Historic buildings located along the Musi River will be developed as famous Tourist spots: CM

State Tourism Department Signed An Agreement With Cii For The Restoration Of Several Ancient Stepwells In Hyderabad 27 09 2024 (1)

Chief Minister Sri A Revanth Reddy said that the historic buildings located along the Musi River will be developed as famous Tourist spots. The Chief Minister appealed to the industrialists to come forward for the preservation of buildings that reflect the culture of the city of Hyderabad. The CM said that the government is committed to promote the Tourism sector along with making Telangana as a welfare state.

The State Tourism Department signed an agreement with CII for the restoration of several ancient Stepwells in Hyderabad. Speaking on this occasion, CM Revanth Reddy said that the government has taken up the Musi Riverfront development project ambitiously. The CM criticized the previous government for neglecting the numerous historical buildings that have reached dilapidated conditions in the city.

State Tourism Department Signed An Agreement With Cii For The Restoration Of Several Ancient Stepwells In Hyderabad 27 09 2024 2

The Chief Minister said the state Government has taken up the renovation of the old assembly building and the state Legislative Council will be shifted to the renovated buildings soon. The famous Jubilee Hall, which is the house of the Legislative Council, has historical significance. The CM observed that the building was built with special technology and it needs to be preserved in the future. CM Revnath Reddy suggested to the CII to adopt and preserve the historical Jubilee Hall. The preservation of the old Osmania Hospital was also being taken up and a new Osmania Hospital will be constructed at Goshamahal Stadium soon, the CM said, emphasizing the protection of the High Court building. The government has already allocated 100 acres of land for the construction of a new High Court building at Rajendra Nagar. There is also a need to preserve historical structures like the Puranapool Bridge along with the Hyderabad City College building, the CM said the Charminar conservation project is already in progress.

State Tourism Department Signed An Agreement With Cii For The Restoration Of Several Ancient Stepwells In Hyderabad 27 09 2024 4

Entrepreneurs adopted ancient Stepwells

Industrialists came forward to restore and preserve the ancient step wells in the city and promote them as tourist spots. They also handed over agreement documents to CM Revanth Reddy. Infosys took responsibility for the renovation of the Mahalaka stepwell in Osmania University. Sai Life adopted Manchirevula stepwell. Bharat Biotech will restore the Salar Jung and Ammapalli wells. Adikmet step well will be renovated by Dodla Dairy, Falaknuma step well TGRTC and Koti Women’s College will restore the Residency step well.

Telangana Darshini for government school students..

CM Revanth Reddy said that students studying in government schools are being provided an opportunity to visit tourist and historical places in the state free of cost. For this, the government launched the Telangana Darshini program and a government order has already been issued. The CM explained that Telangana Darshini will educate the students about the historical and touristic places. State Tourism Minister Jupalli Krishna Rao, Tourism Principal Secretary Vaniprasad, CII Telangana Chairman Sai Prasad, Chief Minister’s Special Secretary Ajith Reddy and Chief Minister OSD Vemula Srinivas are present.

State Tourism Department Signed An Agreement With Cii For The Restoration Of Several Ancient Stepwells In Hyderabad 27 09 2024 3

మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ‌తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  

హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.

కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.  గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి వెల్ల‌డించారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్ కు చారిత్ర‌క ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. జూబ్లీహాల్ ను దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐ కి సూచించారు.ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరముందని సీఎం అన్నారు. రాజేంద్రనగర్ లో హైకోర్టు నూతన భవనం నిర్మాణం కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసర‌ముందన్నారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందన్నారు.

పురాతన బావులు దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు 

నగరంలో పురాతన మెట్ల బావు లను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్పోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. సాయి లైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. భారత్ బయోటెక్  సంస్థ సాలార్ జంగ్,  అమ్మపల్లి  బావుల‌ను పునరుద్దరించనున్నది. అడిక్‌మెట్  మెట్ల బావిని  దొడ్ల డైరీ, ఫలక్ నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనున్నది. 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని.. 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక, చారిత్ర‌క ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందు కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకువచ్చామ‌ని, దానికి సంబంధించిన జీవోను ఇప్ప‌టికే జారీ చేశామన్నారు. చారిత్ర‌క‌, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని  తీసుకువచ్చినట్లు సీఎం  వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.