Govt. decides to set up Young India Sports University

Ms Lim Si Hyeon Met Cm Revanth Reddy 17 08 2024 (2)

One of the major components of the Fourth City/Future City is an integrated sports hub

It is expected that sports academies related to over a dozen disciplines will be set up in the sports hub where modern sports infra will be provided. It will also have centres of sports science and sports medicine.

The proposed sports university named as ‘Young India Sports University’ will be an important component of the sports ecosystem to support the sports hub.

The government is considering the existing sports school in Hakimpet or the Sports complex in Gachibowli for locating the Young India Sports Univeristy.

Ms Lim Si Hyeon Met Cm Revanth Reddy 17 08 2024 1

On his recent trip to South Korea, Honourable CM Sri A Revanth Reddy had a chance to visit Korean National Sports Univeristy in Seoul. This is one of the foremost sports universities in the world. It was established in 1976 and focuses on offering a broad range of courses to amateur athletes as well as professional athletes representing the national team.

In the recently concluded Paris Olympics, South Korea won 32 medals of which 16 medals were contributed by athletes trained at the Korean National Sports University. Hon’ble CM had the pleasure of meeting Olympic champion from the Univeristy, Ms Lim Si-hyeon, who won three gold medals in Archery at the Paris Olympics.

The government intends to involve such reputed universities to be the technical partners of the Young India Sports Univeristy and make it a world class institution to train future olympic champions.

తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు

  • ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాల తో స్పోర్ట్స్ అకాడమీ లు
  • అథ్లెట్లకు శిక్షణలో కొరియన్ స్పోర్ట్స్ యూనివర్శిటీ సహకారం

సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు:

హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ(ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్ లో దీన్ని ఏర్పాటు చేస్తారు.

దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ హబ్ లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు.

కొత్త గా స్థాపించిన స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీకి “యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ” అనే పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనువైన స్థలంగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు. సదరు క్యాంపస్ ను ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలుండేలా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటన లో సియోల్ లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని (Korea National Sport University – KNSU)ని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ గా ప్రత్యేకత చాటుకుంది.

ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా మొత్తం 32 పతకాలు గెలుచుకోగా, అందులో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే కావడం గమనార్హం. ఈ యూనివర్సిటీలో శిక్షణ పొంది, పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించిన అథ్లెట్ లిమ్ సి-హైయోన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటన లో కలిసి అభినందించారు.

భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Telangana Rising