CM paid rich tributes to Chityala Ilamma on her death anniversary

Telangana Government Logo Cm

Chief Minister Sri A Revanth Reddy paid rich tributes to revolutionary Telangana fighter Chityala Ilamma, who laid a strong foundation for land struggle, on the occasion of her death anniversary on Tuesday (September 10). The Chief Minister recalled Ilamma’s bravery during the Telangana armed struggle.

The CM also remembered Ilamma always fought in support of the unprivileged communities against the occupation of their lands by the dominant communities and praised her important role in uniting the women community in the armed struggle.

Inspired by Chakali Ilamma, many women participated in the land struggle voluntarily, CM Revanth Reddy said that the Ilamma also stood as a symbol of women empowerment and consciousness of all sections.

తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చిట్యాల ఐలమ్మ వర్ధంతి (సెప్టెంబర్ 10) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ యోధురాలికి నివాళులు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహసాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

తన భూమి కోసం, ఆధిపత్య వర్గాల భూఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాలకు మద్దతుగా ఐలమ్మ నిలిచారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకుని మహిళలను ఐక్యం చేసిన స్పూర్తి ప్రధాత చాకలి ఐలమ్మ అని ముఖ్యమంత్రి కీర్తించారు.

స్వాతంత్య్ర సమరయోధురాలు చాకలి ఇలమ్మ ప్రేరణతో అనేక మంది మహిళలు ఆనాటి భూ పోరాటానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చారని సీఎం అన్నారు. ఐలమ్మ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి ప్రతీక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.