Corning, Telangana Sign MoU to collaborate on skilling and innovation initiatives

Corning Leadership Team Led By Ronald Verkleeren, Senior Vice President Met Cm Revanth Reddy And Minister Sridhar Babu 02

HIGHLIGHTS:

  • Corning Incorporated, a global leader in materials science, signs MoU with the Government of Telangana on skilling and innovation
  • Focus would be on skilling local workforce in advanced manufacturing and chemical engineering technologies
  • Corning would strengthen partnership in Flow Chemistry Technology (FCT) hub
  • Company thanks Chief Minister Sri Revanth Reddy for support in establishing a state-of-the-art pharmaceutical glass tubing facility
  • New facility will commence production by mid-2025
  • Corning facility will enhance availability of high-quality glass tubing for pharmaceutical packaging industry

The state government of Telangana signed a Memorandum of Understanding (MoU) with Corning Incorporated, a global leader in materials science, to collaborate on skilling and innovation initiatives aimed at strengthening the state’s workforce and advancing technological innovation in key industries here.

Corning Leadership Team Led By Ronald Verkleeren Senior Vice President Met Cm Revanth Reddy And Minister Sridhar Babu

This MoU was formalized during a significant meeting between Corning leadership team led by Ronald Verkleeren, Senior Vice President, Emerging Innovations Group, and and the state official team led by Chief Minister A. Revanth Reddy and Minister for Industries, D. Sridhar Babu, and senior officials.

As part of the agreement, Corning and Telangana would collaborate on designing and implementing programs focused on skilling local workforce in advanced manufacturing and chemical engineering technologies. These initiatives aim to ensure that Telangana’s talent pool remains competitive on a global scale, aligning with state’s vision of becoming a hub for cutting-edge research and development in pharmaceutical and chemical sectors.

Furthermore, Corning will strengthen its partnership and participation in the Flow Chemistry Technology (FCT) hub, a collaborative initiative of the Government of Telangana, with Dr. Reddy’s Limited, Laurus Pharma Limited, and University of Hyderabad.

During their discussions with the Chief Minister, Corning introduced its cutting-edge Corning® Advanced-Flow™ Reactors (AFR) technology.

The company is keen to collaborate with Telangana in developing and implementing flow chemistry technology, further solidifying the state’s position as a hub for innovation in the pharmaceutical and chemical industries.

During the meeting, Corning expressed its gratitude to the Telangana government for its unwavering support in establishing a state-of-the-art pharmaceutical glass tubing facility. This facility, set to commence production in mid-2025, will enhance the availability of high-quality glass tubing for the pharmaceutical packaging industry.

By integrating Corning’s innovative velocity glass-coating technology, the facility is expected to bolster productivity and operational efficiencies for Telangana’s rapidly expanding pharmaceutical sector.

The company leadership said the government of Telangana, under the visionary leadership of Chief Minister A. Revanth Reddy, had given them confidence that the state would foster an environment conducive to industrial and economic growth.

ఫార్మా గ్లాస్ ట్యూబ్ ల తయారీ కేంద్రం

  • వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభం
  • కార్నింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్న సీఎం బృందం

ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఎమర్జింగ్ ఇన్నేవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాడ్ వెర్క్లీరన్ అధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అధికారికంగా అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో భాగస్వామ్యం పంచుకుంటుంది.

తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పటంపై కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (ఎఫ్‌సిటి) హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుంది. ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలో ఈ కంపెనీ తగిన సహకారం అందిస్తుంది. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న అడ్వాన్స్డ్ ఫ్లో రియాక్టర్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్ లను ఉపయోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్-కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త సదుపాయంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందనే అంచనాలున్నాయి.