Telangana Praja Palana Dinotsavam

Telangana Praja Palana Dinotsavam 17 09 2024 (5)

Chief Minister Sri Revanth Reddy’s speech on the occasion of Telangana Praja Palana Dinotsavam

‘‘ఓ నిజాము పిశాచమా… కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని…తీగలను తెంపి అగ్నిలో దింపినావు… నా తెలంగాణ కోటి రతనాల వీణ’’

” The evil spirit of  Nizam. We never witnessed such an autocratic ruler like you. It is you who catapulted us in the fire by cutting the strings. Naa Telangana Koti Ratanala Veena”

 Dear Friends…

Distinguished Telangana poet Dasharathi Krishnamacharya penned this famous slogan against the monarchy, dictatorship and tyrannical rule on the land of Telangana 76 years ago. At one side noted poets and writers and the other side armed fighters fought against Nizam’s tyrannical rule and liberated Telangana from the shackles of slavery on the historical day of September 17, 1948, on this Hyderabad soil.  It is not a fight against one region, one caste and one particular area. The entire nation revolted against the autocratic rule for freedom and self-respect.

Dear friends

Telangana symbolises sacrifice. Telangana Armed struggle hero Doddi Komaraiah is the pioneer of those sacrifices. Komaraiah sacrificed his entire life for armed struggle.  Numerous people sacrificed their lives in the armed struggle. The armed struggle fighters never gave up despite losing everything in the pursuit of achieving the goal.  On this occasion, I pay glorious tributes to the martyrs who laid down their lives in the armed struggle. My hearty wishes to the four crore Telangana people on the occasion of ” Praja Palana Dinotsavam” today.

 Dear friends…

September 17 is the most significant day in the history of Telangana.  Until now,  there are differences of opinion on defining this auspicious day.  Some are calling it as Merger Day and some say Liberation Day.  We decided to organize September 17 officially after the People’s Government assumed power in the state.  After a  deep thought, we have decided to celebrate September 17 as “Praja Palana Dinotsavam” (People’s Governance Day)

Friends…

The Telangana dislodged Nizam’s tyrannical rule ushering in the new chapter of democratic legacy on September 17, 1948. This is the big triumph of the Telangana people.  Politics has no place in this.  It would be foolish if anyone tried to derive political advantages from the entire episode of the Telangana armed struggle.  The people’s government strongly felt that it was wrong to act in such a way as to thin out the sacrifices of the Telangana martyrs of yesteryear by calling the historical day Merger day or Liberation Day.  It is the reason,  the people’s government linked the historical day to people and called it “Praja Palana Dinotsavam”

Dear Friends…

The People’s Government took such an important decision to reflect the aspirations of four crore people and their thoughts.  If anyone finds fault with the decision against the spirit of the armed struggle, it will be only for their selfish interest and not for public wish.

 We have no interest in this.  It is not a decision made for the sake of the Congress party or our personal aspirations.  If we observe carefully, the appearance of the geographical area of Telangana is similar to the Clenched Fist which is a symbol of fighting. It is called a Fist when the five fingers are tightly pressed into the palm.  It denotes the message that all races, castes and religions are united in Telangana.  It is unforgivable that some people are trying to create a dispute on September 17 to the detriment of the unity.

Friends…

A clenched Fist has the power to crush the hills also. A united Telangana is as strong as a clenched fist.  This is the fist of four crore people and it should be forever.  This fist should always be a sign of struggle against the oppressors and dictators.  Telangana has been under Dictator rule for the last 10 years. September 17 is an inspiration for us to break the shackles of slavery. After I assumed office as PCC President, I  vowed that I would liberate Telangana from the dictator’s rule.  We held the  “Dalit-Tribal Atma Gaurav (self-esteem)  Dandora”  on Gajwel soil on September 17, 2021. The armed struggle inspired us to attain freedom for  Telangana on December 3, 2023.  Our thinking and our practice always aim to fulfill people’s aspirations.   It is the reason we are officially celebrating this auspicious day as “Public Governance Day”.

Dear friends…

My government accorded top priority to Transparency in the governance of the Telangana state, which has been formed by many sacrifices.  The government is responsible and every decision is being taken from the people’s perspective.  We are respecting the aspirations of Telangana Martyrs and the youth. The government has been taking steps in that direction from the day we assumed office.  We recognized the importance of the cultural and economical revival of the Telangana State, which was destroyed in ten years.

 Friends…

The previous rulers considered  Telangana culture as their home culture and the existence of Telangana means their family existence.  They created an illusion that the existence of Telangana society depends on their humane approach.  They never tried to understand our culture and inherent character.  They abandoned the history of overthrowing of Nizam dictator rule in Telangana.  As your child,  I know the heartbeat of Telangana. I started a cultural renaissance soon after coming to power.  The song “Jaya Jayahe Telangana Janani Jayaketanam”, written by Ande Sri, who voiced the aspirations of Telangana during the movement, has been declared as the official song of Telangana state and initiated the cultural revival of Telangana.  The abbreviation of  Telangana state has also been changed to TG.  It’s not just a change of letters but the judgment of the people’s aspirations. We performed Bhumi Puja to install the Telangana Talli statue in the state Secretariat recently. The Telangana Talli statue will be installed on December 9 this year on a grand scale.  It has also been decided to present the film awards in the name of Telangana’s Cultural Icon -Gaddar.  The  Women’s University in Koti has been named after the Telangana Armed Struggle fighter Chakali Ilamma. We are moving forward to restore Telangana’s cultural glory in every thought.

Dear friends…

The Telangana State’s economy was ruined with a mounting debt of Rs 7 lakh crore in the last 10 years. We took the reins of the state in vulnerable economic conditions. We have been paying Rs 6000 crore to clear debts and interest on loans every month.   As promised, we have taken it as a challenge to implement the Six Guarantees and put the economy on the right track. Government has been trying its best to improve the financial situation through debt restructuring. Plugged leakages in the revenue generation.  We are trying hard to get all the central funds.  I went to Delhi many times and met with all the Union Ministers including the Prime Minister and submitted memoranda. Some political forces are criticising my Delhi tours.  I am not a farmhouse chief minister to stay at home without moving out. I am a hard working chief minister.  I am not going to Delhi for my selfishness or personal work.  Delhi is not in Pakistan or Bangladesh.  It is the capital of our country.  It is a federal system.  There are many issues between the states and the centre.  States have been paying thousands of crores of rupees in the form of taxes to the Centre.  It is our right to seek the state’s share of the taxes. I will go to Delhi many times to claim the state’s share in the future also. The state government made strong arguments before the 16th Finance Commission for more funds and demanded that 50 percent of the central taxes should be given to the states.

Friends…

We are branding our state as a “Future State” on the world platform.  It is a strategic effort to attract huge investments in the state. Recently, we laid the foundation stone for the Fourth City at Begari Kancha.  There is no doubt that Musi beautification will change the contours of Hyderabad.  The Musi Riverfront Development project is

not just a tourist attraction. We will promote it as an economic hub and provide livelihoods to thousands of small and middle class traders.

Dear friends…

The people’s government adopted a two-pronged strategy for the development of youth in Telangana. We are getting rid of the drug menace which crippled the state in the last 10 years. The government took stringent measures to root out drug trafficking and eradicate drug addiction which has become a

major challenge for the future of the youth.  T-NAB has been strengthened.  On the other hand, the State government is promoting the sports. The government felicitated Telangana youth who won medals in the Paralympics and other international competitions. The  Intercontinental Football Competition was also held in Hyderabad recently.  The establishment of Young India Skill University is a boon for youth. The university will hone the skills of the youth and ensure employment and job security.  The establishment of Young India Sports University will be a turning point in the sports history of Telangana.  We strongly believe that sports play a vital role in the development of society.        

Friends…

Telangana is not only a future state.  It also needs to be promoted as a Clean State.  As I said before, apart from economic and cultural renaissance, the revival of a protected environment is also a need of the hour. It is the reason the government constituted HYDRAA. The city of Hyderabad is popularly known as   Lake City. Today, the city has turned into a city of floods because of the sins committed by the previous rulers. The Hydraa has been set up to demolish encroachments in the lakes and other water bodies. Future generations will have to pay a heavy price if the Lakes, Ponds and Canals are not protected.  Kerala State witnessed nature’s fury in recent times.  Thousands of people succumbed. That situation should not arise in Hyderabad.  There is no political dimension in the establishment of HYDRAA.  I am not selfish.  It is good work to protect nature on a mission mode. My appeal to everyone should contribute.  Some land mafias are trying to undermine the HYDRAA by highlighting the poor people’s issues first.  Hydra is unstoppable no matter how many obstacles come its way.  Hydraa guarantees the future of Hyderabad.  This is my assurance and request people  to cooperate

Friends…

Congress has been maintaining a good track record in terms of public welfare. Despite facing numerous financial challenges, the Congress government is

rewriting its own record in implementing the welfare schemes. The new state of Telangana was handed over to previous rulers with a surplus budget. They failed to waive the farm loans at least up to Rs one lakh during the 10 year regime. Congress government waived farm loans up to Rs 2 lakhs at one go within six months of coming to power. Some difficulties and challenges are faced. We will resolve those issues and ensure that every eligible person gets the benefit of a loan waiver. My challenge from this platform… Is there anywhere else in the country that has deposited Rs  18,000 crores in the bank accounts of 22 lakh farmers within six months!?  This is our commitment towards the farmers welfare.

 Friends…

Women benefited from 87 crore free bus rides saving their Rs 2,958 crores.  We launched the free bus travel scheme for women within 48 hours of coming to power.  Rajiv Arogyasri’s scheme limit has been increased from Rs 5 Lakhs to Rs 10 lakhs.   An additional 163 medical treatments have also been included in the Arogyasri list.  Government decided to provide  Arogyasri benefits regardless of ration cards.  A new Osmania Government Hospital will be constructed at Goshamahal in Hyderabad.

Dear friends…

43 lakh families benefited from the subsidized cooking gas cylinder at Rs 500 scheme. The government already paid Rs 282 crores for this scheme. Poorer sections are provided free power supply of up to 200 units.  49 lakh families have already benefited from the scheme.  The state government paid a subsidy of Rs 965 crore to date. The government envisaged plans to build 4,50,000 houses this year as part of the Indiramma house scheme. The government will provide financial assistance of Rs 5 lakh for the construction of each house under the scheme. Housing plots will also be sanctioned to those who did not own a piece of land for constructing the house. Indian Institute of Handloom Technology for Weavers was launched recently and started classes this year. The IITH has been named after noted Telangana movement leader  Konda Lakshman Bapuji. The government constituted Telangana Education Commission to bring revolutionary changes to the education system.

Friends…

We laid the foundation stone for  Telangana Young India Skill University to provide employment and job opportunities to the youth along with skill development and training. The university will offer skill development courses from this year.  An attempt has been made to ensure the future of the unemployed.  30,000 recruitment letters were already given to the selected candidates in various government departments within 3 months after coming to power and gave a ray of hope to the job aspirants. Group one preliminary exam was conducted without any controversy and DSC for teacher recruitment to fill  11,062 posts. The government is issuing job notifications as per the job calendar announced in the assembly. The government launched the Indira Mahila Shakti Scheme with an aim  to promote women as millionaires.  We resolved to provide Rs one lakh crore loans to 63 lakh women members in the next five years.

 Friends…

As promised in the manifesto, the government decided to give Rs 5 lakh ex-gratia to the bereaved family of the Gulf worker who died abroad.  Free education will be provided to the children of Gulf workers in the Gurukul institutions and give them priority in the admission. The government is setting up a ‘Pravasi Prajavani Kendra ‘ in Praja Bhavan as part of Prajavani to address the grievances of  Gulf workers and also Telangana citizens working in other countries quickly. We will also form a committee to study the plights of the Gulf workers and prepare long-term plans for their solutions.

Friends

The People’s Government is committed to the all-round development of Telangana, youth empowerment,  women’s self-reliance, farmer’s welfare, and social and economic upliftment of the underprivileged.  The separate Telangana is the result of the sacrifice of many prominent personalities. The government will remember their sacrifices in every decision taken as part of the administration. The welfare of 4 crore Telangana people will be the cornerstone of governance.  Henceforth, September 17 is being celebrated as ‘Praja Palana Dinotsavam’ ( People’s Governance Day).  The people of Telangana are the sailors of this state.  Their thoughts are our practice. Our endeavour is to fulfill people’s aspirations.

Thank you all.

Jai Hind…..Jai Telangana.

ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రసంగం

‘‘ఓ నిజాము పిశాచమా… కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని…  తీగలను తెంపి అగ్నిలో దింపినావు… నా తెలంగాణ కోటి రతనాల వీణ’’

మిత్రులారా…

76 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారీతనానికి వ్యతిరేకంగా మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షరీకరించిన కవితానినాదం ఇది. అక్షర యోధులు ఒక వైపు… సాయుధ వీరులు మరోవైపు నిజాం నిరంకుశ రాజును, ఆ నాటి రాచరిక వ్యవస్థను ముట్టడిరచి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్‌ 17న ఇదే హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైంది. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు.

మిత్రులారా…

తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య. తన ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తి కొమురయ్య. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. జీవితాలు త్యాగం చేశారు. సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ఆ నాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ‘‘ప్రజా పాలన దినోత్సవ’’ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా…

సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం. లోతైన ఆలోచన తర్వాత ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా సెప్టెంబర్‌ 17ను జరుపుకోవడం సముచితంగా ఉంటుందని భావించాం.

మిత్రులారా…

సెప్టెంబర్‌ 17, 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి…ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావులేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావించింది. అందుకే… ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ… ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా నామకరణం చేశాం.

మిత్రులారా…

ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. వారి ఆలోచన. నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప… ప్రజాహితం కాబోదు. ఇందులో మా స్వార్థం లేదు. కాంగ్రెస్‌ పార్టీ కోసమో, మా వ్యక్తిగత ఆకాంక్షతో చేసిన నిర్ణయమో కాదు. మనం జాగ్రత్తగా గమనిస్తే… తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. పిడికిలి పోరాటానికి సింబల్‌. అంతేకాదు… ఐదు వేళ్లు బిగిస్తే పిడికిలి. తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్‌ 17ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయం.                                         

మిత్రులారా…

బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు. ఐక్యంగా, సమైక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలికి ఉన్నంత శక్తి ఉంది. ఇది నాలుగు కోట్ల పిడికిలి. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి. పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి. గడచిన పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయింది. ఆ బానిస సంకెళ్లను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్‌ 17. నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాను. తెలంగాణను నియంత పాలన నుండి విముక్తి చేస్తానని చెప్పాను. గజ్వేల్‌ గడ్డ మీద 2021 సెప్టెంబర్‌ 17 నాడు ‘‘దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరా’’ మోగించినం. 2023 డిసెంబర్‌ 3 నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతీది ప్రజా కోణమే. అందుకే ఈ శుభ దినాన్ని ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా అధికారికంగా నిర్వహిస్తున్నాం.

మిత్రులారా…

ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి. ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి. అమరుల ఆశయాలు ఉండాలి. యువత ఆకాంక్షలు ఉండాలి. మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం.

మిత్రులారా…

తెలంగాణ సంస్కృతి అంటే మా ఇంటి సంస్కృతి, తెలంగాణ అస్థిత్వం అంటే మా కుటుంబ అస్థిత్వం అని గత పాలకులు భావించారు. తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని భ్రమించారు. మన సంస్కృతిని, మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్ధేశం వారికి లేదు. నిజాంనే మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం విస్మరించారు. మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా… అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాను. ఉద్యమ కాలంలో తెలంగాణ ఆకాంక్షలను గళమెత్తి వినిపించిన అందెశ్రీ రచించిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం. తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం ుూ ను ుG గా మార్చాం. ఇది కేవలం ఆక్షరాల మార్పు కాదు. ప్రజల ఆకాంక్షల తీర్పు.రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఇటీవలే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజ చేసుకున్నాం. డిసెంబర్‌ 9 నాడు మన తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్‌ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. ఇలా… ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగుతున్నాం.

మిత్రులారా…

గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు. 7 లక్షల కోట్ల అప్పు… ప్రతి నెలా 6 వేల కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేం బాధ్యతలు స్వీకరించాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాల్‌గా స్వీకరించాం. అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఆదాయ లీకేజీలు అరికట్టాం. కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలో భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలు సార్లు ఢల్లీి వెళ్లి   ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి, వినతి పత్రాలు ఇస్తున్నాను. నా ఢల్లీ పర్యటనల మీద విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫాంహౌస్‌ ముఖ్యమంత్రిని కాదు… పని చేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో నేను ఢల్లీకి వెళ్లడం లేదు. ఢల్లీ  ఏ పాకిస్తాన్‌ లోనో, బంగ్లాదేశ్‌ లోనో లేదు. అది మన దేశ రాజధాని. ఇది ఫెడరల్‌ వ్యవస్థ. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలుంటాయి. రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కడుతున్నాం. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు. ఆ హక్కుల సాధన కోసం ఎన్ని సార్ల్లైనా ఢల్లీకి వెళతా. ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు కూడా గట్టిగా మన వాదనలు వినిపించాం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశాం.

మిత్రులారా…

మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్‌ స్టేట్‌’’ గా బ్రాండ్‌ చేస్తున్నాం. పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం. ఇటీవల బేగరి కంచె వద్ద ఫోర్త్‌ సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. మూసీ సుందరీకరణ అన్నది హైదరాబాద్‌ రూపు రేఖలను మార్చివేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు… వేలమంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్‌ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం.

మిత్రులారా…

తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఒకవైపు గడచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. యువత భవితకు పెనుసవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నాం. టీ – న్యాబ్‌ ను బలోపేతం చేశాం. మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. పారాలింపిక్స్‌లో మరియు ఇతర అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం. ఇటీవలే ఇంటర్‌ కాంటినెంటల్‌ ఫుట్‌బాల్‌ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించుకున్నాం. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యాలకు పదును పెట్టి… ఉపాధి, ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతోంది. క్రీడలు సమాజ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని మేం నమ్ముతున్నాం.   

మిత్రులారా…

తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌గా మాత్రమే కాదు. క్లీన్‌ స్టేట్‌గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు. పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌ ఈ రోజు ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ళ పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాం. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలయ్యాయి. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు. నా స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం. ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నా.

మిత్రులారా…

ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే తిరగ రాస్తున్నాం. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే… గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. మేం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో  ఏక కాలంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశాం. అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆ సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్క అర్హుడు రుణమాఫీ లబ్ధి పొందేలా చేస్తాం. ఈ వేదిక నుంచి సవాల్‌ చేస్తున్నా… ఆరు నెలల వ్యవధిలో సుమారు 18 వేల కోట్ల రూపాయలు, 22 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన చరిత్ర దేశంలో మరెక్కడైనా ఉందా!? ఇదీ రైతుల విషయంలో మా కమిట్‌మెంట్‌.

మిత్రులారా…

మన ఆడబిడ్డలు 87 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాల లబ్ధిని పొందారు. దీనివల్ల వాళ్లకు 2,958 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఈ పథకం మొదలు పెట్టాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచాం. 163 చికిత్సలను అదనంగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాం. రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ వర్తింప జేయాలని నిర్ణయం తీసుకున్నాం. శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో కొత్త భవనాన్ని నిర్మించబోతున్నాం.       

మిత్రులారా…

ఆడబిడ్డలకు 500 రూపాయలకే వంట గ్యాస్‌ ఇవ్వడం ద్వారా 43 లక్షల కుటుంబాలకు మేలు చేశాం. దీని కోసం ఇప్పటి వరకు 282 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తం చెల్లించాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఈ పథకంలో 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దీని కోసం ఇప్పటి వరకు 965 కోట్ల రూపాయల మేర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా  ఈ ఏడాది 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నాం. స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వబోతున్నాం. నేతన్నల కోసం ఇటీవల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ప్రారంభించుకున్నాం. ఈ ఏడాది నుండే తరగతులు ప్రారంభించాం. దీనికి తెలంగాణ ఉద్యమ దిక్సూచి స్వర్గీయ కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్‌ను ఇటీవలే ఏర్పాటు చేశాం.

మిత్రులారా…

యువతకు శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటికి పునాదిరాయి వేశాం. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభిస్తున్నాం. నిరుద్యోగుల భవిష్యత్‌కు భరోసానిచ్చే ప్రయత్నం మొదలైంది. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి యువతకు భవిష్యత్‌ పై ఆశలు చిగురింపజేశాం. గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం. 11,062 పోస్టులతో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించాం. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళాశక్తి పథకం ప్రారంభించాం. వచ్చే ఐదేళ్లలో 63 లక్షల మంది ఆడబిడ్డలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని సంకల్పించాం.

మిత్రులారా…

మా మానిఫెస్టోలో చెప్పిన విధంగా గల్ఫ్‌ కార్మికులు ఎవరైనా విదేశాల్లో మరణిస్తే, వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. గల్ఫ్‌ కార్మికుల పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ గురుకులాల్లో ఉచిత విద్యను  అందివ్వబోతున్నాం. గల్ఫ్‌ కార్మికులు మరియు ఇతర దేశాల్లో పనిచేస్తున్న మనవారి  సమస్యలు వినడానికి మరియు సత్వర పరిష్కారానికి ప్రజావాణిలో భాగంగా, ప్రజాభవన్‌లో ‘‘ప్రవాసీ ప్రజావాణి కేంద్రం’’ ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు గల్ఫ్‌ కార్మికుల సమస్యల అధ్యయనానికి మరియు వాటి పరిష్కారాల కోసం ఒక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తాం.      

మిత్రులారా…

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి. యువ వికాసానికి, మహిళా స్వావలంబనకు, రైతు సంక్షేమానికి, బడుగు బలహీనవర్గాల సామాజిక, ఆర్థిక ఉన్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ. పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయి. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంది. సెప్టెంబర్‌ 17 ఇకపై  ప్రజా పాలన దినోత్సవం. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. వారి ఆలోచనలే మా ఆచరణ. వారి ఆకాంక్షలే… మా కార్యాచరణ. అందరికీ ధన్యవాదాలు.

జై హింద్‌…..జై తెలంగాణ.