Hon’ble CM Sri A. Revanth Reddy reviewed the Bhoo Bharati portal, directing officials to make it simple, secure, and farmer-friendly. He stressed quick resolution of land issues, strong firewalls, and reliable long-term management.

Bhu Bharathi

సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్లపాటు నడిచే భూ భారతి వెబ్‌సైట్‌ను రూపొందించాలని, భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

జూబ్లీ హిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి గారు భూ భారతి పోర్టల్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

భూ భారతి వెబ్‌సైట్ సరళంగా, పారదర్శకంగా ఉండాలని, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా దాన్ని రూపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.