State Government’s first priority is supply of safe drinking water: CM

Cm Revanth Reddy Held A Review On The Measures To Tackle The Drinking Water Crisis In The Summer 22 02 2024 (1)
  • Prepare  action plan to avoid  drinking water crisis during Summer 
  • No diversion of water from Nagarjuna Sagar by Andhra Pradesh for irrigation needs
  • Government to write letter to KRMB  to release water for drinking needs 
  • Panchayat Raj and Municipal Administration and Urban Development to  work in tandem to address drinking water needs  
  • Action plan for GHMC for drinking water – Chief Minister Revanth Reddy says

Honourable Chief Minister Sri A Revanth Reddy directed the officials to ensure that the drinking water crisis does not rise during the summer and to take all necessary precautions.  In the wake of water levels reached at dead storage levels at many reservoirs due to deficit rainfall this year, CM Revanth Reddy held a review on the measures to tackle the drinking water crisis in the summer with ministers N Uttam Kumar Reddy, Ponguleti Srinivas Reddy and the top officials of Panchayat Raj, Municipal Administration and Urban Development and Drinking water supply wings at the Dr BR Ambedkar Secretariat on Thursday. 

The officials explained to the CM the details of water storage in the reservoirs and the quantity of water required for drinking purposes in the state. The Chief Minister instructed the officials to prepare a comprehensive action plan for the supply of drinking water to every household in Tandas, Gudems, SC colonies, villages and urban areas.  The action plan will be prepared together by Irrigation, MA and UD, Panchayat Raj and Drinking Water Supply departments. 

Officials explained to the Chief Minister that Andhra Pradesh is lifting more than 9 TMC of water from Nagarjuna Sagar for drinking water needs. The Chief Minister ordered the officials to take up proper assessment of the utilization of water and ensure that water is not diverted for other purposes. The Chief Minister asked the officials to review in detail the requirement of water and write a letter to KRMB (Krishna River Management Board) seeking permission to draw from Sagar and Srisailam projects for drinking purposes.   

The officials told the CM that the state did not face any water crisis as the Jurala project was filled with rainwater during April and May in the past. Otherwise, the state would have to request the Karnataka government for the release of water from Narayanpur reservoir. The state drew water from the reservoir three years ago.  The CM suggested to the officials to write a letter to KRMB first and consider the request for water release from Karnataka as the last option. The Chief Minister said that many water resources were neglected after the new water schemes were launched and asked the officials to find out the possibility of bringing them back into utilization.

 Citing the Kagna River as an example, the Chief Minister said that there was an opportunity to utilize water from Kagna in  Tandur and Kodangal Assembly constituencies. The river was abandoned after the Mission Bhagiratha scheme was launched.  All such water facilities should be revived and also take up the repairs of drinking water borewells, wells and motors immediately.  The funds earmarked under ACDP for MLAs up to Rs one crore or above, if necessary, should be used for repairs and drinking water supply.  

During his visit to Adilabad district, the CM said that there was no supply of drinking water in many villages and the previous government had given false reports to the Center that 99 percent of the houses were provided safe drinking water through Mission Bhagiratha. As a result, the state was not receiving funds under the Jal Jeevan Mission.  The Chief Minister directed the officers to stop submitting such false reports and check at the field level before forwarding genuine reports to the Centre. The CM instructed the Chief Secretary to hold a review with the District Collectors in two days on available water resources in their respective districts,  required drinking water needs and the steps to be taken to overcome the water crisis to ensure that there is no drinking water problem anywhere till the end of July.

When the officials brought to the notice of the CM  about the nonpayment of salaries to the staff in the Rural Water Supply  (RWS) wing for the last two years, CM Revanth  Reddy ordered the Finance department to release funds and pay the pending salaries. The RWS officials are suggested to pay the salaries directly to the field-level staff.   

 GHMC – DRINKING WATER SUPPLY

CM Sri Revanth Reddy directed the officials to ensure that there is no problem with the drinking water supply within the Greater Hyderabad City Corporation ( GHMC ) limits. Officials said that alternative arrangements for water supply from Yellampalli and  Nagarjuna Sagar will be made in case the city witnesses a drinking water shortage in the summer. The CM wanted the officials to review the drinking water needs in the city at the micro level and an appropriate plan should be drawn up. The officials brought to the notice of the Chief Minister that police are creating trouble in the movement of water tankers in some parts of the city. The chief minister directed the police officials to ensure that the movement of drinking water tankers is not obstructed by the police till the end of summer.

తాగు నీటి స‌ర‌ఫ‌రాకే తొలి ప్రాధాన్యం…

  • వేస‌విలో నీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించండి…
  • నాగార్జున సాగ‌ర్‌ నుంచి ఏపీ సాగు నీటికి నీరు త‌ర‌లించ‌కుండా చూడాలి
  • అవ‌స‌ర‌మైన తాగు నీటి విడుద‌ల‌కు కేఆర్ఎంబీకి లేఖ రాయండి
  • నిరుప‌యోగంగా నీటి వ‌న‌రులను పున‌రుద్ధ‌రించాలి..
  • పంచాయ‌తీరాజ్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క‌,నీటిపారుద‌ల శాఖ‌లు క‌లిసి ప‌ని చేయాలి – ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

వేస‌వి కాలంలో తాగు నీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా చూడాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వ‌ర్షాభావంతో జ‌లాశ‌యాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేప‌థ్యంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డితో క‌లిసి సాగు నీరు,ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల అధికారుల‌తో గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలుత రాష్ట్రంలో జ‌లాశ‌యాల్లో నీటి నిల్వ‌లు, తాగు నీటికి అవ‌స‌ర‌మైన నీటి ప‌రిమాణంపై అధికారులు గ‌ణాంకాలు వివ‌రించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ న‌గ‌రాలు/ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు,తండాలు, గూడేలు, ఎస్సీ కాల‌నీలు అనే తేడా లేకుండా ప్ర‌తి నివాస ప్రాంతానికి తాగు నీరు అందేలా సాగు నీరు, ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగ‌ర్‌ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ 9 టీఎంసీల‌కు పైగా నీరు తీసుకుపోతోందని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్క‌డ వినియోగిస్తున్నార‌ని, స‌రైన గ‌ణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. నాగార్జున సాగ‌ర్‌, శ్రీ‌శైలం ప్రాజెక్టుల నుంచి తాగు నీటికి నీరు తీసుకోవాలంటే కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాయాల్సి ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఎంత నీరు అవ‌స‌ర‌మో స‌మ‌గ్రంగా స‌మీక్షించి వెంట‌నే కేఆర్ ఎంబీకి లేఖ రాయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. గ‌తంలో ఏప్రిల్ నెలాఖ‌రు, మే నెల‌లో వ‌చ్చిన వ‌ర్షాల‌తో జూరాల‌కు నీరు రావ‌డంతో ఇబ్బంది రాలేద‌ని, లేకుంటే నారాయ‌ణ‌పూర్ జ‌లాశ‌యం నీరు విడుద‌ల కోరుతూ క‌ర్ణాట‌క‌ను అభ్య‌ర్థించాల్సి ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. గ‌తంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా అని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించ‌గా మూడేళ్ల క్రితం తీసుకున్నామ‌ని తెలిపారు. అయితే దానిని చివ‌రి అవ‌కాశంగా తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ముందుగా కేఆర్ఎంబీకి లేఖ రాయాల‌ని సూచించారు. నూత‌న ప‌థ‌కాలు వ‌చ్చిన త‌ర్వాత గ‌తంలో ఉన్న అనేక నీటి వ‌న‌రుల‌ను వ‌దిలేశార‌ని, ప్ర‌స్తుతం వాటిని వినియోగంలోకి తెచ్చే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈసంద‌ర్భంగా కాగ్నా న‌దిని ముఖ్య‌మంత్రి ఉదాహారించారు. కాగ్నా నుంచి తాండూర్, కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీరు వినియోగించుకునే అవ‌కాశం ఉంద‌ని, మిష‌న్ భ‌గీరథ వ‌చ్చిన త‌ర్వాత దానిని వ‌దిలేశార‌ని, అటువంటివి రాష్ట్రంలోని మిగ‌తా ప్రాంతాల్లో ఉంటాయ‌ని వాటిని వినియోగించుకోవాల‌న్నారు. అలాగే అవ‌స‌ర‌మైన చోట తాగు నీటి బోర్లు, బావులు, మోటార్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయించాల‌ని, ఇందుకు ఎమ్మెల్యేల‌కు కేటాయించిన ఏసీడీపీ నిధుల నుంచి రూ.కోటి, అవ‌స‌ర‌మైతే అంత‌క‌న్నా ఎక్కువ‌గా వినియోగించుకోవాల‌ని సూచించారు. తాను ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు అనేక గ్రామాల్లో తాగు నీటి స‌ర‌ఫ‌రా లేద‌ని, మిష‌న్ భ‌గీర‌థ ద్వారా 99 శాతం ఇళ్ల‌కు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి త‌ప్పుడు నివేదిక‌లు ఇచ్చినందునే జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి నిధులు రావ‌డం లేద‌ని ముఖ్యమంత్రి అన్నారు. గొప్ప‌ల‌కు పోయి త‌ప్పుడు నివేదికలు ఇవ్వ‌వ‌ద్ద‌ని, క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి వాస్త‌వ నివేదిక‌లు కేంద్రానికి పంపించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. జులై నెలాఖ‌రు వ‌ర‌కు ఎక్క‌డ తాగు నీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూసేందుకు ఆయా జిల్లాల్లో ఉన్న నీటి వ‌న‌రులు, అవ‌స‌ర‌మైన తాగు నీటి ప‌రిమాణం, స‌మ‌స్య‌లు అధిగ‌మించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో రెండు రోజుల్లో స‌మీక్ష నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యద‌ర్శిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఈసంద‌ర్భంగా ఆర్‌డ‌బ్ల్యూఎస్ ప‌రిధిలో సిబ్బందికి వేత‌నాలు ఇవ్వ‌డం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. గ‌త రెండేళ్లుగా జీతాలు ఇవ్వ‌డం లేద‌ని అధికారులు తెలిపారు. వేత‌న బ‌కాయిల‌పై ఆరా తీసిన ముఖ్య‌మంత్రి క్షేత్ర స్థాయి సిబ్బందికి వేత‌నాలు అందేలా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు. తాము నిధులు విడుద‌ల చేస్తామ‌ని వాటిని బ‌డా బాబుల‌కు ఇవ్వ‌కుండా క్షేత్ర స్థాయి సిబ్బందికి అందేలా చూడాల‌ని ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారుల‌కు సూచించారు.

జీహెచ్ఎంసీ ప‌రిధిలోనూ తాగు నీటికి ఎటువంటి స‌మ‌స్య లేకుండా చూడాలి: సీఎం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలోనూ తాగు నీటికి ఎటువంటి స‌మ‌స్య లేకుండా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పెద్ద‌గా ఇబ్బందులు లేవ‌ని, ఏదైనా కొర‌త ఏర్ప‌డితే ఎల్లంప‌ల్లి, నాగార్జున సాగ‌ర్ నుంచి కొంత‌మేర తెప్పించుకునే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. న‌గ‌రంలోని నీటి అవ‌స‌రాల‌పై సూక్ష్మ స్థాయి (మైక్రోలెవ‌ల్‌)లో స‌మీక్షించి త‌గిన ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని సీఎం సూచించారు. న‌గ‌రంలో కొన్ని ప్రాంతాల్లో ట్యాంక‌ర్ల రాక‌పోక‌ల‌కు పోలీసుల నుంచి కొంత ఇబ్బంది ఉంద‌ని అధికారులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వేస‌వి పూర్త‌య్యే వ‌ర‌కు తాగు నీటి ట్యాంక‌ర్ల రాక‌పోక‌ల విష‌యంలో పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడాల‌ని పోలీసు ఉన్న‌తాధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.