CM declares “Future State”

Cm Revanth Reddy Addressed The Ceos Of Tech Unicorns At An Ai Business Roundtable (1)
  • Sobriquet for Telangana at AI CEOs meet

Addressing the CEOs of Tech Unicorns at an AI business roundtable hosted by the Indian Consulate General here Thursday, Chief Minister declared that Telangana would deserve the sobriquet of “The Future State”, given its current set of game changing projects like the AI city, Net Zero Future City, and massive reimagining of Hyderabad.

Cm Revanth Reddy Addressed The Ceos Of Tech Unicorns At An Ai Business Roundtable 3

Speaking to the gathering, the Chief Minister said, “In America, every State has a motto. I have been so far to New York, New Jersey, Washington DC, Texas, and now we are here in California. New York State motto – Out of many, one. Texas is known as Lone Star state. California has a motto, Eureka. In India we don’t have motto for a state. But I will now like to give my state – Telangana – a motto. My state Telangana can be called – The Future State.”

Cm Revanth Reddy Addressed The Ceos Of Tech Unicorns At An Ai Business Roundtable 4

“I invite you to Telangana. I invite you to the future. Together, let us make the future,” he declared to a thundering ovation.

Minister D Sridhar Babu presented the key highlights of the policies of Telanagana and the inherent strengths that make it attractive for global and tech investors.

Most of the leading CEO and founders of Artificial Intelligence unicorns expressed desire to visit Hyderabad and explore options to invest and build capacities there in the near future.

తెలంగాణ.. ప్యూచర్​ స్టేట్​

  • మన లక్ష్యం సూచించే కొత్త నినాదం
  • ట్యాగ్​ లైన్​ ఖరారు చేసిన సీఎం రేవంత్​ రెడ్డి
  • కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్​ కంపెనీ ప్రముఖులతో సమావేశం

ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని.. తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.

‘ఇప్పటి వరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్​.. అని పిలుద్దాం..’ అని సీఎం ప్రకటించారు.

ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. పెట్టబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు.