Enhance Hyderabad image by organizing Ganesh festival on a grand scale

Cm Revanth Reddy Chaired A Review On The Ganesh Festival And Arrangements Being Made 29 08 2024 (4)
  • Free power supply to all permitted Ganesh Pandals
  • Officials and Pandal managers work in coordination
  • CM Sri Revanth Reddy reviews arrangements for Ganesh festival with the Ganesh Utsava Committee and officials
  • Asks officials to adhere to Supreme Court orders

Chief Minister Sri A Revanth Reddy ordered the officials to make arrangements for the Ganesh festival in a befitting manner aiming to enhance the image of Hyderabad further during the festival period. The Chief Minister observed that Hyderabad has been known for religious tolerance, peace and tranquility.

Cm Revanth Reddy Chaired A Review On The Ganesh Festival And Arrangements Being Made 29 08 2024 2

The CM chaired a review on the Ganesh festival and arrangements being made for at the secretariat today ( Thursday ) evening. The officials have been asked to pay more focus on three aspects. The Ganesh Pandal Managers have been entrusted with the responsibility of making foolproof arrangements during the Ganesh festivities including the idol immersion. The officials of the police, GHMC, R&B, Water Board, Energy and other key departments will work in coordination with the management of the pandals. The CM cautioned not to fall into any shortcomings and directed Chief Secretary Santhi Kumari to hand over the responsibilities to zone-wise senior officials and coordinate with festival committee members and pandal managers to ensure peaceful conduct of the idol immersion. The chief minister suggested that the details of the festival committee leaders and officials in those areas should be made available.

Cm Revanth Reddy Chaired A Review On The Ganesh Festival And Arrangements Being Made 29 08 2024 1

CM Revanth Reddy said that it is estimated that 1.50 lakh idols were installed inside ORR ( Outer Ring Road) last year. The Pandal Managers should take permission online and offline which helps to provide adequate security and traffic management during the festival time. The CM suggested measures to immerse the idols in Hussain Sagar and also other water bodies. The immersion of idols in the local areas in SaroorNagar lake and other ponds will help to reduce the burden on Hussain Sagar. The officials have been asked to make necessary arrangements for immersion at the ponds in advance. In this regard, the Chief Minister suggested that the members of the Ganesh festival committee and the managers should inform in advance.

Chief Minister Revanth Reddy asked the Utsav committees to inform the local authorities about inviting the chief guests to the programs in advance. The police department will clear the routes for VVIP arrivals and also arrange adequate security. Early start of the Ganesh immersion procession will help to complete the program quickly without any traffic and other problems, the CM said, directing the police to take the suggestions and opinions of the four Lok Sabha members and MLAs in the city limits regarding the conduct of the festival.

Cm Revanth Reddy Chaired A Review On The Ganesh Festival And Arrangements Being Made 29 08 2024 3

The Chief Minister directed the police to chalk out an action plan for making security arrangements and ensure that no problem arises in the entire Telangana on September 16 and September 17. Milad Un Nabi is celebrated on September 16 and the political parties are planning to hold rallies and programs on September 17.

The members of Bhagyanagar Ganesh Utsava Samiti appealed to the Chief Minister to provide a free power supply to Ganesh Pandals. The Chief Minister responded positively and advised them to apply for free electricity supply. The CM warned of action if anyone was found consuming power without permission. The Chief Minister asserted that the pandal management should take permission and maintain accountability.

Bhagyanagar Ganesh Utsava Samiti President G Raghava Reddy requested the CM that since the idol immersion falls on Ananta Chaturdashi on September 17, literature on the importance of the day should be published on behalf of the Endowment department and distributed. In a quick response, the CM ordered Endowments Commissioner Hanumantha Rao to make necessary arrangements.

Rajya Sabha member Anil Kumar Yadav appealed to the Chief Minister to allow the use of DJs in the pandals and the CM said that the government will proceed as per the Supreme Court orders. IT and Industry Minister D Sridhar Babu suggested that the organizers of the Utsava Committee install eco-friendly idols in accordance with the Supreme Court’s directions. State Minister Ponnam Prabhakar explained the details of the meetings held so far, suggestions made by the members of the festival committee and the problems addressed regarding the Ganesh festival. DGP Jitender and Hyderabad City Commissioner Srinivas Reddy briefed the CM about the security arrangements with a 25,000 strong police force. The police officials said that they are coordinating with all the departments. MLC A. V. N. Reddy appealed to the government to promote the use of clay idols and take strict action against those who consume alcohol and create trouble. Ministers Tummala Nageswara Rao, Damodara Raja Narasimha, Ponguleti Srinivas Reddy, Seethakka, Chief Minister’s Adviser Vem Narender Reddy, Government Advisers Keshav Rao, Shabbir Ali, MP Konda Visweswar Reddy, Mayor G Vijayalakshmi, Chief Secretary Santhi Kumari and other top officials are also present in the meeting.

హైద‌రాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు

  • అనుమ‌తులు తీసుకున్న మండ‌పాల‌కు ఉచిత విద్యుత్
  • అధికారులు, మండ‌ప నిర్వాహ‌కులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి
  • గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • సుప్రీంకోర్టు నిబంధ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి…

హైద‌రాబాద్ తొలి నుంచి మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరు పొందింద‌ని, ఆ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని, ఇందుకోసం ఉత్స‌వ క‌మిటీలు, మండప నిర్వాహ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న గురువారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మూడు ప్ర‌ధాన అంశాల‌పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మండ‌పాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ, నిమ‌జ్జ‌నానికి సంబంధించి మండ‌ప నిర్వాహ‌కులు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, నీటి పారుద‌ల శాఖ‌, విద్యుత్ శాఖ‌తో పాటు ఇత‌ర ముఖ్య శాఖ‌ల అధికారులు సైతం మండ‌ప నిర్వాహ‌కులతో స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని సూచించారు. ఎక్క‌డ ఎటువంటి లోటుపాట్ల‌కు తావివ్వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. జోన్ల వారీగా ఉన్న‌తాధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని, ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు, మండ‌ప నిర్వాహ‌కుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ శాంతియుతంగా ఉత్స‌వాలు, నిమ‌జ్జ‌నం కొన‌సాగేలా చూడాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ అధికారి ఏ జోన్‌లో బాధ్య‌త‌ల్లో ఉన్నారు.. ఆయా ప్రాంతాల్లో ఉత్స‌వ క‌మిటీ ప్ర‌ముఖులు, మండ‌పాల బాధ్యులు అన్నింటి వివ‌రాలు స‌మ‌గ్రంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

అవుట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో గ‌తేడాది 1.50 ల‌క్ష‌ల విగ్ర‌హాలు ఏర్పాటు చేశార‌నే లెక్క‌లున్నాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా మండ‌ప నిర్వాహ‌కులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమ‌తులు తీసుకోవాల‌ని, అలా తీసుకోవ‌డం వ‌ల‌న ఆయా ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ ఇత‌ర ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. మొత్తం విగ్ర‌హాల‌ను హుస్సేన్ సాగ‌ర్‌కే కాకుండా ఇత‌ర చెరువుల్లోనూ నిమ‌జ్జ‌నం చేసే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించారు. స‌రూర్ న‌గ‌ర్‌తో పాటు ప‌లు చెరువులు నీటితో ఉన్నాయ‌ని, ఏ ప్రాంతంలోని విగ్ర‌హాలు ఆ ప్రాంతంలోని చెరువుల్లో నిమ‌జ్జ‌నం చేస్తే హుస్సేన్ సాగ‌ర్ వ‌ద్ద ర‌ద్దీ త‌గ్గ‌డంతో పాటు ఆయా చెరువుల వ‌ద్ద నిమ‌జ్జ‌నానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను ప్ర‌భుత్వం ముందుగానే చేసే వీలుంటుంద‌న్నారు. ఈ విష‌యంలో ఉత్స‌వ స‌మితి స‌భ్యులు, మండప నిర్వాహ‌కులు ముంద‌గానే స‌మాచారం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.
నిమ‌జ్జ‌నానికి ముఖ్య అతిథులుగా ఎవ‌రినైనా పిలిస్తే ముందుగానే ప్ర‌భుత్వానికి సమాచారం ఇవ్వాల‌ని, అలాగే వీవీఐపీలు ఎవరైనా వ‌చ్చే అవ‌కాశం ఉంటే ముందుగా తెలియ‌జేస్తే పోలీసు శాఖ వారి రాక‌పోక‌లకు రూట్ క్లియ‌రెన్స్ చేయ‌డంతో పాటు త‌గిన భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిమ‌జ్జ‌న ఊరేగింపు త్వ‌ర‌గా ప్రారంభిస్తే త్వ‌ర‌గా కార్య‌క్ర‌మాన్ని ముగించుకోవ‌చ్చ‌ని, ఫ‌లితంగా భక్తులు ట్రాఫిక్‌, ఇత‌ర ఇబ్బందులు బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చ‌న్నారు. ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి న‌గ‌రం ప‌రిధిలోని న‌లుగురు లోక్‌స‌భ స‌భ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాల‌ను తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి పోలీసుల‌ను ఆదేశించారు.

సెప్టెంబ‌రు 16న మిలాద్ ఉన్ న‌బి, 17న తెలంగాణ‌లో వివిధ రాజ‌కీయ పార్టీలు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తాయ‌ని, అందువ‌ల‌న అన్ని కార్య‌క్ర‌మాల‌కు స‌క్ర‌మ‌మైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని, ఎక్క‌డా ఎటువంటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూసుకోవాల‌ని పోలీసుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

గ‌ణేష్ మండ‌పాల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వాల‌ని భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. అందుకు ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించారు. ముందుగా మండ‌ప నిర్వాహ‌కులు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. అనుమ‌తులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, జ‌వాబుదారీత‌నం కోస‌మే అనుమ‌తి చేసుకోవాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. నిమ‌జ్జ‌నం రోజైన సెప్టెంబ‌రు 17వ తేదీన అనంత చ‌తుర్ద‌శి వ‌చ్చింద‌ని, ఆ తేదీ ప్రాముఖ్య‌త‌ను తెలుపుతూ దేవాదాయ శాఖ త‌ర‌ఫున ప‌ర్వ‌దిన ప్రాముఖ్య‌త‌ను తెలిపే సాహిత్యాన్ని ప్ర‌చురించాల‌ని, ప్ర‌చారం చేయాల‌ని భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి అధ్య‌క్షుడు జి.రాఘ‌వ‌రెడ్డి ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. అందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ హ‌నుమంత‌రావును ముఖ్య‌మంత్రి ఆదేశించారు. మండ‌పాల్లో డీజేలు వాడేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. సుప్రీంకోర్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం ముందుకు వెళ‌తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అనుస‌రించి ప‌ర్యావ‌ర‌ణ హిత (ఈకో ఫ్రెండ్లీ) విగ్ర‌హాలు ప్ర‌తిష్టించాల‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ఉత్స‌వ స‌మితి నిర్వాహ‌కుల‌కు సూచించారు. గ‌ణేష్ ఉత్స‌వాల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు చేప్ట‌టిన స‌మావేశాలు, ఉత్స‌వ స‌మితి స‌భ్యులు చేసిన సూచ‌న‌లు, ప‌రిష్క‌రించిన స‌మ‌స్య‌ల వివ‌రాల‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వివ‌రించారు. మొత్తంగా 25 వేల మందితో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు డీజీపీ జితేంద‌ర్, హైద‌రాబాద్ సిటీ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖ‌ల‌తోనూ స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నామ‌ని వారు చెప్పారు. ఉత్స‌వాల్లో మ‌ట్టి విగ్ర‌హాలు వాడేలా చూడాల‌ని, మ‌ద్యం తాగి ఇబ్బంది పెట్టే వారి విష‌యంలో త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్‌.రెడ్డి కోరారు. స‌మావేశంలో మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, సీత‌క్క‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కేశ‌వ‌రావు, ష‌బ్బీర్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మేయ‌ర్ గద్వాల విజయ‌ల‌క్ష్మి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.