Micron Technology CEO meets CM Sri Revanth Reddy

Micron Technology Ceo Meets Cm Sri Revanth Reddy 11 01 2024 (1)

The World’s largest chip manufacturing company – Micron Technology President and CEO Sri Sanjay Mehrotra paid a courtesy call on Chief Minister Sri A. Revanth Reddy at his residence today (Thursday) evening. Sri Sanjay Mehrotra, who came from the United States of America to meet Hon’ble Chief Minister, discussed the investment prospects in Telangana State.

The CEO expressed happiness that Telangana State has favourable atmosphere for investments and setting up industrial units. The Chief Minister assured Sri Sanjay Mehrotra of all the cooperation and support from the State the Government. CM Sri Revanth has expressed the hope that industrialists will come forward to establish industries, impart skills and generate employment in addition to contributing to the economic development of the State.

The US-based Micron Technology is the world’s fourth largest semiconductor manufacturer and the largest manufacturer of memory chips.

సీఎం శ్రీ రేవంత్ రెడ్డిని కలిసిన మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ 

ప్రపంచంలో అతి పెద్ద చిప్ తయారీ కర్మాగారం “మైక్రాన్ టెక్నాలజీ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ సంజయ్ మెహ్‌రోత్రా ఈరోజు (గురువారం) ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గౌరవ ముఖ్యమంత్రిని కలవడానికి అమెరికా నుండి విచ్చేసిన శ్రీ సంజయ్ మెహ్‌రోత్రా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. 

పెట్టుబడులకూ, పారిశ్రామిక యూనిట్ల స్థాపనకూ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్న సానుకూల వాతావరణం పట్ల సీఈఓ శ్రీ సంజయ్ సంతోషం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు, పూర్తి మద్దతు అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి శ్రీ సంజయ్‌కు హామీ ఇచ్చారు. 

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడటంతో పాటు పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల వినియోగం మరియు ఉపాధి అవకాశాల కల్పన దిశగా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. 

అమెరికా కేంద్రిత మైక్రాన్ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద మెమరీ చిప్స్ తయారీదారుగా, నాలుగవ అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీదారుగా ఉంది.