
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్‌లోని ప్రసిద్ధ హిరోషిమా శాంతి స్మారకాన్ని (Hiroshima Peace Memorial) సందర్శించారు. 1945 రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై జరిగిన అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
నాటి అణుబాంబు విధ్వంసంలో నిలిచిన ఏకైక శిథిలం అటామిక్ బాంబ్ డోమ్ (Atomic Bomb Dome)ను కూడా సందర్శించారు. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారు, అధికారులు నివాళర్పించిన వారిలో ఉన్నారు.
