Adani Group representatives met CM

Adani Group Delegation Met Cm Revanth Reddy 03 01 2024 (2)

The Adani Group came forward again to invest in Telangana state. Chief Minister Sri A. Revanth Reddy held talks with Gautam Adani’s eldor son and CEO to Ports and SEZs Karan Adani and Adani Aero Space CEO Asish Rajvansh. The Chief Minister assured the Adani company delegation that the State Government will provide required amenities, infrastructure and subsidies to the new industries to promote industrial growth and create more employment opportunities. The CM said the government is inviting investments from Adani company to set up industries in Telangana.

The Adani Group representatives said that the company will continue the existing projects and sought necessary support from the government to establish new projects. The Adani Group delegation said that the company is ready to set up industries and create new jobs despite the change of the government in Telangana state. The representatives held talks with the government to set up a Data Center along with an Aero Space park in the state. The establishment of new projects and the progress in the ongoing projects are also discussed in the meeting.

IT and Industry Minister D Sridhar Babu, Chief Secretary Smt Santhi Kumari, IT Secretary Jayesh Ranjan, CM Secretary Shanawaz Qasim, CM Special Secretary Ajith Reddy and others are present.

సీఎంను కలిసిన అదానీ గ్రూప్ ప్రతినిధులు 

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ మరోసారి ముందుకొచ్చింది. గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు, పోర్టులు మరియు సెజ్‌ల CEO కరణ్ అదానీ మరియు ఏరో స్పేస్ CEO ఆశిష్ రాజ్‌వంశ్‌తో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించడానికి అనువుగా నూతన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనువైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు మరియు రాయితీలు అందిస్తుందని అదానీ గ్రూప్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రభుత్వం అదానీ సంస్థకు ఆహ్వానం పలుకుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 

ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను కొనసాగిస్తూనే, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సాయాన్ని కోరుతామని అదానీ గ్రూప్ ప్రతినిధులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు జరిగినప్పటికీ కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికీ, కొత్త ఉద్యోగుల కల్పనకీ సంస్థ సిద్ధంగా ఉందని అదానీ గ్రూప్ ప్రతినిధి బృందం వెల్లడించింది. రాష్ట్రంలో డేటా సెంటర్‌తో పాటు ఏరో స్పేస్ పార్క్ ఏర్పాటు గురించి ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి గురించి సమావేశంలో చర్చించారు. 

ఐటీ మరియు పరిశ్రమల శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు, ఛీఫ్ సెక్రెటరీ శ్రీమతి శాంతి కుమారి, ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్, సీఎం సెక్రెటరీ షానవాజ్ ఖాసీం, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.