Hon’ble CM Sri Revanth Reddy Strongly Condemns Terror Attack on Tourists in Pahalgam

Pahalgama Condemns Cm 1
Pahalgama Condemns Cm 2

జమ్ము కశ్మీర్ పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి గారు పలువురు మంత్రివర్గ సహచరులతో నిర్వహించిన సమావేశం ఉగ్రవాదుల దాడులను ఖండించింది.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఇతర ప్రతినిధులతో జరిగిన సమావేశం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.