Skill University offers 17 courses and trains 20,000 people every year

Cm Revanth Reddy And Deputy Chief Minister Bhatti Vikramarka Held A Review Meeting On The Proposed Skills University 19 07 2024 (2)
  • Private companies will be part of the university management
  • University Head office and main campus in Hyderabad
  • Government mulls to introduce a bill for skills university in the ensuing budget session
  • Aims to provide jobs. Government ready to allocate adequate funds
  • CM Revanth Reddy suggests changes in the draft for Skill University

Chief Minister Sri A Revanth Reddy ordered the officials to make the required arrangements to introduce a bill for the establishment of Telangana Skills University in the ensuing budget session of the state assembly. The state government is ambitiously setting up the skills university with an objective of providing job opportunities to the students by imparting skills development training in accordance with the requirements of the industries. The government is ready to provide adequate funds to the establishment and the maintenance of the skill university, the CM said.

Cm Revanth Reddy And Deputy Chief Minister Bhatti Vikramarka Held A Review Meeting On The Proposed Skills University 19 07 2024 4

CM Revanth Reddy and Deputy Chief Minister Bhatti Vikramarka held a review meeting on the proposed Skills University at the Secretariat on Friday. After studying the functioning of skill universities in Delhi and Haryana, the State Industries department prepared a model draft to set up skill universities in the state. Special Chief Secretary to Industry Jayesh Ranjan presented a PowerPoint presentation on the courses which are being offered in the university, each course duration, requirement of infrastructure and funds for the management of the university and collaboration with various companies. The CM decided to name the new university as ‘Telangana Skills University’.

Skills University will be established in partnership with private companies (in PPP model). It is decided to set up the institution as a self-sustaining non-profit organization. Along with degree courses with three to four years duration, the university will also offer one year diploma courses and certificate courses for three to four months. New courses have been selected according to the future needs of various sectors and industries which are developing fast in Telangana.

Cm Revanth Reddy And Deputy Chief Minister Bhatti Vikramarka Held A Review Meeting On The Proposed Skills University 19 07 2024 1

A total of 17 priority sectors have been identified. Initially, the university will offer training in Pharma, construction, banking finance services, e-commerce and logistics, retail, animation, visual effects, gaming and comics. Each course is linked to the participation of a well-known company in the respective field and the government will enter into an MoU with the companies. The university will provide training to 2,000 people in the first year. A facility to provide training for 20,000 people every year will be developed in a phased manner.

The CM and officials discussed the proposal to set up regional campuses (satellite campuses) in district centers along with main campus at the Engineering Staff College campus in Hyderabad. The Chief Minister pointed out that the students will prefer and compete to join the Hyderabad campus instead of choosing the district centers. The CM asked the officials to make arrangements to provide training for all in Hyderabad only and provide required infrastructure facilities at the NAC campus and other premises also. Officials have been asked to visit and inspect the facilities at Swami Ramananda Tirtha Rural Institute in Bhoodan Pochampally.

CM Revanth Reddy stressed on the need to focus more on the sectors where the demand for jobs is high and provide more seats in pharma since the demand for job opportunities in pharma companies is more in the state. The CM directed the officials to envisage plans to provide job opportunities to the students soon after the completion of the courses. For this, the officials are asked to hold talks with various companies in advance. The CM also instructed the officials to examine the procedures followed by other universities and finalize the organizational structure of the new skills university. The CM ordered the officials to prepare the draft in tune with the decisions taken in the meeting.

Special Chief Secretary (Industry and IT and C) Jayesh Ranjan, Finance Secretary Sandeep Kumar Sultania, CM Secretary Sheshadri and CM Special Secretary Ajit Reddy are also present.

తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ

  • 17 కోర్సులు, ఏటా 20 వేల మందికి శిక్షణ
  • ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహణ
  • హైదరాబాద్ లోనే హెడాఫీస్..మెయిన్ క్యాంపస్
  • బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే యోచన
  • నిధులకు రాజీ పడేది లేదు.. ఉపాధి కల్పించటమే లక్ష్యం
  • ముసాయిదాకు పలు మార్పులు సూచించిన సీఎం

తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు ఎంత ఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

స్కిల్ యూనివర్సిటీపై సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించి, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల విభాగం నమూనా ముసాయిదాను తయారు చేసింది. ఈ యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిర్వహణకు అవసరమయ్యే నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు. కొత్త యూనివర్సిటీకి ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’ అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో (పీపీపీ మోడల్లో) స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పుతారు. లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు. ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్..తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడుతారు. ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది. తొలి ఏడాది రెండు వేల మందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

హైదరాబాద్ లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ క్యాంపస్ తో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు (శాటిలైట్ క్యాంపస్లు) ఏర్పాటు చేయాలనే చర్చ జరగింది. జిల్లా కేంద్రాల్లో శాటిలైట్ క్యాంపస్ లు ఏర్పాటు చేస్తే.. వాటిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని, అందరూ హైదరాబాద్ క్యాంపస్ లో చేరేందుకు పోటీ పడుతారని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే హైదరాబాద్ లోనే అందరికీ శిక్షణను అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఈఎస్సీతో పాటు న్యాక్ క్యాంపస్ ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలుండే వివిధ ప్రాంగణాలను గుర్తించాలని సూచించారు. భూదాన్ పోచంపల్లిలో ఉన్న స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న సదుపాయాలను అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, అటువంటి కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండాలని చెప్పారు. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని, ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మిగతా యూనివర్సిటీలు అనుసరించిన విధానాలను పరిశీలించి కొత్త యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణాన్ని తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేసి ముసాయిదాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్​ రంజన్​, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.