దావోస్‌లోని తెలంగాణ పెవీలియన్‌లో సందడి నెలకొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (wef) 55 వ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పెవీలియన్ ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

తెలంగాణ రైజింగ్ నివాదంతో రెండో రోజు అనేక ఉత్తేజకరమైన, పెట్టుబడులకు ఆశాజనకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి గారితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారితో కలిసి తెలంగాణ పెవీలియన్‌లో యునిలివర్ ఇన్‌కార్పొరేషన్ (భారత్‌లో హిందుస్తాన్ లీవర్) గ్లోబల్ సీఈవో హెయిన్ షూమేకర్ సమావేశం కానున్నారు.
అలాగే గ్లోబల్ పబ్లిక్ పాలసీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (Amazon Web Services), సిఫీ టెక్నాలజీస్ (Sify Technologies), స్కైరూట్ ఎయిరోస్పేస్ (Skyroot Aerospace), ఎజిలిటీ (Agility), యూపీఎల్ (UPL Ltd) వంటి అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశాలు, చర్చలు ప్రారంభం కానున్నాయి.
అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సారధ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరుపనుంది.
