- Field level inspection from October 3 to October 7
- Officials will visit 238 habitations for five days across the state
- More number of teams based on population in Urban areas
- Taking Family photos is an option
Chief Minister Sri A Revanth Reddy ordered the officials to take up the official process for the issuance of ‘Digital Family Cards’ at the field level on a pilot basis in 119 Assembly Constituencies in an effective manner.
CM suggested selecting one urban and one rural area within each constituency for this project. If a constituency is entirely urban, two wards/divisions should be chosen; if it is entirely rural, two villages should be selected, resulting in a total of 238 areas for field-level inspection. The CM suggested increasing the number of field visit teams in the wards and divisions in view of the high density of population in the particular area.
CM Revanth Reddy conducted a high level review on issuing the family digital cards at the state secretariat on Monday. The officials briefed the details of the pilot project which is being taken up soon to the Chief Minister. The officials explained to the CM that the selection of villages, wards/divisions for field level inspection in 119 constituencies has been completed. When the CM enquired about the requirement of time to complete the pilot project, the officials informed that the field visit will be carried out for five days from October 3 to October 7.
The Chief Minister made it clear that field-level officials should seek the permission of families before taking their photos. The authorities have been asked to take photos of the families if they are optional and to stop the photos if the family members object.
The chief minister asserted that the Nodal Officers of the old districts should guide the district Collectors regarding the field-level inspection and then only the program will be conducted in a productive manner.
Officials briefed the CM that the process of identification of families has already been completed based on the data of Ration Cards, Pension, Self-Help groups, Farmer Insurance, Insurance, Health insurance, etc. CM Revanth Reddy advised the officials to take necessary steps in the name registration and changes, if any, in the compilation of the details of family members. The CM warned of any mistakes.
The Chief Minister also instructed the officials to prepare a report on the challenges and productive outcomes of issuing digital cards based on the pilot project. A full-scale field-level inspection will be carried out after discussing the report and rectifying the errors, the CM said.
State Ministers – Konda Surekha, P Srinivasa Reddy, Adviser to the Chief Minister Vem Narender Reddy, Chief Secretary Santhi Kumari, Principal Secretary to the Chief Minister Sheshadri, Chief Minister’s secretaries Manik Raj Sangeeta Satyanarayana, Special Secretary to CM – Chandrasekhar Reddy, and senior officials of various departments participated.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై 3 నుంచి 7వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్ర స్థాయి పరిశీలన
- రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో అయిదు రోజుల పాటు సాగనున్న ప్రక్రియ
- పట్టణ/నగర ప్రాంతాల్లో జనాభా ఆధారంగా ఎక్కువ టీమ్‌లు
- కుటుంబ ఫొటో దిగడం ఆప్షన్ మాత్రమే…
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఒక వేళ పూర్తిగా పట్టణ/నగర నియోజకవర్గమైతే రెండు వార్డులు/ డివిజన్లు, పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైతే రెండు గ్రామాల్లో మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వార్డులు/ డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిశీలన బృందాల సంఖ్యను పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిట్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు, సేకరించే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామాలు, వార్డులు/ డివిజన్ల ఎంపిక పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. పైలెట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేపడతారని సీఎం ప్రశ్నించారు. అక్టోబరు మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అయిదు రోజుల పాటు చేపడతామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా సమ్మతిస్తే కుటుంబం ఫొటో తీయాలని, అదో అప్షనల్ గా ఉండాలని, కుటుంబం సమ్మతి లేకుంటే ఆ ఫొటో తీసుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని.. అప్పుడే పకడ్బందీగా కార్యక్రమం కొనసాగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం వద్దనున్న రేషన్ కార్డు, పింఛను-స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ, కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, పైలెట్ ప్రాజెక్టులో దానిని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను జత చేయడం, మృతి చెందిన వారిని తొలగించడం చేస్తామని అధికారులు వివరించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులుచేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వవద్దని హెచ్చరించారు. పైలెట్ ప్రాజెక్టుతో బయటకు వచ్చిన సానుకూలతలు, ఎదురైన ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ నివేదికపై చర్చించి లోపాలను పరిహారించిన అనంతర పూర్తి స్థాయి క్షేత్ర స్థాయి పరిశీలన చేపడదామని ముఖ్యమంత్రి తెలిపారు.
సమీక్షలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు సంగీత సత్యనారాయణ, మాణిక్ రాజ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.