CM held review on Water Works, MA&UD and GHMC

Cm Revanth Reddy Held Review On Water Works, Ma&ud And Ghmc 23 02 2024 02

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy held a review on Water Works, Municipal Administration and GHMC at the HMDA office on Friday.

  • CM Revanth Reddy gave certain instructions to the Water Works , MA and UD and GHMC wings.
  • GHMC and HMDA should maintain building permission files transparently. Permission was given to the buildings without an online process. Building permission files went missing.
  • Conduct vigilance raids in HMDA and GHMC limits in 15 days. Warned the officials of shutting out from services if any found dereliction of their duties.
  • Prepare the list of building permissions given online. Questioned the officials for the deletion of online data of the Ponds from the HMDA website. Data of 3,500 ponds should be online.
  • CCTV cameras should be installed immediately at the ponds to check encroachment.

Review on Municipal Administration Department:

  • Playgrounds should be established for children in Hyderabad city. CM Revanth Reddy is surprised at the absence of commissioners in the newly constituted 85 municipalities.
  • The CM spoke to Special Chief Secretary to Finance Department K Ramakrishna Rao on the phone. Ordered to ensure that Group 1 officers are appointed as Municipal Commissioners. Suggested to appoint IAS officials as Commissioners of new Municipal Corporations.
  • Instructed to study the provision of accident insurance to municipal workers working in the municipalities and also
    replace the old aged workers in the GHMC with their family members
  • Directed the officials to study the use of drone cameras for property tax assessment. Suggested setting up multi-level parking in the private sector in Hyderabad
  • The Chief Minister asked the Zonal Commissioners to visit the colonies in the early morning or face disciplinary action. Government is ready to give non focal posts to the officials who are not ready to perform in the present posts.
  • Set up a video billboard like in New York’s Time Square in Hyderabad and also multi utility towers. Take steps
    to improve the street lights mechanism.

Review on Water Works:

  • Ordered no drinking water scarcity in Hyderabad City. Use local ponds as storage tanks. Prepare plans to supply drinking water from Mallanna Sagar, Kondapochamma and Ranganayaka Sagar reservoirs to Hyderabad.
  • Create the clusters of Ponds outside the outer ring road. The CM directed the officials to prepare plans for the drinking water needs in the next 50 years.
  • Submit a detailed report on the availability of government-owned costly lands in Hyderabad. Instructed the officials to take up the inauguration of development programmes in Hyderabad in a week. Foundation stones for new Metro Rail lines will be laid soon.
  • CM Revanth Reddy held review for over four hours. Revenue Minister Ponguleti Srinivas Reddy and senior officials -Dana Kishore, Amrapali and others participated in the review.

హెచ్ఎండీఏ కార్యాల‌యంలో వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీహెచ్ఎంసీపై ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స‌మీక్ష‌ నిర్వహించారు.
➧ జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ ప‌రిధిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్స్ ఫైల్స్ క్లియ‌ర్‌గా ఉండాలి
➧ చాలా బిల్డింగ్స్ అనుమ‌తుల‌కు సంబంధించిన ఫైల్స్ క‌నిపించ‌డం లేదు. ఆన్‌లైన్ లేకుండా ఇష్టారీతిగా ప‌ర్మిష‌న్లు ఇచ్చారు.
➧ 15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయి. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇంటికిపోతారు.
➧ ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేయాల్సిందే..
➧ హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోంది..
➧ 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందే..
➧ చెరువులు ఆక్ర‌మ‌ణ‌కు గురికాకుండా వాటి వ‌ద్ద త‌క్ష‌ణ‌మే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

పుర‌పాల‌క ప‌రిపాల‌న శాఖ‌పై సీఎం స‌మీక్ష‌:
➧ హైద‌రాబాద్ న‌గ‌రంలో పిల్ల‌ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి
➧ కొత్త‌గా ఏర్ప‌డిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆశ్చ‌ర్యం..
➧ ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ రామ‌కృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి
➧ గ్రూప్ 1 అధికారులు క‌మిష‌న‌ర్‌లుగా ఉండేలా చూడాల‌ని ఆదేశం…
➧ కొత్త కార్పొరేష‌న్ల‌కు ఐఏఎస్‌ల‌ను క‌మిష‌న‌ర్‌లుగా నియ‌మించాల‌ని సూచ‌న‌
➧ మున్సిపాలిటీల్లో ప‌ని చేసే మున్సిప‌ల్ వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌మాద బీమా క‌ల్పించ‌డంపై అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశాలు…
➧ జీహెచ్ ఎంసీలో వ‌య‌స్సుపైబ‌డిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచ‌న‌
➧ ఆస్తి ప‌న్ను మ‌దింపు కోసం డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించేందుకు అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం ఆదేశాలు
➧ హైద‌రాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచ‌న‌
➧ జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి హెచ్చ‌రిక… ఉద‌య‌మే లేచి కాల‌నీల్లో ప‌ర్య‌టించని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఇంటికి వెళ్లిపోవ‌చ్చ‌న్న ముఖ్య‌మంత్రి
➧ కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే ఇస్తామ‌ని వ్యాఖ్య‌
➧ హైద‌రాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హాలో వీడియో ప్ర‌క‌ట‌న‌ల బోర్డు ఏర్పాటు చేయాల‌ని సూచ‌న‌
➧ మ‌ల్టీ యుటిలిటీ ట‌వ‌ర్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు
➧ వీధి దీపాలు మెరుగుద‌ల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌

వాట‌ర్ వ‌ర్క్స్ స‌మీక్ష‌లో సీఎం..
➧ హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశాలు
➧ స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని సూచ‌న‌
➧ మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌ని ఆదేశం…
➧ ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించాల‌ని సూచ‌న‌
➧ వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని అధికారుల‌కు సూచించిన సీఎం
➧ హైద‌రాబాద్‌లో విలువైన ప్ర‌భుత్వ ఆస్తుల జాబితాను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం
➧ హైద‌రాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్స‌వాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాల‌ని అధికారుల‌కు సీఎం సూచ‌న‌
➧ మెట్రో కొత్త మార్గాల‌కు త్వ‌ర‌లో శంకుస్థాప‌న
➧ నాలుగు గంట‌ల‌కుపైగా సాగిన స‌మీక్ష

ఈ స‌మీక్ష‌లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఉన్న‌తాధికారులు శ్రీ దాన కిషోర్‌, శ్రీమతి ఆమ్ర‌పాలి త‌దిత‌రులు.