
రాజ్‌భవన్‌లో జరిగిన తెలంగాణ లోకాయుక్త (Lokayukta), ఉపలోకాయుక్త (UpaLokayukta) పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) గారు లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు, ఉప లోకాయుక్త జస్టిస్ బీఎస్ జగ్జీవన్ కుమార్ గారితో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు గారు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, వేం నరేందర్ రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

