- Big festive celebration on December 9 in the presence of lakhs of Telangana citizens.
- Previous rulers neglected Telangana Talli in the 10 years rule.
- Install the Rajiv Gandhi statue in front of the Secretariat on the suggestions of Intellectuals.
- CM Sri Revanth Reddy performs Bhumi Puja for the Telangana Talli statue in the Secretariat on Wednesday.
Chief Minister Sri A Revanth Reddy announced that the Telangana Talli statue will be unveiled in the Secretariat, which is the epicenter of State administration, in the presence of lakhs of people on December 9 this year. This historical event of the unveiling of the statue of Telangana Talli will be organised on the lines of the Million March which was conducted during the intensified Telangana movement.
Amidst chanting Vedic hymns by the priests, the Chief Minister performed Bhumi Puja for the installation of the Telangana Talli statue in the secretariat premises on Wednesday.
The Chief Minister said that the government planned to organise the Bhumi Puja in a grand manner. Vedic scholars suggested that there are no auspicious days till Dasara festival and hence the Bhumi Puja program is conducted today in hurry even in the absence of Deputy CM, who is on Kerala visit, and other ministers who already preoccupied with their official programs.
Achievement of Telangana state is a testament to the determination and perseverance of Telangana movement activists, the CM said praising AICC leader Sonia Gandhi for fulfilling the 60-year-old aspirations of Telangana state people and committed to her speech in Karimnagar public meeting. The formation of Telangana state in 2014 is a matter of pride for all and it should be inscribed in golden letters in the history. The previous rulers between 2014 and 2024 boasted about themselves that they had built Telangana and role model for the world. The CM took a broadside at the last government for neglecting the Telangana Talli and criticized that the previous rulers had acted in such a way that they considered themselves to be the property of Telangana and Telangana as their own assets. The Congress led People’s government is against practicing such policies, the Chief Minister said reminding that Telangana people were barred from entering the Pragati Bhavan by erecting huge fences and guarding by hundreds of policemen. Pragati Bhavan was a restricted Fort in the previous government and today it has become an example for the country. People are permitted to move freely in Praja Bhavan.
CM Revanth Reddy said that his government decided to install the Telangana Talli statue in the Secretariat which is the heart of State administration. The government has been taking all decisions related to the state administration and people are also being given opportunity to express their problems here. The chief minister expressed his anger for not permitting people inside the Secretariat by the previous Chief Minister and ministers. The last government presented a Rs 22.50 lakh crore budget during 10 year rule but failed to spend at least Rs One crore to install the Telangana Talli statue in the Secretariat.
The statues of Dr. Ambedkar, Indira Gandhi, Anjaiah, PV Narasimha Rao, Kaka Venkataswamy and Jaipal Reddy, who contributed a lot for the country and state, were installed around Necklace Road and Tank Bund. The statue of noted leader and former Prime Minister Rajiv Gandhi is missing. Some vested interests tried to exploit the place in front of the Secretariat for their own selfish purposes. On the suggestion of the intellectuals, the government is installing Rajiv Gandhi’s statue. The CM angered over politicizing the installation Rajiv Gandhi statue by linking with Telangana Talli statue.
CM Revanth Reddy said that he already announced the installation of Telangana Talli statue in the Secretariat on June 2. The CM lambasted the previous government for not installing Telangana Bill statue during the 10 year regime. It is a long cherished wish to install the Telangana Talli statue which reflects the image of the mother of Telangana and the cultural ethos of the state, the CM said that the statue should not symbolise the aristocratic characters and hence the JNTU, Fine Arts department has been entrusted with the responsibility of designing the statue as per the wishes of Telangana people.
Already proclaimed
The CM recalled that the UPA government led by Prime Minister Manmohan Singh announced the start of the official process for the formation of Telangana on December 9, 2009. Since Sonia Gandhi’s birthday is celebrated on December 9, the government decided to unveil the Telangana Talli statue on the same day this year. The chief minister announced that the Telangana Talli unveiling ceremony will be organised in a grand manner. “I am fortunate that such a wonderful event of the unveiling ceremony of Telangana Talli statue is being organised by his government and this opportunity will not get everyone”, the Chief Minister said that he is lucky enough to participate in the program.
State R&B Minister Sri Komatireddy Venkat Reddy, MLA, MLCs, MPs, Corporation Chairmen and officials participated in the program.
మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మహోత్సవం…
- డిసెంబరు 9న లక్షలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో వేడుక
- పదేళ్లు అధికారంలో ఉన్నా గత పాలకులకు తెలంగాణ తల్లి గుర్తుకురాలేదు…
- మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం
- తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయ ప్రాంగణంలో డిసెంబరు 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహా ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూమి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్నామని, వేద పండితులను సంప్రదిస్తే ఈ రోజు మినహా దసరా వరకు మంచి రోజులు లేవని చెప్పారన్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఉప ముఖ్యమంత్రి కేరళ పర్యటనకు వెళ్లడం, మంత్రుల ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందన్నారు.
సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో ఇచ్చిన మాట మేరకు సోనియా గాంధీ 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కావడం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమన్నారు. 2014 నుంచి 2024 వరకు పదేళ్లు తెలంగాణను పాలించిన వారు ఎన్నెన్నో నిర్మించామని, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని గొప్పలు చెప్పకున్నారని, కానీ తెలంగాణ తల్లిని తెరమరుగు చేసే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తామే తెలంగాణకు సర్వస్వమని భావించారని, తానే తెలంగాణ… తెలంగాణే తాను అనే విధంగా విధంగా గత పాలకులు వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అలాంటి విధానాలకు విరుద్ధమన్నారు. ప్రగతి భవన్ పేరిట గడీ నిర్మించుకొని, భారీ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసు పహారా పెట్టుకొని తెలంగాణ ప్రజలను అందులోకి రాకుండా నిషేధించారని, తాము అధికారంలో వచ్చాక ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్‌గా మార్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గడీగా మారిన ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చి దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఇప్పుడు ఎవరైనా ప్రజా భవన్లో స్వేచ్ఛగా వెళ్లవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.
పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పాలనకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఇక్కేడ జరుగుతాయని, ప్రజలు తమ సమస్యలను తెలుపుకొనే అవకాశం ఇక్కడే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్న వారు సచివాలయంలోకి ప్రజలకు ప్రవేశం కల్పించలేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో రూ.22.50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన వారికి రూ.కోటి పెట్టి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు మనసు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఈ దేశం, రాష్ట్రం కోసం ఎంతో చేసిన అంబేడ్కర్, ఇందిరా గాంధీ, అంజయ్య, పి.వి.నరసింహారావు, కాకా వెంకటస్వామి విగ్రహాలు, జైపాల్ రెడ్డి సమాధి ఉన్నాయని, వీటి మధ్య రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటుగా కనిపించిందని ముఖ్యమంత్రి అన్నారు. సచివాలయం ఎదుట ప్రదేశాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు ఉంచుకోవాలని భావించారని, కానీ మేధావుల సూచన మేరకే తాము అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశం కోసం ఎంతో చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తెలంగాణ తల్లి విగ్రహంతో ముడిపెట్టి దానిని వివాదం చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆనాడే చెప్పా
పదేళ్లు అధికారంలో ఉండి గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదని, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని జూన్ రెండో తేదీనే తాను ప్రకటించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కన్నతల్లిని తలపించేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేది తమ అభిమతమని ముఖ్యమంత్రి అన్నారు. దొరల గడీల ఆనవాళ్లు విగ్రహంలో ఉండకూడదని, అందుకే తెలంగాణ ప్రజల అభిమతానికి తగినట్లు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే బాధ్యతను తెలంగాణ బిడ్డ, జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం కళాశాల ప్రిన్సిపల్‌కు అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని 2009, డిసెంబరు 9న మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని, అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం కావడంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు అని ముఖ్యమంత్రి అన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది అరుదైన అవకాశం… ఇటువంటి అరుదైన అవకాశం అందరికీ రాదని, ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం తనకు దక్కిందని ముఖ్యమంత్రి అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, కార్పొరేషన్లు ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.