Welspun Group ready to invest in Telangana

Welspun Group Delegation Met Cm Revanth Reddy 06 01 2024 (2)

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said that Welspun Group expressed its readiness to invest more in the Telangana State. A company delegation led by Welspun group Chairman Sri BK Goenka met the Chief Minister at Dr. BR Ambedkar Telangana State Secretariat on Saturday.

The Chief Minister said that the government will pursue a new friendly policy for industrial development and inviting investments. The CM assured all kinds of support to the company.

BK Goenka said that the Welspun company will invest Rs. 250 crore in IT services launched in Chandan Valley Industrial Sector soon. His company is ready to provide IT jobs to the youth of Vikarabad and Adilabad districts in order to develop and promote IT sector in tier 2 and 3 cities.

Chief Secretary Smt. Santhi Kumari, CMO Secretary Sri Seshadri, IT Secretary Sri Jayesh Ranjan, CMO Special Secretary Dr. Vishnu Reddy, CM Special Secretary Sri Ajith Reddy, Welspun Group Head (Corporate Affairs) Sri Chintan Thakar, Sri Srisa Bhargava Movva and others are present in the meeting.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్‌పన్ గ్రూప్ సిద్ధం 

తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్‌పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. వెల్స్‌పన్ గ్రూప్ ఛైర్మెన్ శ్రీ బి. కె. గోయెంకా నాయకత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం  శనివారం డా. బీ. ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రిని కలిసింది. 

పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించడానికి ప్రభుత్వం సరికొత్త స్నేహపూర్వక విధానాలను అనుసరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. సంస్థకు అన్ని రకాల మద్దతు ఉంటుందని  ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

చందన్ వ్యాలీ ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ప్రారంభించిన IT సర్వీసెస్‌లో వెల్స్‌పన్ కంపెనీ త్వరలోనే 250 కోట్ల పెట్టుబడులు పెడుతుందని బి. కె. గోయెంకా అన్నారు. IT సెక్టార్ అభివృద్ధి చెందేలా, ప్రమోట్ అయ్యేలా వికారాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లోని యువతకు IT ఉద్యోగాలు ఇవ్వడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. 

సమావేశంలో ఛీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, సీఎంవో సెక్రెటరీ శ్రీ శేషాద్రి, IT సెక్రెటరీ శ్రీ జయేష్ రంజన్, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ విష్ణు రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రెటరీ శ్రీ అజిత్ రెడ్డి, వెల్స్‌పన్ గ్రూప్ హెడ్ (కార్పొరేట్ వ్యవహారాలు) శ్రీ చింతన్ ఠాకూర్, శ్రీ భార్గవ మొవ్వా తదితరులు పాల్గొన్నారు.