CM Sri Revanth Reddy Announces Ministerial Committee to Resolve Kanch Gachibowli Land Issues.

Hcu Meeting Cm Sir Pic 04 04 25

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తదుపరి కార్యాచరణపై మంత్రుల బృందంతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

కంచ గచ్చిబౌలి భూ సమస్యల పరిష్కారం దిశగా ఈ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీతో, జేఏసీ మరియు పౌర సమాజ సమూహాలతో, విద్యార్థుల ప్రతినిధి బృందంతో, అలాగే సంబంధిత స్టేక్ హోల్డర్లు అందరితోనూ సంప్రదింపులు జరుపుతుందని ముఖ్యమంత్రి గారు X లో పేర్కొన్నారు.