CM addressed a group of Indophile British Members of Parliament

Cm Addressed A Group Of Indophile British Members Of Parliament 04

Hon’ble Chief Minister Sri Revanth Reddy addressed a group of Indophile British Members of Parliament in the historic Westminster Building on Thursday, and said, “Strengthening Democracy is the most imperative act to solve the current World Problems.

Speaking at the landmark and iconic monument, first built as a palace in 1016 AD, a UNESCO World Heritage Site, CM said, “today, the world is facing many challenges. War, terrorism, violence, denial of rights, assault on democracy. The problems are numerous but the answer is one – empowering people through democracy.”

Speaking of the historical relationship and bond between the two countries, CM Sri Revanth Reddy said, “your country ruled India. My party, the Congress party, fought for Independence. Both our countries must repeatedly take the message of Mahatma Gandhi – who showed us to fight for justice with truth and non-violence.”

Speaking of his own experience as a grassroots-level political leader who could rise to become Chief Minister of a great State like #Telangana, he said, “I am a farmer’s son, born and brought up in rural India. Only because of democracy and the Congress party’s inclusive philosophy, I have this opportunity. We have to create opportunities for everyone, which is the real strength of democracy.”

Labour MP Sri Virendra Sharma hosted the meeting, attended by seven other MPs, and a host of invited dignitaries.

ఇండో ఫిలీ బ్రిటీష్ పార్లమెంట్  సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం 

“ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ప్రస్తుత ప్రపంచ సమస్యలన్నింటి పరిష్కారం కోసం చేయవలసిన అత్యవసరమైన పని” అని చారిత్రాత్మక వెస్ట్ మినిష్టర్స్ బిల్డింగ్‌లో గురువారం ఇండో ఫిలీ బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి అన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. 

1016 AD లో మొదటిసారి ప్యాలెస్‌గా నిర్మితమై, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ల్యాండ్‌మార్క్ మరియు ఐకానిక్ కట్టడం ముందు ప్రసంగిస్తూ “ప్రస్తుత ప్రపంచం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోంది. యుద్ధం, ఉగ్రవాదం, హింస, హక్కుల అణచివేత, ప్రజాస్వామ్యంపై దాడి… వీటిలో కొన్ని. సమస్యలు అనేకం వున్నా సమాధానం ఒక్కటే. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను శక్తిమంతుల్ని చేయడం” అని అన్నారు.   

రెండు దేశాల మధ్యన ఉన్న చారిత్రాత్మక బంధాలు, సంబంధాల గురించి ప్రస్తావిస్తూ “ఇండియాను మీ దేశం పరిపాలించింది. మా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం కోసం పోరాడింది. రెండు దేశాలూ సత్యం, అహింస ఆయుధాలుగా న్యాయపోరాటం చేసిన మహాత్మాగాంధి సందేశాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి” అన్నారు. 

అట్టడుగు స్థాయి రాజకీయ నాయకుడిగా మొదలై తెలంగాణ లాంటి గొప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిన తన స్వానుభవాన్ని వివరిస్తూ “నేను గ్రామీణ భారతంలో పుట్టి పెరిగిన రైతుబిడ్డను. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ కలుపుకుపోయే తత్త్వం కారణంగానే నాకీ అవకాశం లభించింది. ప్రతి ఒక్కరికీ అవకాశాలు సృష్టించడమే ప్రజాస్వామ్యం అసలు బలం” అని అన్నారు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు.  

ఏడుగురు ఎంపీలతో పాటు ఆహ్వానితులైన కొంతమంది ప్రముఖులు హాజరైన ఈ సమావేశాన్ని లేబర్ MP శ్రీ వీరేంద్ర శర్మ ఏర్పాటు చేశారు.