ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు బయలుదేరుతోంది. ఈ నెల 16 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా తదితర నగరాల్లో పర్యటన సాగుతుంది.
తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహకారం ప్రధాన ఉద్దేశంగా సాగుతున్న ఈ పర్యటనలో పలు సంస్థలతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం చర్చలు జరుపుతుంది. అధికారుల బృందం ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఉంటారు.
జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమవుతుంది. ‘ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో -2025’ లో తెలంగాణ పెవీలియన్‌ను ప్రారంభిస్తారు.