
బలహీన వర్గాల గృహ నిర్మాణం కింద హుజూర్‌నగర్ రామస్వామి గుట్టలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఆ కాలనీని పరిశీలించారు.

