CM Seeks Opportunities for Hosting National and International Sports Events

Cm Revanth Reddy Met Union Minister For Sports And Youth Affairs, Mansukh L. Mandaviya, In New Delhi 23 04 2024 01
  • Requests Financial Assistance for Sports University and Approval of DPRs for Upgrading Sports Infrastructure.

Telangana Chief Minister Revanth Reddy, along with Deputy Chief Minister Bhatti Vikramarka and State Minister for Tourism and Excise Jupally Krishna Rao, met with Union Minister for Sports and Youth Affairs, Mansukh L. Mandaviya, in New Delhi on Friday evening. During the meeting, CM Revanth Reddy urged the Union Minister to provide Telangana with opportunities to host future national and international sports events, including the Olympics.

Cm Revanth Reddy Met Union Minister For Sports And Youth Affairs Mansukh L. Mandaviya In New Delhi 23 04 2024

The Chief Minister emphasized that Telangana possesses all the necessary infrastructure to host such events. He highlighted the achievements of Telangana athletes who have won medals in various international competitions, including the Olympics, and stressed the state government’s commitment to providing world-class facilities for athletes to excel on the global stage.

CM Revanth Reddy informed Union Minister Mandaviya about the international-standard sports facilities available in Hyderabad, including the Gachibowli Sports Complex, Saroor Nagar Stadium, LB Stadium, KBR Indoor Stadium, OU Campus, Gymkhana Ground, and Hussain Sagar, which offer amenities like swimming pools, multi-purpose indoor stadiums, synthetic athletic tracks, shooting ranges, football grounds, skating tracks, and water sports facilities (Rowing, Kayaking, and Canoeing). He also mentioned the availability of five-star hotels and excellent air and rail connectivity in Hyderabad.

Cm Revanth Reddy Met Union Minister For Sports And Youth Affairs Mansukh L. Mandaviya In New Delhi 23 04 2024 02

The Chief Minister reminded the Union Minister that Hyderabad had successfully hosted major events in the past, such as the National Games in 2002, Afro-Asian Games in 2003, and the World Military Games in 2007. He requested that Telangana be given the opportunity to host future events like the Olympics, Asian Games, and Commonwealth Games. Additionally, he sought the inclusion of Hyderabad as a venue for the Khelo India Youth Games scheduled for January 2025.

CM Revanth Reddy also discussed the state government’s plan to establish a Sports University in Telangana to nurture the sporting talents of the youth. He requested financial assistance from the central government for setting up this university, which would focus on training and research across various sports disciplines.

Furthermore, the Chief Minister urged the Union Minister to increase the allocation of funds under the Khelo India scheme for the development of sports infrastructure in Telangana. He requested the approval of Detailed Project Reports (DPRs) already submitted by the state government for the upgrade of facilities at the GMC Balayogi Stadium in Gachibowli, the shooting range at the University of Hyderabad, LB Stadium, the sports school in Hakimpet, and the Saroor Nagar Indoor Stadium.

జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ‌కు అవ‌కాశం ఇవ్వండి

  • స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి ఆర్థిక స‌హాయం అంద‌జేయండి..
  • క్రీడా సంస్థ‌ల అప్‌గ్రెడేష‌న్ డీపీఆర్‌ల‌ను ఆమోదించండి…
  • కేంద్ర క్రీడా శాఖ మంత్రి మ‌న్‌సుఖ్‌ ఎల్ మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విన‌తి

జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌న్నీ తెలంగాణ‌లో ఉన్నాయ‌ని, భ‌విష్య‌త్తులో నిర్వ‌హించ‌నున్న ఒలింపిక్స్‌తో పాటు ఇత‌ర అంత‌ర్జాతీయ‌, జాతీయ క్రీడ‌లు నిర్వ‌హించే అవ‌కాశాన్ని తెలంగాణ‌కు ఇవ్వాల‌ని కేంద్ర క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ మ‌న్‌సుఖ్ ఎల్ మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రి శ్రీ మాండ‌వీయ‌ను ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి శ్రీ భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూప‌ల్లి కృష్ణారావు శుక్ర‌వారం సాయంత్రం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా క్రీడా శాఖ‌పై త‌మ‌కున్న ల‌క్ష్యాల‌ను, ఆకాంక్ష‌లు, తెలంగాణ‌కు ఉన్న ఘ‌న‌త‌ను కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి వివ‌రించారు. ఒలింపిక్స్‌తో పాటు ప‌లు అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో తెలంగాణ క్రీడాకారులు ప‌త‌కాలు సాధించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై క్రీడాకారులు రాణించ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తుల క‌ల్ప‌న‌కు త‌మ ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇస్తోంద‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు.

హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, స‌రూర్ న‌గ‌ర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, ఓయూ క్యాంప‌స్, జింఖానా గ్రౌండ్‌, హుస్సేన్ సాగ‌ర్ త‌దిత‌రాల్లో అంత‌ర్జాతీయ‌ ప్ర‌మాణాల‌తో కూడిన ఈత కొల‌నులు, మ‌ల్టీపర్ప‌స్ ఇండోర్ స్టేడియంలు, సింథ‌టిక్ అథ్లెటిక్ ట్రాక్స్, షూటింగ్ రేంజ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌, స్కేటింగ్ ట్రాక్స్‌, వాట‌ర్ స్పోర్ట్స్ (Rowing, Kayaking and Canoeing) ఇత‌ర క్రీడ‌ల‌కు వ‌స‌తులు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వివ‌రించారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో వివిధ కేట‌గిరిల ఫైవ్ స్టార్ హోట‌ళ్లు ఉన్నాయ‌ని, విమాన‌, రైలు స‌ర్వీసుల‌తో అనుసంధాన‌మై ఉంద‌ని తెలిపారు. 2002లో నేష‌న‌ల్ గేమ్స్‌, 2003లో ఆఫ్రో-ఏషియ‌న్ గేమ్స్‌, 2007లో ప్ర‌పంచ మిల‌ట‌రీ గేమ్స్ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి మాండ‌వీయకు ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. వీట‌న్నింట‌ని ప‌రిగ‌ణన‌లోకి తీసుకొని భ‌విష్య‌త్‌లో ఒలింపిక్స్‌, ఆసియ‌న్ గేమ్స్‌, కామ‌న్‌వెల్త్ గేమ్స్ తెలంగాణ‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఇప్పించాల‌ని, 2025, జ‌న‌వ‌రిలో నిర్వ‌హించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు హైద‌రాబాద్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

తెలంగాణ యువ‌తలోని క్రీడా నైపుణ్యాల‌ను వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీల్లో అన్ని ర‌కాల క్రీడ‌ల‌కు సంబంధించిన శిక్ష‌ణ‌, ప‌రిశోధ‌న‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. ఈ నేప‌థ్యంలో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హాయం అంద‌జేయాల‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

రాష్ట్రంలో క్రీడా మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి ఖేలో ఇండియా ప‌థ‌కం కింద నిధులు విడుద‌ల‌ను పెంచాల‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని జీఎంసీ బాల‌యోగి స్టేడియం, సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలోని (UoH) షూటింగ్ రేంజ్‌, ఎల్ బీ స్టేడియం, హ‌కీంపేట‌లోని స్పోర్ట్స్ స్కూల్‌, స‌రూర్ న‌గ‌ర్ ఇండోర్ స్టేడియంల‌లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి తాము ఇప్ప‌టికే పంపించిన డీపీఆర్‌ల‌ను ఆమోదించాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

Telangana Rising