BILT mill should be revived: CM

Cm Revanth Reddy Held Review Meeting On Revival Of Kamlapurum Pulp Mill 08 01 2024 (2)

Hon’ble Chief Minister Sri Revanth Reddy held a review with senior officials on the status of revival of Kamlapurum Pulp Mill of M/S Ballapur Industries Limited (BILT).

The new government has prioritised the revival of sick industrial units like BILT Mill in Mulugu district to boost economic activity and provide local employment.

In this context, Hon’ble Chief Minister held a meeting with Mr. Hardik Patel, MD of Finquest Financial Solutions Pvt. Ltd. which has secured BILT assets in the State following the order from NCLAT and is in the process of disposing it to potential investors. Hon’ble CM expressed the government’s strong desire to facilitate the revival of the factory and requested Finquest team to expedite the process.

Hon’ble Chief Minister also had discussions with CEO of ITC, PSPD (Paperboards and Specialty Papers Division) Mr. Vadiraj Kulkarni on their ongoing projects in Telangana and future expansions plans. ITC is in negotiations with Finquest to acquire BILT assets. Hon’ble CM assured to extend all possible support to ITC for the successful revival of the BILT factory in Kamlapurum.

Ministers Ms. Anasuya and Smt. Konda Surekha, Chief Secretary, Prl. Secretary Industries, Spl Secretary Industries, CMO Officials, Collector, Mulugu were also present in the meetings.

About BILT unit
The Kamlapuram Mill in Mulugu District is a dedicated Pulp Mill manufacturing Rayon Grade Pulp for the Viscose Staple fibre (VSF) industry. The unit started commercial production in September1981. Run by M/s Ballapur Industries Limited (BILT) the unit became sick and was closed in 2014. The closure of the unit has affected the livelihoods of 750 worker families and 100s of indirect family’s dependent on this factory.

Several attempts were made by the past government to revive the closed unit by extending incentives in 2015 & 2018 without any success. The case was referred to NCLAT which appointed Finquest Financial Solutions Pvt. Ltd. as the Interim Resolution Professional in 2020.

BILT మిల్లును పునరుద్ధరించాలి: సీఎం 

బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన కమలాపురం పల్ప్ మిల్లు పునరుద్ధరణకు సంబంధించిన తాజా పరిస్థితిపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష జరిపారు. 

ములుగు జిల్లాలోని BILT వంటి మూతపడిన పారిశ్రామిక యూనిట్లను పునరుద్ధరించడం ద్వారా ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకోవడానికీ, స్థానికుల ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యాన్నిస్తుంది. 

ఈ క్రమంలో రాష్ట్రంలోని BILT ఆస్తులను NCLAT ద్వారా సొంతం చేసుకొని, సమర్థులైన పెట్టుబడిదారుల కోసం చూస్తున్న ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సోల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ హార్దిక్ పటేల్‌తో గౌరవ ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనుల్లో  సాయం చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అందువల్ల ఫిన్‌క్వెస్ట్ బృందం పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. 

ITC, PSPD (పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్)  సీఈవో శ్రీ వదిరాజ్ కుల్‌కర్ణితో కూడా ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. తెలంగాణా రాష్ట్రంలో సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు, సంస్థ భవిష్యత్ విస్తరణ ప్రణాళికల గురించి చర్చించారు.  BILT ఆస్తులను సొంతం చేసుకోవడానికి ఫిన్‌క్వెస్ట్ సంస్థతో ITC సంప్రదింపులు జరుపుతోంది. కమలాపురంలోని BILT ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

మంత్రులు సీతక్క గారు, శ్రీమతి కొండా సురేఖతో పాటు ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్పెషల్ సెక్రెటరీ, సీఎంవో అధికారులు, ములుగు కలెక్టర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

BILT యూనిట్ గురించి:

ములుగు జిల్లాలోని కమలాపురం మిల్లు VSF (విస్కోస్ స్టేపుల్ ఫైబర్) ఇండస్ట్రీకి రేయాన్ గ్రేడ్ పల్ప్‌ను ఉత్పత్తి చేసే పల్ప్ మిల్లు. ఈ యూనిట్ 1981 సెప్టెంబరులో వాణిజ్య ఉత్పత్తులను ఆరంభించింది. బల్లాపూర్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నడిచే ఈ యూనిట్ సంక్షోభం కారణంగా 2014లో మూతపడింది. ఈ యూనిట్ మూసివేతతో ఫ్యాక్టరీపై ప్రత్యక్షంగా ఆధారపడ్డ 750 మంది ఉద్యోగుల కుటుంబాలు, పరోక్షంగా ఆధారపడ్డ 100 కుటుంబాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

యూనిట్ పునరుద్ధరణ కోసం గత ప్రభుత్వం 2015 లోనూ, 2018 లోనూ ప్రోత్సాహకాలు అందించడం వంటి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కేస్ NCLAT కు రిఫర్ చేయబడటంతో 2020 సంవత్సరంలో ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సోల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా  NCLAT నియమించింది.