Centre approves Elevated Corridors in Telangana

Image of Telangana State Emblem
  • Centre gives nod for allotment of Defence lands
  • Clears Hyderabad Ramagundam, Nagpur highway route
  • Transport facilities to be developed in North Telangana
  • CM Sri Revanth Reddy thanked Defence Minister Sri Rajnath Singh

The Ministry of Defence approved the proposal for the construction of Elevated Corridor on Hyderabad-Nagpur National Highway along with the Hyderabad-Karimnagar Rajiv Highway. The defence ministry cleared for the construction of elevated corridors across defence lands in Hyderabad.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met with Defence Minister Rajnath Singh in Delhi on January 5 and appealed to the Minister to permit the development of elevated corridors across defence lands. Responding to the CM’s plea, the union government issued permit orders for the construction of elevated corridors today morning. The CM thanked Prime Minister Sri Narendra Modi, Defence Minister and the officials of Defence wing for permitting the construction of corridors which helps for the development of Hyderabad city.

The CM requested the Defence Minister to allot 83 acres of land for the construction of a six-lane elevated corridor from Paradise Junction to Outer Ring Road Junction on Rajiv Road connecting Hyderabad to Karimnagar-Ramagundam and the construction of entry and exit ramps for a total 11.30 km corridor construction. The Chief Minister also pleaded with the defence minister to transfer 56 acres of defence lands for the construction of the corridors on a total length of 18.30 kilometers proposed from Paradise Junction near Kandlakoya to Outer Ring Road on Nagpur Highway (NH-44), out of which 12.68 kilometers will be constructed as a six-lane elevated corridor, with exits and entries in four areas, and Double Decker (for Metro) Corridor in the future.

With permission given by the Centre, the transport network will be developed in the North Telangana districts of Nizamabad, Adilabad, Karimnagar and Ramagundam. The growing traffic problem in the Secunderabad area will also be solved. The development of elevated corridors from Hyderabad to Shamirpet and Hyderabad to Kandlakoya will promote the fast pace development of the North side of the Hyderabad city. All the hurdles for the expansion of the national highways have been removed with the sanction of the defence lands.

The arrogant attitude adopted by the previous government stalled the development of the elevated corridors for years. The Chief Minister expressed happiness that the pending issue for the last 8 years has been resolved. The CM said that the new government has succeeded in getting approvals in just 80 days and it displayed the sincerity of the government in the development of the state.

The CM recalled, during his every visit to New Delhi, that he submitted memoranda to the Union Ministers requesting them to address the state issues. The CM said he is ready to meet anyone to protect the state interests and continue to maintain cordial relations with the centre for the development of the state. CM Sri Revanth Reddy made it clear that the interests of the Telangana state are his top agenda regardless of political disputes and party ideologies. As per the instructions of the defence ministry, the state will start the construction of the elevated corridors soon.

ఎలివేటేడ్ కారిడార్లకు లైన్​ క్లియర్​

  • రక్షణ శాఖ భూముల కేటాయింపులకు కేంద్రం అనుమతులు
  • హైదరాబాద్ రామగుండం, నాగ్ పూర్​ హైవే రూట్ క్లియర్
  • ఉత్తర తెలంగాణకు విస్తరించనున్న రవాణా సదుపాయాలు
  • కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్​రెడ్డి కృతజ్ఞతలు

హైదరాబాద్‌‌ – కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్– నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు.

స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం ఉదయం అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన కారిడార్ల నిర్మాణానికి అనుమతించినందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండం ను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగు రోడ్డు జంక్ష‌న్ వ‌ర‌కు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల భూమి అవసరమని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి విజ్ఙ‌ప్తి చేశారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్ల‌కోయ స‌మీపంలోని ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామ‌ని, అందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భ‌విష్య‌త్తులో డ‌బుల్ డెక్క‌ర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు.

కేంద్రం ఇచ్చిన అనుమతులతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్ రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలిగిపోనుంది. హైదరాబాద్ నుంచి శామీర్పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర దిశగా అభివృద్ది పరుగులు తీయనుంది. జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి అడ్డంకిగా మారిన రక్షణ శాఖ భూముల అడ్డంకులు తొలిగిపోయాయి.

గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకార పూరిత వైఖరితోనే ఏళ్లకేళ్లుగా ఎలివేటేడ్ కారిడార్ల అనుమతి ప్రక్రియ నిలిచిపోయింది. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 80 రోజుల కొత్త ప్రభుత్వం ఈ అనుమతులు సాధించటం తమ చిత్తశుద్ధిని చాటిందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తెలంగాణ రాష్టానికి సాధించుకోవాల్సిన అవసరాల కోసం కేంద్ర మంత్రులను కలిసి లేఖలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎన్నిసార్లైనా కలిసేందుకు తాము సిద్దంగా ఉన్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహిత, స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. రాజకీయ వైషమ్యాలు, పార్టీల సిద్ధాంతాలేవైనా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు త్వరలోనే ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణాలు తలపెడుతామని అన్నారు.