Hon‘ble Chief Minister Sri A Revanth Reddy’s speech on the occasion of Independence Day Celebrations.
Dear friends,
Independence Day greetings to all. Today is an auspicious day for all of us as our country was liberated from the shackles of British colonial rule. Today is red letter day for India since we hoisted the tricolor flag and the existence of the county came into being with a proud moment in the history of India.
Everyone has been enjoying freedom with the sacrifices of many noted personalities during the India freedom struggle. India’s freedom from colonial rule is the result of the protracted struggle and sacrifices of numerous freedom fighters. I am paying tribute to all those who sacrificed their lives to the cause of the country. Remembering the services of many freedom stalwarts, I am extending Independence Day greetings to all Telangana people.
Dear all
Fighting means – struggle, war and violence. India’s freedom struggle made its own mark by adopting a nonviolent path. India has proved that freedom can be achieved through nonviolent path to the world and the entire credit would go to Father of India Mahatma Gandhi. I am extending gratitude by bowing my head to Gandhi for showing a new path of violence free struggle and his philosophy.
Dear friends,
Achieving freedom does not imply reaching the destination. India encountered numerous hurdles in the initial times of emerging as a democratic country. The division of India soon after attaining freedom was a big challenge. The Congress party shouldered the responsibility of strengthening the country by laying strong foundations through planning and making India a modern country. India would have been a non entity if the leadership acked a political policy and foresight.
The exploitation of India for centuries forced the country to face many challenges after attaining freedom in 1947. First Prime Minister of India Pandit Jawaharlal Nehru has taken the responsibility of making India a vibrant country. Nehru’s vision and humane approach promoted India as a scientifically and industrial developing country.
Nehru has introduced five year plans by giving top priority to Agriculture and Industrial development. The irrigation projects constructed during the Nehru regime were called Modern Temples. The irrigation projects provided irrigation facilities to crores of acres. The construction of Nagarjuna Sagar, Srisailam, Sriram Sagar projects tarted during the Nehru regime. Former Prime Minister Indira Gandhi has completed the projects and brought cheers in the lives of crores of farmers in India.
BHEL, ECIL, IDPL and Midhani companies were established during the golden era of Congress rule. The green revolution, white revolution, Blue revolution were launched for the integrated development of the country. The banking sector was also nationalised and reached the services at thedoorstepss of rural people . This all happened only by the visionary Congress leadership in independent India.
The Green Revolution introduced by the former prime ministers Lal Bahadur Shastri and Indira Gandhi addressed the food crisis in India, which imported foodgrains till 1947, and emerged as one among food grain exporting countries in the world. The 20 point programme launched by Indira Gandhi helped for social and economic emancipation of people. Rajiv Gandhi brought revolutionary reforms in the telecom sector. Indigenous technology was also developed in the Space and Atomic energy sectors and India stood one among a few countries in the world to compete.
While Rajiv Gandhi brought a scientific revolution in the country, Telugu pride and proud Son of Telangana PV Narasimha Rao changed India’s future by introducing economic reforms. The development which took place during Nehru, Indira Gandhi, Rajiv Gandhi and PV Narasimha Rao’s regime placed India as one of the fastest developing countries and competed with the developed nations. The Congress contributions during the freedom struggle and in nation building are significant and remarkable. Today’s generation should understand the facts and acquire knowledge.
Dear all
Congress has the history of its commitment to the word given to people and ruled the country with dedication. The Congress also fulfilled the aspirations of Telangana people. Smt Sonia Gandhi made the promise of statehood for Telangana at Karimnagar public meeting in 2004. Sonia Gandhi assured that she will fulfill the aspirations of Telangana people and proved by granting statehood for Telangana on June 2, 2014.
Our philosophy is Gandhi philosophy. Gandhi says freedom means not only political emancipation but also the social and cultural renaissance. The true meaning of sacrifices and independence will be credited only when the fruits of India’s freedom reach to the underprivileged communities. The respect and value of the country will be elevated with the comprehensive development of all sections of people.
Dear friends
After a decade of the formation of Telangana state, the people’ government formed in the state in tune with the aspirations of four crore Telangana people, sacrifices of youth and students struggle. The Telangana State was originally liberated on December 3, 2023. The government was elected by the people and for the people. First time, the state is witnessing a democratic government.
Dear all
My government accorded the first priority to revive the freedom which Telangana was deprived of for the last 10 years. We broke the shackles of physical and psychological slavery. Today, people have the freedom to question the government. A facility was also created to seek suggestions from people to run the people-friendly government. The state government is functioning in the interests of the majority of people. The government is ready to rectify mistakes, if any. We have been maintaining restraint though some forces made false allegations against the government. The government is functioning with utmost conscience and inspiration.
Dear friends
The state economy was completely ruined when the Congress assumed power in the state. The debt burden mounted by 10 times. The total state debt at the time of formation of Telangana was Rs 75,577 crore and it has increased to Rs 7 lakh crore in December last year. Government released a white paper on State finances and also committed to revitalize the state economy.
The government is already making efforts to restructure the state debts. We met with the World Bank President during our recent visit to America. I am delighted to announce that talks with the world bank representatives were held in a cordial manner in extending financial assistance with low interest rate for State development. My government will not commit the mistakes of borrowing funds with higher interest rates and putting a heavy burden on people. Despite facing financial hurdles, the government is making all out efforts to fulfill the promises of Abhayahastham with a commitment of bringing happiness in every family.
Mahalakshmi Scheme
Without making any financial estimations, my government created a record by implementing two of the six promises within 48 hours after coming to power. Free bus travel for women was launched. As of July, women saved Rs 2619 crore from the free bus travel scheme.
Rajiv Arogyasri:
My government is committed to save every patient by providing adequate medical treatment. The Arogyasri scheme is being strengthened by providing corporate medical treatment to the poorer sections. The limit of the Arogyasri scheme has been increased to Rs 10 lakhs from Rs 5 lakhs to implement the scheme effectively. 163 medical treatments have been added under Arogyasri. The health insurance covers 1825 medical treatments. The prices of Arogyasri packages also increased by 20 per cent. Organ transplantation and other modern medical treatments are also brought under the purview of the health scheme. Government already decided to extend Arogyasri services without ration cards and committed to modernize the government hospitals to extend medical facilities to all. The distribution of Digital Health Profile cards with an unique number to everyone will be launched soon. The government came up with the idea of distributing digital health cards by compiling the health data of all people and extending medical treatment and diagnosis in a simple way.
Cooking Gas Cylinder at Rs 500 only
With an aim to wipe out the tears of women, the government launched a highly subsidised LPG gas cylinder supply scheme at Rs 500 under the Mahalakshmi program. The gas cylinder price was Rs 410 at the time of Congress losing power in 2014. The cylinder price has increased to Rs 1200 in 10 years. RS 500 gas cylinder scheme was launched on February 27 this year by extending the benefit to 40 lakh . Today the total beneficiaries are 43 lakh under the scheme. The government has spent Rs 242 crore for 85.17 lakh cylinders supplied to the beneficiaries.
Gruha Jyoti Scheme
The scheme has been introduced to reduce burden on poor families and supply quality power to the beneficiaries. Free power up to 200 units is being supplied to every identified family. The scheme was launched in March 2024. The scheme benefit is being extended to those who submitted applications at Praja Palana centers also. A total number of 47.13 lakh beneficiaries are enjoying the scheme benefit.
Indiramma Houses
As promised in the election manifesto, the government launched INDIRAMMA housing scheme to fulfill the dream of owning a house by poorer sections in the state. The scheme was launched in the presence of Lord Sitarama in the temple town of Bhadrachalam. The government targeted to construct 4.50 lakh houses this year. 3500 houses have been alloted to every Assembly Constituency. Rs 5 Lakh financial assistance will also be provided to poor who construct their house.
Farm Loan Waiver up to Rs 2 Lakhs
The State Government accorded top priority to agriculture. A whopping Rs 72,659 crore has been alloted for agriculture and allied sectors in the budget. Efforts are also being made to enhance the farmers incomes and also farm output.
Seeds and fertilizers are supplied to the farmers through Primary Agricultural Cooperative societies. Government supplied 11.85 lakh metric tonnes of fertilizers to farmers up to July 24 in Vana Kalam season this year.
Dear friends
Farmers are celebrating a big festival in the state. The distressed farmers are freed from mounting debt burden. As per the Warangal Declaration announced during the election period, the government is successfully implementing farm loans up to Rs 2 lakhs in one go. Some political forces said the farm loan waiver is impossible. The government made it possible and proved farmer friendly. Opposition parties are trying to find fault in the implementation of the farm loan waiver scheme. I would like to say something about. Every deserving farmer will benefit from the scheme. The State Agriculture department took the responsibility of addressing the grievances that arose due to technical problems.
Dear friends
Government has deposited Rs 6,098 crore in the farmers bank accounts directly on July 18 and relieved them from debt burden up to Rs 1 lakh in the first installment. 11.50 lakh farmers got a big relief. In the second phase, 6.40 lakh farmers availed the farm loan waiver scheme benefit. Today, we are witnessing a wonderful occasion of the waiver of farm loan up to Rs 2 lakhs at one time. It is a proud moment that farmers got a big relief from debts on the same day of the independence day. My life purpose is fulfilled. I strongly believe that the country will flourish when the farmers prosper. GovThe governmentent Rs 31,000 crore on farm loan waiver.
Rythu Bharosa
My government is committed to provide Rs 15,000 per acre to every eligible farmer under the Rythu Bharosa scheme. The previous government paid only Rs 10,000 per acre. The ineligible mainly the land owners who did not cultivate lands and realty owners also benefitted. Public money was misused and the farmers are at the receiving end. Government is preparing modalities and guidelines to implement the Rythu Bharosa scheme in a transparent manner. A Cabinet Subcommittee was also constituted. The subcommittee visited the state and sought opinions and suggestions from farmers, agriculture labourers, intellectuals and farmer associations on Rythu Bharosa. Government will launch Rythu Bharosa by considering all suggestions and finalizing the modalities.
Rs 500 Bonus for Fine Paddy Variety
Telangana has been practicing abundant paddy cultivation. Farmers are facing problems due to lack of remunerative price to their farm produce. It is decided to provide a Rs 500 bonus for fine paddy varieties. 33 fine varieties were already identified.
Government is purchasing paddy at the procurement centers and also provided a minimum support price. The number of procurement centers increased to 7178 in the Rabi season. The payments are made within 48 hours of the purchase. 24 hour free power supply to agriculture is provided. The government is curbing spurious seed supply strictly.
Crop Insurance Scheme
Government has decided to join the Fasal Bima Yojana scheme to implement the crop insurance scheme. Government will pay the premium on behalf of the farmers and provide security to the crops with any burden on the farming community. The Rythunestham program has been launched to provide modern technology and advanced scientific practices to the farmers to increase the crop yields. Special incentives will be provided for Palm Oil and Horticulture crops.
Solution for Dharani Problems
Government paid special focus on Dharani problems being faced by the farming community in the state. Farmers suffered a lot due to irregularities and lopsided policies adopted in the functioning of Dharani. Special drive was taken up between March 1 and 15 to address Dharani problems. Government has taken measures to register complaints in case the applications on dharani problems are rejected. Government already instructed the authorities to address the pending dharani applications. The government is mulling to bring an integrated act to address land related issues.
Tackling Drug Menace with Iron Hand
Today , the society is marred by drug and cyber crimes. The threat of ineffectiveness of the people is looming large due to the two big menaces. It is a worrying factor for all and the major concern is the future generations. Strict measures have been initiated to free the state from drug menace. Government adopted Zero tolerance to curb drug trafficking. T- NAB is strengthened. Call centre with 1930 number is functioning round the clock to receive complaints from the victims of the cyber frauds.
Revolutionary Reforms in Education
Government decided to constitute the ” Vidya Commission” soon. Anganwadi centers will be upgraded as Pre Primary schools. The task of providing Quality education, skill development and job creation will be taken up on a mission mode.
Uniforms and textbooks supplied to the students on the first day of the opening of the schools. Basic amenities in the schools are provided through Amma Adarsha School Committees. 65 ITI institutions are upgraded as skill development centers with the help of Tata company. Integrated Model schools for SC, ST, BC and Minorities will be established on a sprawling 25 acres in every Assembly Constituency.
Foundation stone was already laid for Young India Skills University at Begari Kancha. This new initiative will be revolutionary in Telangana education sector. Job guarantee is provided to the youth with new skills. Mahindra group Chairman Anand Mahindra has been appointed as the Chairman of the Skill University.
Telangana As ‘Future State’
It is not glossy buildings and colourful walls but qualitative change in the lives of people is the need of the hour. Development and welfare should be undertaken equally to bring qualitative changes in people’s lives. The Telangana should be promoted as the Gateway of the world . The Telangana brand should be projected on the world platform. As part of it, Minister Sridhar Babu and myself visited America recently. We held meetings with global investors and multinational company representatives and explained investment prospects in Telangana. We projected Telangana as a Future State and explained the initiatives – Fourth city, Musi Riverfront Development project, Regional Ring Road, International standard civic infrastructure, Metro Rail expansion etc. Government entered MoUs with companies and achieved a record Rs 40,000 crore investments in Telangana at Davos meeting. Government already started an action plan to execute the agreements. We strongly hope that the huge investments will provide employment to Telangana youth.
HYDRA FOR CITY
Government has established HYDRA for the management of Hyderabad City and the proposed new City in a planned manner. All the urban areas and Gram panchayats spread up to Outer Ring Road are recognised as Telangana Core Urban Region. HYDRA ( Hyderabad Disaster Response and Assets Protection Agency) will protect government properties, water bodies and parks from encroachments. The Hydra will also play a key role in disaster management in the crisis time.
Employment Opportunities for Youth
Government handed over appointment orders to 30,000 selected persons within 3 months after coming to power. Telangana Public Service Commission has been reformed and conducted Group one prelims exam successfully. DSC to fill 11,062 teachers posts was also conducted successfully. The age limit for government jobs increased to 46 years from 44 years.
Government solved the legal problems to conduct Group one, Group -2 and Group 3 exams. Job calendar was also announced in the Assembly. The exams will be conducted as per the job calendar and fill the vacancies every year. I am assuring the unemployed youth that my government is ready to solve the problems . Youth should bring their issues to the notice of the government. My appeal to the youth is to not get carried away by false statements from rival parties and spoil the future. Youth have already lost their precious 10 years of time. I will stand by as a big brother. Rs one lakh financial assistance is already provided to the students who cleared Civils prelims under Rajiv Gandhi Civils Abhayahastham with the support of Singareni.
INDIRA MAHILA SHAKTI SCHEME
Government already envisaged plans to empower 63 lakh women as entrepreneurs and industrialists under the Indira Mahila Shakti scheme. The government targeted to provide Rs one lakh crore financial assistance and establish Srinidhi. Government will provide required skills to the women groups and also promote their products through branding and marketing.
Government already introduced a loan insurance scheme under the Indira Mahila Shakti scheme. Under the scheme, a maximum loan amount of Rs 2 lakhs will be waived off in case the woman member in the group dies. The self help groups were already given the works of stitching school uniforms and opened DWCRA Mahila Bazar to sell their products at shilparamam. Life insurance facility is also provided to 63.86 women group members. Rs 10 lakh accident insurance policy for women groups was also launched.
Solving Division of Assets
The division of assets between the two states after the bifurcation of Andhra Pradesh remained pending for the last 10 years. Water sharing in river Krishna and Godavari was also not addressed. My government is giving priority to state interests and maintaining cordial relations with the neighbouring states as well as with the Centre. Government is hoping for a positive outcome from the talks held recently with AP Chief Minister N Chandrababu Naidu on pending bifurcation related issues.
This is the people’s government and everyone’s government. My government respects democratic values and gives importance to freedom. I am assuring all that the government will accord top priority to welfare and make Telangana proud on the world platform. I am appealing to all to extend cooperation and Independence day greetings to all once again.
Dear friends
The USA and South Korea tour derived fruitful results. We held talks with 10 most popular global companies. The government entered agreements for Rs 31,532 crore investments in Telangana. The MoUs with global companies will create 30,000 job opportunities. Government introduced Telangana as’ Future City’ before the world during the US visit. It is a big milestone. Hoping Telangana will reach many heights in the future, I am assuring all that the People’s Government will strive to prosper farmers, youth , women, employees, traders and all sections in a peace loving welfare state.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రసంగం
15, ఆగస్టు 2024
మిత్రులారా…
భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.
మిత్రులారా…
ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం. సుదీర్ఘ పోరాట ఫలితం. అనేక ప్రాణత్యాగాలు, అనేకానేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్య్రం. ఎందరో మహామహుల త్యాగాల వెల కట్టలేని బహుమతి ఈ స్వాతంత్య్రం.
అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారి త్యాగాలను స్మరిస్తూ… తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా…
పోరాటం అంటే ఘర్షణ…. యుద్ధం… హింస. కానీ, ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వాతంత్ర్య పోరాటం. అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వాతంత్య్ర సంగ్రామం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి… ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది. ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మాగాంధీకి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు, శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
మిత్రులారా…
ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించడంతో గమ్యం చేరినట్టు కాదు. అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం. ఒక వైపు సవాలక్ష సమస్యలు. మరోవైపుదేశ విభజన గాయాలు. ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుంపట్లు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి… ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి… కార్యాచరణలు ప్రకటించి సగర్వంగా, సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భుజాలపై ఉండింది. అజాగ్రత్తగా ఉన్నా, అలసత్వం వహించినా, రాజనీతి లోపించినా, దూరదృష్టి కొరవడినా నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయి ఉండేది.
మిత్రులారా…
శతాబ్దాల దోపిడి, అణచివేతల తరువాత స్వాతంత్ర్యానంతరం 1947 లో అధికారం చేపట్టే నాటికి అంతా శూన్యం. చేతులు కాళ్లు కూడదీసుకుని, ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, పారదర్శక, ప్రజాస్వామ్య పాలన అందించాల్సిన బాధ్యత నాటి నాయకత్వంపై పడింది. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వంటి గొప్ప మానవతావాది, దార్శనికుడి కారణంగా భారతదేశం ఈ నాడు ఒక వైభవోపేత వైజ్ఞానిక దేశంగా, పారిశ్రామిక శక్తిగా ఎదగ కలిగింది అని చెప్పక తప్పదు.
మిత్రులారా…
పంచవర్ష ప్రణాళికలు రచించి, ఈ దేశానికి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి అన్నవి రెండు కళ్లు అని నమ్మి ఆ దిశగా తొలి అడుగులు వేయించిన దార్శనికుడు పండిట్ నెహ్రూ, ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చతోరణాన్ని కట్టుకున్నాయంటే దానికి కారణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే… ఆ తర్వాత వాటిని పూర్తి చేసి, కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాలు పారించిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీకి దక్కుతుంది.
మిత్రులారా…
అంతేకాదు, పారిశ్రామికంగా BHEL, ECIL, IDPL, మిథాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినవే. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్నిరంగాల సమగ్రాభివృద్ధికి కృషిచేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయీకరణతో గ్రామీణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత, ప్రతి పౌరుడుకి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆ నాటి దార్శనికుల వల్లనే జరిగింది.
మిత్రులారా…
1947 వరకూ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న మనదేశం, ఈ నాడు ప్రపంచంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఒకటిగా ఎదగడానికి కారణం స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన హరిత విప్లవమే. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక, ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించే అతికొద్ది దేశాల సరసన భారతదేశాన్ని ఆనాడే నిలుపగలిగారు.
మిత్రులారా…
స్వర్గీయ రాజీవ్ గాంధీ హయాంలో ఈ దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకు రాగా… ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ స్వర్గీయ పీవీ నర్సింహారావు గారు ఆర్థిక విప్లవాన్ని తీసుకువచ్చి భారత దేశ ముఖచిత్రాన్నే మార్చేశారు. ఇట్లా… నెహ్రూ హయాంలో మొదలైన భారత దేశ విజయ ప్రస్థానం ఇందిరా, రాజీవ్, పీవీ హయాంతో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరే స్థాయికి ఎదిగింది. స్వాతంత్య్ర సాధనతోపాటు కాంగ్రెస్ ఈ దేశానికి అందించిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నేటి ప్రజలు, ఈ తరం యువకులు ఈ వాస్తవాలను గ్రహించాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా…
ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. భక్తి శ్రద్ధలతో ఈ దేశాన్ని పాలించిన చరిత్ర మనది. తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది. 2004 లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియాగాంధీ గారు మాట ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు. వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో… ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది.
మిత్రులారా…
మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం. మా వాదం గాంధేయవాదం. మహాత్ముడి దృష్టిలో స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ విమోచనం మాత్రమే కాదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనం. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వాతంత్ర్యానికి, మహనీయుల త్యాగాలకి అర్థం ఉంది. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది.
మిత్రులారా…
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది. నాటి బ్రిటీషు దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా ఐతే విముక్తి చెందిందో… అదే స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023న స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని పొందాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం కొలువై ఉంది. తొలి సారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతోంది.
మిత్రులారా…
గడచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు… మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచేశాం. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి… మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇంతటి వ్యవస్థలో లోటు పాట్లు ఉండొచ్చు. మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నాం.
మిత్రులారా…
ఎన్నికల సందర్భంలోనే చెప్పాం. మేం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం. ఈ రోజు అక్షరాలా అది చేసి చూపిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలన సాగిస్తున్నాం. ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమానావకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఆవిర్భావానికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఇటీవలే దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకున్నాం.
మిత్రులారా…
ఈ ఉత్సవాల సందర్భంగా అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైనా రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది. ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ…” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశాం. తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాం. తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో TS స్థానంలో TGని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇది ప్రజల ఆకాంక్ష.
మిత్రులారా…
మా ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,577 కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు, గత ఏడాది డిసెంబరు నాటికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరం అని భావించాం.
మిత్రులారా…
ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీ స్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి… రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులు మేం చేయబోం. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
మహాలక్ష్మి పథకం అమలు
ప్రభుత్వంలో మేం కుదురుకోక ముందే. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోక ముందే హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా జూలై ఆఖరు నాటికి మహిళలకు 2,619 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాం అని గర్వంగా చెప్పగలను.
రాజీవ్ ఆరోగ్యశ్రీలో మరో 163 చికిత్సలు..
మిత్రులారా…
రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నది మా ఆశయం. ఈ రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ కి పూర్వవైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేశాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలుపరిచేందుకు ఆరోగ్యశ్రీ కింద ఉ చితంగా అందించే వైద్యచికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాం.
కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చాం. మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను 20శాతం పెంచాం. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి, విస్తృత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యగల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీచేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తాం. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండి, సులభంగా రోగనిర్ధారణ, సత్వర చికిత్సకు వీలు కల్పించేందుకే ఈ ఆలోచన చేశాం.
రూ. 500 కే వంటగ్యాస్ సిలెండర్
మిత్రులారా…
ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. 2014 లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ బండ ధర 410 రూపాయలు మాత్రమే. పదేళ్లలో దానిని 1200 రూపాయలకు పెంచిన పాలన మీరు చూశారు.
అందుకే తిరిగి దాన్ని 500 రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి, 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం… ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతోంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 85 లక్షల 17 వేల 407 సిలిండర్లకు గాను 242 కోట్ల రూపాయలు చెల్లించాం.
గృహజ్యోతి తో పేదల ఇంట వెలుగులు
మిత్రులారా…
అల్పాదాయ వర్గాలవారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి, వారి గృహాలలో చీకట్లను పారదోలి, విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలుచేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. ప్రజాపాలన సేవాకేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నాం. ప్రస్తుతం 47 లక్షల 13 వేల 112 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ళు
మిత్రులారా…
ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద, బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ళ చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద పేదలు ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది.
రైతన్నలకు రూ. 2 లక్షల వరకూ రుణ మాఫీ మిత్రులారా…
మా ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంది. అందుకే ఇటీవల బడ్జెట్ లో వ్యవసాయ, అనుబంధ రంగాలకి భారీ మొత్తంలో 72,659 కోట్ల రూపాయలు కేటాయించాం. ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులు పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తోంది. రైతులకు కావలిసిన ఎరువులు, విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది వానాకాలం పంటకు జూలై 24 నాటికి 11.85 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశాం. ఇప్పటికీ ఇంకా 10.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
మిత్రులారా…
రాష్ట్రంలోని రైతాంగం నేడు అతి పెద్ద పండుగ జరుపుకుంటోంది. ఇంతకాలం రుణ భారంతో బతుకుభారమైన తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషను అనుగుణంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇది అసాధ్యమని చాలా మంది వక్రభాష్యాలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకూ ఏక కాలంలో రుణ మాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలచుకున్నాను… పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే… వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకుంటుంది.
మిత్రులారా…
తొలిదశలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణ మాఫీ సొమ్ము 6,098 కోట్ల రూపాయలను జూలై 18న నేరుగా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 11 లక్షల 50 వేల మంది రైతన్నలు రుణవిముక్తి పొందారు. రెండో దశలో 6,190 కోట్ల రూపాయలను జూలై 30న నేరుగా రైతుల ఖాతాలో జమ చేసింది. దీనివల్ల 6 లక్షల 40 వేల 823 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. కాగా, 2 లక్షల రూపాయల వరకు గల రుణాలను ఈ రోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే… తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు. ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. ఎందుకంటే, దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే 31 వేల కోట్లు వెచ్చించి… రైతును రుణ విముక్తుడిని చేస్తున్నాం.
రైతు భరోసా
మిత్రులారా…
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది. అర్హులైన రైతు లందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది.
ఈ ఉప సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నాం.
సన్న వడ్లకి రూ.500 బోనస్ మిత్రులారా…
మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోంది. కానీ, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనికి 33 రకాల వరిధాన్యాలను గుర్తించాం.
రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతుల సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్ లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178 కి పెంచాం. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. నకిలీ విత్తన అక్రమార్కులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.
పంటల బీమా పథకం
మిత్రులారా…
రైతులకు పంటలబీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుంది. రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల దిగుబడికి సంబంధించి శాస్త్రీయ పద్ధతులు తెలియజేయడానికి “రైతు నేస్తం” కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది.
ధరణి సమస్యలకు పరిష్కారం…
మిత్రులారా…
రైతుల పాలిటశాపంగా మారిన ధరణి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగింది. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. ‘ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ధరణిలో సమస్యల పరిష్కారం, పరిష్కారం చేయలేనివి ఉంటే సదరు దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకు రావాలని భావిస్తున్నాం.
మాదక ద్రవ్యాల పై ఉక్కుపాదం
నేరం రూపం మార్చుకుంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ నేరాల వల్ల వ్యక్తులు కాదు… మొత్తం జాతే నిర్వీర్యం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఆందోళన కరమైన అంశం. మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని, కనపడకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. డ్రగ్స్ నియంత్రణ, నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తున్నాం. తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (టీ-న్యాబ్)ను బలోపేతం చేశాం. సైబర్ మోసాలు, నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అందించేందుకు 1930 నెంబర్ 24 గంటలు పని చేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అంగన్వాడి లను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో చేయాలని సంకల్పించాం.
మిత్రులారా…
పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 65 ప్రభుత్వ ఐ.టి.ఐ లను టాటా సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం.
మిత్రులారా…
ఇటీవలే బేగరి కంచె వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణ విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతోంది. మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతోంది. సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారెంటీ ఇవ్వబోతోంది. ఈ యూనివర్సిటీకి మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్ గా నియమించాం.
ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ – హైదరాబాద్
మిత్రులారా…
రంగుల మేడలు, అద్దాల గోడలు కాదు. ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పులు రావాలి. దానికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరగాలి. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. తెలంగాణ బ్రాండ్ ను విశ్వవేదిక పై సగర్వంగా చాటాలి. అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను, శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో భేటీ అయ్యాం. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించాం. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం. బేగరి కంచె వద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ, తదితర ఆలోచనలను వారితో పంచుకున్నాం. జనవరిలో దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఇవి దోహదం చేస్తాయని మేం విశ్వసిస్తున్నాం.
నగరానికి హైడ్రా సేవలు
కొత్త నగర నిర్మాణమే కాదు. ఉన్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైడ్రా అని కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించిన పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించాం. దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని చేస్తుంది. సర్కారు ఆస్తుల పరిరక్షణతోపాటు, విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత హైడ్రాకు పెట్టాం.
యువతకు ఉద్యోగావకాశాలు
మిత్రులారా…
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, ఇప్పటికే గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను విజయవంతంగా జరిపించాం. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ని విజయవంతంగా నిర్వహించాం. ఉద్యోగ నియామక వయోపరిమితిని కూడా 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళకు పెంచాం.
మిత్రులారా…
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించాం. ఇటీవలే శాసనసభలో జాబ్ క్యాలెండర్ ను ప్రవేశ పెట్టాం. దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా. మీ సమస్యలు ఏమైనా ఉ ంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకో వద్దు. ఎవరి ఉద్యోగాల కోసమో…
మీ జీవితాలను బలి చేసుకోవద్దు. ఇప్పటికే గడచిన పదేళ్లుగా మీరు చాలా నష్టపోయారు. పెద్దన్నగా మీకు నేను అండగా ఉంటా. సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువతకు లక్ష రూపాయల వంతున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించాం.
ఇందిరా మహిళా శక్తి పథకం
రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తినైపుణ్య శిక్షణ ఇప్పించి, బ్రాండింగ్, మార్కెటింగ్లలో మెళకువలు పెంపొందించే సౌకర్యాలు కల్పిస్తాం.
మిత్రులారా…
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణబీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీచేయడం జరుగుతుంది. స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫారాలు కుట్టే పనిని అప్పగించడంతో పాటు, వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు 10 లక్షల ప్రమాద జీవిత బీమా చేయడం జరిగింది.
విభజన సమస్యలు పరిష్కారం దిశగా..
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు గత దశాబ్దకాలంగా ఏవిధమైన ప్రయత్నాలూ జరగక పోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు కూడా తేలాల్సి ఉంది. మా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇందుకోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో స్నేహపూర్వకంగా, సఖ్యతతో వ్యవహరిస్తున్నాం. రాష్ట్ర విభజనానంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరం పరిష్కరించు కోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నాం.
ఇది ప్రజా ప్రభుత్వం. ప్రతి ఒక్కరి ప్రభుత్వం. స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ… ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ… సంక్షేమానికి పెద్దపీట వేస్తూ… విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తూ… దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ… మరొక్కసారి అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మిత్రులారా…
చివరిగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30 వేల మందికి పైగా నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి ఈ పర్యటన ద్వారా పరిచయం చేశాం. ఇదొక గొప్ప ముందడుగు. భవిష్యత్ లో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుతుందని… రైతులు, యువత, మహిళ, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, సకల జనులు సుఖశాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇస్తూ… అందరికీ ధన్యవాదాలు.
జై హింద్… జై తెలంగాణ