
జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రఖ్యాత టోక్యో మెట్రో (Tokyo Metro) ను సందర్శించింది. తొమ్మిది లైన్లతో సమర్థవంతంగా నిర్వహించబడుతున్న టోక్యో మెట్రో అత్యాధునిక కార్యాచరణ సామర్థ్యం, అధునాతన సాంకేతికతల వినియోగాన్ని తెలంగాణ బృందం పరిశీలించింది. స్థానిక ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతమైన సేవలను అందిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది.
హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) రెండవ దశ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే క్రమంలో, ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అధ్యయనం చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని బృందం టోక్యో మెట్రోను సందర్శించింది.

