Hon’ble CM Sri Revanth Reddy Inaugurates Telangana Pavilion at Prestigious Osaka Expo, Showcasing State’s Culture, Innovation, and Investment Potential

Osaka Expo Cm
Osaka Expo Cm 2

జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు. ఎక్స్పోలోని భారత పెవిలియన్‌లో తెలంగాణ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రతి ఐదేళ్లకు ఒసాకా ఎక్స్పోను నిర్వహిస్తారు. ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న భారతదేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం విశేషం.

ఒసాకా ఎక్స్పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచవ్యాప్తంగా వచ్చే సందర్శకులకు ప్రదర్శించనుంది.తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.

ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.

Osaka Expo Cm 3
Osaka Expo Cm 4