CM releases Telangana journalists’ Adhyayana Vedika – Diary 2024

Cm Sri Revanth Reddy Released Telangana Journalists' Adhyayana Vedika Diary 2024

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy released the Diary of Telangana journalists’ Adyayana Vedika for the year 2024 at the secretariat today (Thursday). The Chief Minister congratulated the team of journalists for bringing out a useful diary for people. The CM appealed to the journalists to contribute their services in reaching out to the Congress government’s welfare and development scheme benefits to the needy.

Telangana Journalists Vedika President Sri Bodanapalli Venugopal Reddy, General Secretary Sri Mohammad Sadiq Pasha, Vice Presidents Sri Koduru Srinivasa Rao, Sri Jangiti Venkatesh, Joint Secretary Sri Madhu Malkedikar, Treasurer Sri Suresh Velpula, Executive Members Sri Somu Samudrala, Sri Kancheraju and others are present. The Vedika representatives thanked the Chief Minister.

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక‌ డైరీ అవీష్కరించిన సీఎం

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 సంవత్సరం డైరీని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమవంతు కృషి చేయాలని సీఎం గారు కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు శ్రీ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీ మహ్మద్ సాదిక్ పాష, వైస్ ప్రెసిడెంట్లు శ్రీ కోడురు శ్రీనివాసరావు, శ్రీ జంగిటి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ శ్రీ మధు మల్కేడికర్, కోశాధికారి శ్రీ సురేశ్ వేల్పుల, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శ్రీ సోము సముద్రాల, శ్రీ కంచెరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.