Amara Raja Group Company Chairman met CM

Amara Raja Group Company Chairman Jayadev Galla Met Cm Revanth Reddy 03 01 2024 (2)

Sri Jaydev Galla, Chairman & Managing Director Amara Raja Energy & Mobility (formerly Amara Raja Batteries) met Chief Minister Sri Revanth Reddy and Minister for IT and Industries Sri Sridhar Babu in Hyderabad. During the meeting, Hon’ble Chief Minister and Sri Galla discussed Amara Raja’s ongoing projects in Telangana and explored future areas of collaboration between the State and Amara Raja.

Amara Raja Energy & Mobility (ARE&M) is one of India’s leading energy storage and mobility enterprises and is also one of the largest manufacturers of batteries for both industrial and automotive application.

As part of its foray into Advanced Energy Storage Technologies to address the growing electric mobility and Energy Storage markets, Amara Raja is setting up a Giga Corridor that will include one of India’s largest lithium-ion Giga Factories for Advanced Chemistry Cell (ACC) manufacturing and Battery Pack assembly at Telangana New Energy Park, Mahbubnagar and an R&D hub called the ePositive Energy Labs in Shamshabad with a capital investment of ₹9,500 Crores and direct employment generation potential for 4,500 people and almost similar number in indirect employment.

Chief Minister Sri A. Revanth Reddy said, “Amara Raja is a key partner in Telangana’s growth story and assured the necessary support towards the operationalization of the Advanced Chemistry Cell Giga Factory, Battery Pack Assembly and ePositive Energy Labs in Telangana.” The Chief Minister further stated that “Telangana is committed towards Clean Energy and advanced storage technologies like ACCs are a priority sector for the State.”

Sri Jayadev Galla, Chairman & Managing Director, ARE&M said “We appreciate the Government for their continued support towards quick execution of our landmark Giga corridor project. Amara Raja is set to expand exponentially and we hope that Govt. of Telangana continues to support industries so as to establish the State as a major force in the growing EV and New Energy sector.”

Chief Secretary Smt. A. Santhi Kumari, Principal Secretary ITE&C, I&C Depts. Sri Jayesh Ranjan, and Special Secretary, Investment Promotion Sri Vishnu Vardhan Reddy were also present during the meeting.

సీఎంను కలిసిన అమరరాజా గ్రూప్ సంస్థ ఛైర్మన్ 

అమరరాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమరరాజా బ్యాటరీస్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జయదేవ్ గల్లా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరియు ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ శ్రీధర్ బాబును కలిశారు. తెలంగాణలో కొనసాగుతున్న ఆమరరాజా  ప్రాజెక్టులు మరియు రాష్ట్రం, మధ్యన భవిష్యత్తులో భాగస్వామ్యానికి అవకాశమున్న రంగాల గురించి ముఖ్యమంత్రి మరియు శ్రీ గల్లా జయదేవ్ సమావేశంలో చర్చించారు. 

అమరరాజా ఎనర్జీ& మొబిలిటీ (ARE& M) దేశంలోని ప్రముఖ ఎనర్జీ స్టోరేజ్ మరియు మొబిలిటీ ఎంటర్‌ప్రైజెస్‌లలో ఒకటి మాత్రమే కాదు; ఇండస్ట్రియల్ మరియు ఆటోమోటివ్ అప్లికేషన్ రెండింటికీ అతి పెద్ద బ్యాటరీ తయారీదారుల్లో ఒకటి కూడా. 

పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌లకు పరిష్కారంగా అడ్వాన్స్‌డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీల వైపు వేస్తున్న అడుగులలో భాగంగా మహబూబ్ నగర్‌లోని తెలంగాణ న్యూ ఎనర్జీ పార్క్‌లో ఇండియాలోనే అతి పెద్ద లిథియం- అయాన్ గిగా ఫ్యాక్టరీస్ ఫర్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) మాన్యుఫాక్చరింగ్ అండ్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీతో కూడిన గిగా కారిడార్‌ను అమరరాజా ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు, ప్రత్యక్షంగా 4500 మందికి ఉద్యోగ కల్పనా సామర్థ్యం, రమారమి అంతే సంఖ్యలో పరోక్షంగా కల్పించేలా రూ. 9500 కోట్ల మూలధన పెట్టుబడితో శంషాబాద్‌లో e- పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ అనబడే R& D హబ్‌ను నెలకొల్పుతుంది. 

“తెలంగాణ అభివృద్ధి గాథలో అమరరాజా కీలక భాగస్వామి; తెలంగాణలో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ మరియు e- పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ కార్యాచరణ దిశగా అవసరమైన మద్దతు ఇస్తాం” అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

“మా ప్రయాణంలో మైలురాయి లాంటి గిగా కారిడార్ ప్రాజెక్ట్ సత్వర అమలుకు సంబంధించి ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న మద్దతు ప్రశంసనీయం. అమరరాజా విస్తృతంగా విస్తరించడానికి సిద్ధంగా ఉంది; శీఘ్రగతిన వృద్ధి చెందుతున్న EV మరియు న్యూ ఎనర్జీ సెక్టార్ రంగంలో రాష్ట్రాన్ని ప్రధాన శక్తిగా నిలబెట్టేలా,  తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం” అని ARE& M చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ అన్నారు. 

ఛీఫ్ సెక్రెటరీ శ్రీమతి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ITE& C, I& C డిపార్ట్‌మెంట్స్ శ్రీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.   

Telangana Rising