CM Sri Revanth Reddy Releases Gazette Notification on SC Sub-Categorization on Ambedkar Jayanti.

Minister And Cm Pic

సామాజిక న్యాయం కోసం అందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో, డా. బీఆర్ అంబేద్కర్ గారి జయంతి నాడు ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ ఉపసంఘం జీవో తొలి కాపీని అందజేసింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి గారు, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, పోరిక బలరాం నాయక్ గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.