
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి గారి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు
ప్రపంచంలో ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవాలన్న దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా అవసరమైన వైద్య సహకారం అందించడానికి వీలుగా సమగ్ర హెల్త్ టూరిజం పాలసీని తీసుకురానున్నట్టు తెలిపారు.