
రంజాన్ పండుగను పురస్కరించుకుని కొడంగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. స్థానిక మతపెద్దలు, ముస్లిం సోదరులతో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

