం..
  • గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం
  • ఈ బడ్జెట్ లో విద్యకు 10శాతం కేటాయించాలని భావించాం.
  • కానీ హామీల అమలు దృష్ట్యా 7.3శాతం అంటే రూ.21వేల కోట్లకు పైగా కేటాయించాం.
  • ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30వేల పాఠశాలల్లో.. 26లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు..
  • 10వేల ప్రయివేట్ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు..
  • ప్రయివేట్ పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా?
  • మౌళిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు..
  • తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది… ఇది కఠోర నిజం
  • టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు.
  • ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తారీఖునే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం.
  • పదిహేనేళ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం..
  • మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం.
  • తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం..
  • ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా…
  • అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం.
  • టీచర్లంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు విద్యనందించాలి..
  • గత ఏడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి.
  • ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి.
  • ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు.
  • ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం..
  • అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం..
  • ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించాం.
  • తెలంగాణ బలపడాలి అంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలి.
  • క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది.
  • గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
  • నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది..
  • అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం.
  • స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.
  • క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం.
  • మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్ కు బాటలు వేస్తుంది..
  • పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలి..
Telangana Rising