Expansion, scheduled to open in September 2024, to Create 100s of New Jobs and Strengthen the Company’s Innovative Technology Portfolio
Zoetis Inc., the global leader in animal health, announced the expansion of Zoetis India Capability Center in Hyderabad, to further drive the company’s innovative technology portfolio.
This announcement was made during a meeting with the Honorable Chief Minister of Telangana, Sri A. Revanth Reddy, and the Minister for Industries and Commerce, Sri D. Sridhar Babu, during the ongoing USA tour, where they were joined by other senior government officials.
Recognizing the strategic importance of the region as a hub for innovation and talent, this expansion strengthens Zoetis’ footprint in India and will create hundreds of new jobs.
Speaking on the occasion, Sri A. Revanth Reddy, Honourable Chief Minister of Telangana, said, “We are delighted with Zoetis’ decision to expand their Zoetis India Capability Center in Hyderabad. This is a testament to the thriving ecosystem we have cultivated in Telangana, where businesses can grow and innovate. Zoetis’ investment in futuristic technologies aligns with our vision of making Hyderabad a global hub for advanced technologies and life sciences.”
Keith Sarbaugh, Chief Information Officer at Zoetis, added, “Hyderabad is the ideal location for our Zoetis India Capability Center, offering a wealth of talent and an incredible Life Sciences innovation ecosystem. Our decision to expand here underscores our commitment to investing in the future of animal health and technology innovation. We are excited to continue our partnership with the Government of Telangana and contribute to the region’s development.”
Anil Raghav, Vice President and Head, Zoetis India Capability Center, added, “By leveraging the world-class talent available in Hyderabad, our center will drive innovation and pioneer transformative advancements, ensuring sustainable growth and a competitive edge for Zoetis worldwide, while contributing to the development of the region.”
Shri Sridhar Babu, Minister for Industries and Commerce, remarked, “Zoetis’ commitment to creating new jobs over the coming years reflects the confidence global companies have in Telangana’s business-friendly environment. I urge the talented workforce of Telangana to join Zoetis and create the future of animal healthcare. We look forward to supporting Zoetis in their journey of innovation and growth in Hyderabad.”
హైదరాబాద్ లో జొయిటిస్ విస్తరణ
- ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభం
- అమెరికాలో సీఎంతో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులు
ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్ (Zoetis Inc.) కంపెనీ హైదరాబాద్లో తమ కెపాబులిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్‌లోని జొయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీ శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో తమ జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించే నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జోయిటిస్ రంగ ప్రవేశం హైదరాబాద్ కు మరింత గుర్తింపు తెస్తుందన్నారు.
ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని జోయిటిస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ అన్నారు. తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరి కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు. ప్రపంచంతో పోటీ పడే సేవలందించటంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామన్నారు.
జొయిటిస్ కంపెనీ విస్తరణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు, తమ ప్రభుత్వ విధానాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలతో పాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు.
జొయిటిస్ కంపెనీ దాదాపు 70 సంవత్సరాలుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నిరోధించే మార్గాలు, చికిత్స సంబంధిత అంశాలపై పని చేస్తోంది. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తోంది. ఔషధాలతో పాటు వ్యాక్సిన్‌లు, రోగ నిర్ధారణలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలపై దాదాపు వంద దేశాలకు సేవలు అందిస్తోంది.