Adani Group Announces Investments worth INR 12,400 crore in Telangana

Cm Revanth Reddy Met With The Chairman Of Adani Group, Mr. Gautam Adani At The World Economic Forum In Davos
  • Group to set up a Skilling University in Telangana across multiple disciplines
  • Total of four MoUs signed
  • Gautam Adani hails business-friendly policies of Telangana under leadership of Revanth Reddy
  • Delighted to welcome Adani Group to Telangana, says CM Revanth Reddy
  • ‘Telangana Means Business’

Hon’ble Chief Minister of Telangana Sri A. Revanth Reddy met with the Chairman of Adani Group, Mr. Gautam Adani at the World Economic Forum in Davos.

Chief Minister Revanth Reddy, along with Hon’ble Minister of ITE&C, Industries, and Legislative Affairs, Sri D Sridhar Babu, and Chairman of Adani Group, Mr. Gautam Adani, and President and CEO of Aerospace and Defence, Mr. Ashish Rajvanshi, exchanged four MOUs with the state Government for investments amounting to the tune of ₹12,400 crore that would be invested in Telangana over the next few years.

  • Adani Green Energy will invest INR 5,000 Crores for setting two Pumped Storage Projects in Telangana of 1350 MW Capacity
  • AdaniConneX Data Centers will invest INR 5,000 Crores to set up a Data Center campus in Chandanvelly with a total capacity of 100 MW
  • Ambuja Cements Ltd. will invest INR 1,400 Crores in a Cement Grinding unit in Telangana with a capacity of 6.0 MTPA
  • Adani Aerospace and Defence will invest INR 1,000 Crores in Counter Drone Systems and Missile Development and Manufacturing Centres at the Adani Aerospace and Defence Park

 Apart from the above investments, Adani Group has also agreed to support the Hon’ble Chief Minister’s goal of creating skilling Universities in Telangana.

Soon, Adani Group will develop an integrated state-of-the-art skilling university in Telangana and will share more details about it shortly.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy has assured Mr Adani that the State Government will provide required amenities, infrastructure, and support for the projects.

Welcoming the Adani Group to Telangana, CM Revanth Reddy said, “It is a great pleasure to welcome the Adani group to Telangana. The eagerness of Gautam Adani garu to explore various possibilities and harnessing our strength is a welcome signal that top-notch , conglomerates are eager to invest in Telangana. We have successfully shown to business world that Telangana Means Business.”

Speaking after the signing, Gautam Adani, Chairman, Adani Group, said, “The new Government in Telangana under the leadership of Revanth Reddy garu has been extremely investor friendly and with newly initiated policies, should attract more investments. Adani group will continue growing in Telangana at high pace.”

Minister for Industries and ITE&C Sri D. Sridhar Babu, Principal Secretary ITE&C, I&C Sri Jayesh Ranjan, and Special Secretary, Investment Promotion, Sri Vishnu Vardhan Reddy were also present during the meeting.

  • తెలంగాణలొ అదానీ భారీ పెట్టుబడులు
  • రూ.12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
  • త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
  • సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ

తెలంగాణలో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ,  ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన  ఒప్పందాలు (MoU) చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  మంత్రి శ్రీ శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ శ్రీ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సీఈవో శ్రీ ఆశిష్ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

  • తెలంగాణలో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. దీనికి రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. చందన్వల్లిలో  అదానీ కొనెక్స్ (Adani ConneX) డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
  • అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. 
  • అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది.

ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆనంద్ అన్నారు. కొత్త పారిశ్రామిక విధానం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఉందని, తమకందించిన ప్రోత్సాహంతో తెలంగాణలో అదానీ గ్రూప్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు.  ఈ సమావేశంలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

త్వరలో స్కిల్ యూనివర్సిటీ

ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎంచుకున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి  చర్చలు జరిపారు. దీంతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని.. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం అన్నారు.  తెలంగాణలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ తన సంసిద్ధతను వ్యక్తపరిచారు. త్వరలోనే ఇంటిగ్రేటేడ్ స్టేట్ ఆప్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. అదానీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ఇఫ్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  పెట్టుబడులకు తెలంగాణ మొట్టమొదటి గమ్యస్థానంగా మారిందని అన్నారు. అదానీ గ్రూప్ తెలంగాణను తమ పెట్టుబడులకు ఎంచుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.