Inauguration of Sitarama Project Pump 2

Cm Sri A Revanth Reddy Inaugurated Sitarama Lift Scheme And Switched On The Lift Project’s Pumps 15 08 2024 (3)

Chief Minister Sri A Revanth Reddy inaugurated Sitarama Lift Scheme and switched on the lift project’s pumps at Pusugudem in Bhadradri Kothagudem district on Thursday. On this occasion, the Chief Minister addressed a press conference.

Highlights:

Government fulfilled the aspirations of the Khammam district people by completing the Sitarama lift scheme. Thank you all for participating in such a big event of the inauguration of the lift project.

Irrigation Minister Uttam Kumar Reddy already explained how the Rajeev Sagar and Indira Sagar project were taken up and also the enhancement of the estimations of the Sitarama project.

It is a delightful moment and also facing pressure on the allocation of adequate funds for projects in Khammam district. The other districts are mounting pressure for allocating huge funds to the old Khammam district.

Many projects have been pending in the fluoride affected Nalgonda district. We gave priority to Khammam and came forward to complete the projects.

KCR government spent Rs 1.80 lakh crore on irrigation projects during the 10 years rule. Today, the former MLAs of KCR party staged dharna and sat on diksha. The BRS party MLAs tight-lipped on irrigation facilities when KCR was CM for 10 years and Harish Rao held the Irrigation portfolio for five years. The MLAs were aware of KCR and his son- in-law Harish Rao’s bogus statements.

KCR and Harish Rao focused on other things. The duo planned to swindle crores of rupees of public money by redesigning the projects. The two leaders were least bothered about providing irrigation water.

Earlier, I reviewed the status of Khammam irrigation projects. The district ministers told me that an irrigation facility can be provided to 1.20 lakh acres at low cost. Minister Tummala Nageshwara Rao said Khammam district does not require river Krishna water if Godavari water is supplied to the district.

Minister Uttam Kumar Reddy reviewed every two weeks and paid special focus on the completion of the Sitarama project. Explained to Prime Minister Modi about the inefficiency of KCR in the utilization of irrigation water. Uttam and myself met with the union minister for Jal Shakti also.

KCR government did not make public the project DPRs fearing the loot of public money will come to light. Center has not given permissions to the project due to non submission of the DPRs. My government made all out efforts to seek permissions by overcoming the hurdles.

Farmers reposed faith in Thummala Nageswara Rao and gave their lands for the construction of projects. Along with the leaders, farmers also came forward for the completion of the project.

Harish Rao claimed 90 per cent of the project works were completed during the BRS rule .

The then Congress government had estimated the Dummugudem project at 4,000 crores. After the formation of Telangana, seven mandals and also the Indira Sagar were given to AP.

The project should have been completed at the cost of 1500 crores. But the estimation has been increased to Rs 18,000 crores. KCR government spent Rs 7500 crores on Sitarama project. If the previous government completed 90 per cent of the works , the BRS leaders should clarify the expenditure incurred on the project so far.

The works were not completed in an orderly manner. The BRS leaders took commissions by giving orders to buy pumps and motors. The motors have been lying neglected for the last 4 years. Government reviewed the status of pump sets and motors. Gave power connections and turned on the motors.

After six months of hard work, pumps started working . Mother Godavari blessed all of you by flowing on the Khammam soil. Everything went smoothly because our thoughts are clear and pure.

Arrived in Khammam on Independence Day to dedicate the project to the district people . Minister Ponguleti brought water from Nagarjuna Sagar toi Palair. Uttam Kumar Reddy is facing pressure from his Nalgonda district.

Harish Rao is making false allegations to project my government in a bad light. What has Harish Rao done for ten years? We have done in six months what could not be done in ten years. People slapped the BRS in elections.

BRS lost deposits in two Lok Sabha constituencies in Khammam district. The KCR family destroyed Telangana economy like wild pigs. Rs 6500 crores interest is being paid every month for the debts incurred by KCR.

Despite facing a financial crisis, the government sanctioned funds to Khammam projects. We ignored KCR and Harish Rao who speak cheaply.

KCR is a soiled currency note. KCR and Harish Rao should visit the project and sprinkle Godavari water on their heads.

Appealing to Tummala Nageshwara Rao to send two bottles of Godavari water to KCR .

సీతారామ ఎత్తిపోతల పథకం దగ్గర సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్:

  • ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చే సీతారామ లిఫ్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు అభినందలు…
  • రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ఎలా మారింది.. సీతారామ సాగర్ గా ఎలా మారి అంచనాలు పెరిగాయో శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు…
  • ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం ఒక రకంగా సంతోషం.. ఇంకో రకంగా ఒత్తిడి
  • ఖమ్మం ఉమ్మడి జిల్లాకే అన్ని నిధులు కేటాయిస్తున్నారంటు మిగిలిన జిల్లాల నుంచి ఒత్తిడి ఉంది..
  • ఫ్లోరైడ్ ప్రభావిత నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ లు లో ఉన్ననల్గొం
  • ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముందుకు వచ్చాం…
  • 10 యేళ్లు అధికారంలో ఉండి సాగునీటి ప్రాజెక్టులపైన లక్షా ఎనభై వేల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నారు..
  • సీఎం గా కేసీఆర్ పదేళ్లు, హరీష్ రావు ఐదేళ్లు నీరుపారుదల శాఖ ఉన్నప్పటికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు నీళ్లు కావాలని అడగలేదు..
  • కేసీఆర్, ఆయన అల్లుడు బోగస్ మాటలు చెపుతున్నారని ఆ ఎమ్మెల్యేలకు తెలుసు…
  • చిత్తం శివుడి మీద భక్తి చెప్పులపైన ఉన్నట్లు కేసీఆర్, హరీష్ రావు తీరు ఉంది…
  • ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వల్ల వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్నదే కేసీఆర్, హరీష్ రావు ఆలోచన
  • సాగునీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్, హరీష్ రావుకు లేదు..
  • ఖమ్మం సాగునీటి ప్రాజెక్టులపైన గతంలో నేను సమీక్ష చేశాను..
  • తక్కువ ఖర్చుతో లక్షా ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని జిల్లా మంత్రులు చెప్పారు..
  • ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను ఇస్తే.. క్రిష్ణా జలాలపైన ఆధారపడే అవసరం ఉండదని తుమ్మల చెప్పారు..
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి రెండు వారాలకు ఒక సారి సమీక్ష చేసి ప్రాజెక్టు నిర్మాణంలో శ్రద్ద చూపించారు…
  • సాగునీటి వినియోగంలో కేసీఆర్ అసమర్థతను ప్రధాని మోదీ కి వివరించాం..
  • నేను, ఉత్తమ్ కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రిని స్వయంగా కలిశాం…
  • దోపిడి బయటపడుతుందనే డీపీఆర్ లు పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం బయటపెట్టలేదు…
  • డీపీఆర్ లు ఇవ్వకపోవడం వల్లనే కేంద్రం ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదు…
  • అనేక చిక్కుముడులను విప్పుకుంటూ అనుమతులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాం..
  • మంత్రి తుమ్మల మాటను నమ్మి రైతులు ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చారు..
  • నాయకులతో పాటు రైతులు కూడా ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చారు…
  • తొంభై శాతం పనులు మేం చేశామని హరీష్ రావు అంటున్నాడు…
  • 4 వేల కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ము గూడెం ప్రాజెక్టును అంచనా వేసింది..
  • తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీ కి ఏడు మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ ఏపీకి పోయింది…
  • 1500 కోట్ల తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18 వేల కోట్లకు పెంచారు…
  • ఇప్పటి వరకు సీతారామ ప్రాజెక్టుపైన కేసీఆర్ ప్రభుత్వం 7500 కోట్లు ఖర్చు చేసింది..
  • 90 శాతం పూర్తి చేస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో చెప్పాలి..
  • క్రమ పద్దతిలో పనులు పూర్తి చేయలేదు..
  • పంపులు, మోటార్లు తయారు చేయించి కమిషన్లు మెక్కారు..
  • 4 యేళ్లుగా మోటార్లు ఇక్కడ పడి ఉన్నాయి…
  • సమీక్ష చేసి కరెంటు కనెక్షన్లు ఇప్పించి మోటార్లు ఆన్ చేయించాం..
  • ఆరునెలలు కష్టపడి పంప్ లు పనిచేసేలా చేశాం…
  • గోదావరి తల్లే మిమ్మల్ని తడిపి ఆశ్వీరధించింది..
  • మా ఆలోచనలో స్వార్థం లేదు కాబట్టే అన్నీ సజావుగా జరిగాయి…
  • గోదావరి జలాలను ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలనే స్వాతంత్ర్యం దినోత్సవం రోజు వచ్చాను…
  • నాగార్జున సాగర్ నుంచి పాలేరుకు మంత్రి పొంగులేటి నీళ్లు తెచ్చుకున్నారు…
  • ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన నల్గొండ జిల్లా నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయి…
  • మా శ్రమను తగ్గించడానికి హరీష్ రావు ఒకటే మాట్లాడుతున్నాడు..
  • తోక మాత్రమే మిగిలిందంటున్న హరీష్ రావు పదేళ్లు ఏం చేశారు..
  • పదేళ్లు చేయలేని పనిని ఆరునెలల్లో చేశాం..
  • మీ చెత్తబుద్ది తెలుసుకాబట్టే చెప్పుతో కొట్టారు..
  • ఖమ్మం జిల్లాలో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాలేదు…
  • అడవి పందుల్లా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది
  • కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెలా 6500 కోట్లు వడ్డీ కడుతున్నం..
  • ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినప్పటికి ఖమ్మం ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్నాం…
  • చిల్లర మాటలు మాట్లాడే కేసీఆర్, హరీస్ రావును పట్టించుకోం..
  • కేసీఆర్ చెల్లని రూపాయి…..
  • తీరిక ఉన్నప్పుడు వచ్చి కేసీఆర్, హరీష్ రావు గోదావరి జలాలను చల్లుకోని పోవాలి…
  • రెండు సీసాల్లో గోదావరి నీళ్లు కేసీఆర్ కు పంపించాలని మంత్రి తుమ్మలను కోరుతున్న…
Telangana Rising