World Bank delegation meets CM

World Bank Delegation Meets Cm Revanth Reddy 21 09 2024 (4)
  • The Bank delegation praises the Telangana Government
  • World Bank is ready to support govt

The World Bank extolled the Telangana Government for its priorities in the development of the state. Chief Minister Sri A Revanth Reddy already held a meeting with World Bank President Ajay Banga in Washington last month.

For further talks, an official delegation led by the World Bank’s South Asia Vice President Martin Raiser called on CM Revanth Reddy at the Secretariat on Saturday. The team consisting of World Bank Country Operation Head Paul Procy, Urban Infra, Project Lead Natalia Kay, and Digital Development Senior Specialist Mahimapath Ray met the CM.

On this occasion, the Chief Minister explained to the World Bank team about the state government’s priorities for the development of urban infrastructure, education, medical care and irrigation facilities. The CM requested the World Bank to provide financial support to the projects that are being taken up on priority and also cooperate in the construction of Telangana projects to high standards.

World Bank Delegation Meets Cm Revanth Reddy 21 09 2024 8

Martin Raiser appreciated CM Revanth Reddy’s vision in strengthening the education and medical facilities and the decisions taken to meet future needs. Martin Raiser observed that the priorities of the World Bank and Telangana Government are the same and the World Bank is interested in extending cooperation to the Telangana government.

World Bank Delegation Meets Cm Revanth Reddy 21 09 2024 7

State Irrigation Minister N Uttam Kumar Reddy, Chief Secretary Shanti Kumari, Chief Minister Principal Secretary V. Seshadri, CM Special Secretary Ajith Reddy, Sangeeta Satyanarayana, Finance Wing Special Chief Secretary Ramakrishna Rao, State Municipal and Urban Development Department Principal Secretary Dana Kishore, Health Department Secretary Christina Z. Chongthu and other senior officials are also present.

తెలంగాణ ప్ర‌భుత్వ‌ ప్రాధాన్య‌త‌లు భేష్

  • ప్ర‌పంచ బ్యాంక్ ప్ర‌తినిధి బృందం ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డితో భేటీ

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విష‌యంలో ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు బాగున్నాయ‌ని ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధి బృందం ప్ర‌శంసించింది. గ‌త నెల‌లో వాషింగ్ట‌న్‌లో ప్ర‌పంచ‌బ్యాంక్ అధ్య‌క్షుడు అజ‌య్ బంగాతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో తదుప‌రి చ‌ర్చ‌ల కోసం ప్ర‌పంచ‌బ్యాంకు ద‌క్షిణాసియా ప్రాంత ఉపాధ్య‌క్షుడు మార్టిన్ రైజ‌ర్ నేతృత్వంలో వ‌ర‌ల్డ్ బ్యాంక్‌ కంట్రీ ఆప‌రేష‌న్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బ‌న్ ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ న‌టాలియా కే, డిజిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ సీనియ‌ర్ స్పెష‌లిస్ట్ మ‌హిమాప‌త్ రే శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చారు.

రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో వారు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్ట‌ణ మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, విద్యా, వైద్య‌, సాగు నీటి రంగాల‌ను త‌మ ప్ర‌భుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామ‌ని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వారికి వివ‌రించారు. తాము ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టుల‌కు ఆర్థిక స‌హకారంతో పాటు అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో తెలంగాణ ప్రాజెక్టులు నిలిచేందుకు స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. విద్యా, వైద్య రంగాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దార్శ‌నిక‌త బాగుంద‌ని, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని మార్టిన్ రైజ‌ర్ ప్ర‌శంసించారు. ప్ర‌పంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్ర‌భుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయ‌ని మార్టిన్ రైజ‌ర్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించేందుకు తాము ఆస‌క్తిగా ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు.

స‌మావేశంలో రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, మాణిక్ రాజ్‌, ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్‌, వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి క్రిస్టియానా జోంగ్తూ, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Telangana Rising