
CM Sri. A. Revanth Reddy participated in Vigyan Vaibhav – 2025 at Gachibowli Stadium, Hyderabad.
రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ మేరకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలన్నారు. దేశ రక్షణ రంగానికి ముఖ్య కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని కోరారు.