Passing out parade at Telangana Police Academy

Cm Revanth Reddy Participated In The Passing Out Parade At Telangana Police Academy 11 09 2024 (5)

Chief Minister Sri A Revanth Reddy participated in the passing out parade at Telangana Police Academy in Hyderabad on Wednesday.

Cm Revanth Reddy Participated In The Passing Out Parade At Telangana Police Academy 11 09 2024 4

CM Sri Revanth Reddy’s speech points:

The seperate state of Telangana has been achieved from the sacrifices of the youth. The aspirations of the youth have not been fulfilled for the last nine years.

People’s government has been formed with the support of people in the state. The Congress government filled 30,000 jobs within three months of coming to power.

The government strengthened the Telangana State Public Service Commission. A decision to postpone the Group 2 exam was taken in favour of the unemployed. The job aspirants and unemployed youth are preparing for competitive exams with enthusiasm.

Cm Revanth Reddy Participated In The Passing Out Parade At Telangana Police Academy 11 09 2024 2

Worrying about drug and Ganja addiction by the youth and increasing cyber crimes. The drug menace should be rooted out with an iron hand. After seeing all the trained cops, I am confident that Telangana will become a drug free State soon. It’s not a job responsibility but an emotion.

It is everyone’s responsibility to rebuild the Telangana State and create a bright future for future generations. Police are the first to respond when a problem arises. Let us all strive hard to eradicate drug and ganja abuse. Even the thought of drugs should send shivers down the spine.

Police should instill confidence among people that they are the protectors of the state.

Government will set up a Residential Police School for police children on a sprawling 50 acres in Hyderabad. Another police school will come up on 50 acres in Warangal. Instructing the authorities to complete the establishment of a police school in Hyderabad in two years.

State needs concrete policing and not cosmetic policing. Friendly policing is only for the victims, not criminals.

Cm Revanth Reddy Participated In The Passing Out Parade At Telangana Police Academy 11 09 2024 1

The government is not only attracting investments and also supported farmers, weavers and Toddy Tappers. The government waived off Rs 18,000 crore farm loans and deposited the amount in 22.22 lakh farmers accounts in just 28 days. The government is mobilizing funds and clearing the debts to bring cheers in the lives of the farmers.

Some people are making comments on HYDRA irresponsibly. Floods are happening due to encroachment of ponds, lakes and canals. Poor people are at the receiving end due to such big natural calamities. It is the reason the water bodies are being saved from the encroachments. Government will not hesitate to send those encroachers to jail.

Cm Revanth Reddy Participated In The Passing Out Parade At Telangana Police Academy 11 09 2024 7

Appealing to all illegal occupants of the water bodies to leave the encroached places voluntarily. If they did not budge, the government will demolish all illegal structures at the lakes.

All the encroachments will also be removed for Musi Riverfront Development project. Double bedroom houses will be constructed for the permanent residents along Musi river. Government will provide rehabilitation to all 11,000 residents.

No question of regularisation of the structures in the FTL and buffer Zones.

Cm Revanth Reddy Participated In The Passing Out Parade At Telangana Police Academy 11 09 2024 6

హిమాయత్ సాగర్ లోని రాజా బహదూర్ వెంకటరాం రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్.ఐ,ఎ.ఎస్.ఐ ల పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.

పోలీస్ విభాగం తరపున రూ.11 కోట్ల 6లక్షల 83వేల 571 ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెక్ ను అందజేసిన డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులు.

కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:
• యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం.
• తెలంగాణ వచ్చినా గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు.
• ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.
• అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.
• తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం.
• గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం.
• తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.
• వ్యసనాలకు బానిసలైన కొంతమంది… డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
• డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలి.
• మీ అందరిని చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోంది.
• ఇది ఉద్యోగ బాధ్యత కాదు.. ఇది భావోద్వేగం.
• తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మనపై ఉంది
• ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే
• డ్రగ్స్ , గంజాయిపై ఉక్కు పాదం మోపుతాం..
• డ్రగ్స్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి.
• తెలంగాణను కాపాడుకునేందుకే ఖాకీ డ్రస్సులనే విశ్వాసం ప్రజలకు కల్పించండి.
• 50 ఎకరాల్లో హైదరాబాద్ లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.
• 50 ఎకరాల్లో వరంగల్ లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.
• రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
• కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం.
• ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదు.
• మా ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదు.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోంది.
• కేవలం 28 రోజుల్లోనే 22 లక్షల 22 వేల 685 రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేసి రుణమాఫీ చేసాం.
• కడుపు కట్టుకుని నిధులు సేకరించి రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.
• హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
• చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి.
• వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి.
• అందుకే చేరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం
• అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడం.
• ఆక్రమించుకున్న చెరువులను స్వచ్చందంగా వదలాలని ఆక్రమనదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా..
• లేకపోతే చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతాం.
• నాలాల ఆక్రమణలను నిరభ్యంతరంగా కూల్చేస్తాం..
• ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తాం..
• మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తాం.
• నివాసితులైన 11వేల మందిలో ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది
• ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదు.
• పోలీస్ అకాడమీలో క్రీడాభవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.