CM Sri Revanth Reddy Congratulates Esha Singh on Winning Silver at ISSF World Cup 2025

Champian Cm 08 04 2025

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) వరల్డ్ కప్ 2025 లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ 25 మీ. మహిళల పిస్టల్ ఈవెంట్‌లో రజత పతకం సాధించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు.

మహిళల షూటింగ్ ఈవెంట్‌లో ఈషా సింగ్ పతకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని ముఖ్యమంత్రి గారు అన్నారు. క్రీడల్లో మహిళలు సత్తా చాటడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.