CM Sri Revanth Reddy enthralls top CEOs Roundtable, Pitches Telangana as missing jigsaw piece in America, Inc. search for perfect China Plus One Strategy.
HIGHLIGHTS:
- Conference Hosted by Consulate General, NY
- IT minister D. Sridhar Babu outlines best-in-class industry policies, history of development of Hyderabad a power hub in software, pharma
- CM talks of the ambition of a different kind, showcases Musi River Front Development, Future City, 3-Ring structure of Telangana and the Master Plan 2050
Chief Minister A. Revanth Reddy enthralled the top CEOs and business honchos at an official roundtable hosted by the Consulate General of India, New York, over a working luncheon late Monday here, emphasizing on the business-readiness of Telangana to fit in as the missing jigsaw puzzle piece in the America, Inc. search for a China plus One strategy.
Organised and hosted by the Indian CG, NY, over 20 Chairpersons, CEOs representing well-known companies from varied sectors, including pharma, IT, technology, EV, GCC, biotech, and shipping sectors, among others, attended.
After a brief presentation on the history and future plans for the development of industrial clusters in Telangana and Hyderabad, Chief Minister Revanth Reddy brought the house down when he began his talk, saying, “I am here to speak from my heart and to share my state’s dreams and my people’s aspirations. Since this is my first visit to the USA as Chief Minister of Telangana, I hope to take back home as many dollars from all of you as possible.”
Showcasing the strengths of Hyderabad and Telangana as a top investment destination, he said, “We are now a powerhouse in software, life-sciences and Pharma, with a strong base in Aerospace, Defense, Electronics and other sectors. We helped the World overcome Covid by making millions of vaccines for people for many countries.”
“We have great infrastructure, wonderful talent and offer best policy support from our government for investors. Hyderabad, an over 425 years old city built by the Nizams, is interestingly almost the same age as the United State of America.”
Speaking about the ambitious projects which offer sui generis opportunities for investment into the future and promise exponential growth, the Chief Minister said, “We are building a fourth city – the Future City. It will be India’s answer to future. It will be India’s first Net Zero Carbon city. Future City will become a hub for AI, medical tourism, sports, software and pharma. It is like a second round of gold rush. We are creating a New Industrial Policy to match our dreams. We will make it very easy to start new business and expand your existing business in Telangana. I keep saying – Telangana means business. I mean it.”
“As top global business leaders, you understand power of dreams very well. You understand passion needed to build great things. Telangana today has both passion and vision. Please come and visit my city, my state, and let us discuss great opportunities. Together, we can make a great future,” he added.
IT Minister D. Sridhar Babu made an elaborate pitch on the current strengths of Hyderabad Telangana for a variety of industry sectors and the detailed the policies that would enable the Chief Minister’s vision to make Telangana a viable alternate to China for manufacturing and develop Hyderabad into one of the top 10 cities in the world.
The industry leaders spoke of their experiences of investing worldwide and doing business in India, and their expectations from Telagnana and Hyderabad. They also explained the current plans for investments in the coming days. Several major announcements are expected in near future after the successful Roundtable.
Attendees:
- Mr. Ronald L Verkleeren, Sr. Vice President, Corning
- Mr. Dinesh Paliwal, Partner, KKR
- Mr. Ekram Sarpar, Head of Int’l Public Policy, Cigna
- Mr. Bill Noonan, Chief Business Development Officer, Choose New Jersey
- Dr. S. V. Anchan, Chairman, SafeSea Group
- Mr. Sanjiv Ahuja, Founder, Chairman & CEO, Tillman Holdings
- Mr. Chintu Patel, Co-CEO, Amneal Pharma
- Mr. Ravi Lochan Pola, Executive Director, JP Morgan Chase
- Mr. Subba Rao, Exec. VP Finance / CFO, Aquatech
- Mr. Amit Kumar, MD, Accenture
- Mr. Punit Lochan, MD, Deloitte
- Mr. Veera Budhi, Chief Technology Officer, Habits Inc.
- Mr. Sri Atluri, MD, BNY Mellon
- Dr. Jonathan Hill, Dean, Seidenberg School of Computer Science, Pace University
- Mr. Arun Upadhaya, Chief Scientific Officer and Head of Research, Ocugen
- Mr. Swamy Kocherlakota, Exec. VP and Chief Digital Solutions Officer, S&P Global
- Ms. Ashwini Panse, MD, Intercontinental Exchange Inc.
చైనాతోనే పోటీ పడుదాం
- ఫ్యూచర్ సిటీ ఇండియాకు కొత్త చిరునామా
- తెలంగాణ అంటేనే పెట్టుబడుల గమ్యస్థానం
- వ్యాపారాలకు సులభంగా కొత్త పారిశ్రామిక విధానం
- అమెరికాలో రౌండ్ టేబుల్ సమావేశంలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణ అంటేనే వ్యాపారం.. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ఈ సందర్భంగా సీఎం వివరించారు. త్వరలోనే హైదరాబాద్లో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది భారత దేశపు భవిష్యత్తుకు చిరునామాగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. దేశంలోనే జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడతుందని అన్నారు. ఫ్యూచర్ సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు, మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్దితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను సులభతరం చేస్తామని సీఎం ప్రకటించారు. అటువంటి సరికొత్త ఆలోచనలతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
సోమవారం న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వర్కింగ్ లంచ్ అనంతరం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశమయ్యారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నఛైర్‌పర్సన్‌లు, సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తన మనసులోని మాటలతో పాటు తమ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో.. తన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలేమిటో వెల్లడిస్తానంటూ అందరినీ ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఇది తన మొదటి అమెరికా పర్యటన అని.. ఇక్కడి నుంచి వీలైనన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్లాలలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు.
పెట్టుబడుల గమ్యస్థానంగా దేశంలోనే అందరినీ ఆకర్షిస్తున్న తెలంగాణకు ఉన్న అనుకూలతలన్నింటినీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్, లైఫ్-సైన్స్, ఫార్మా రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో బలమైన పునాదులు వేసుకుందని చెప్పారు. కోవిడ్ను అధిగమించేందుకు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లను తయారు చేసి ప్రపంచానికి సాయం చేసిందని అన్నారు.
తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ సంపద సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమమైన మద్దతును అందిస్తుందని ప్రకటించారు. నిజాంలు నిర్మించిన 425 సంవత్సరాల పురాతనమైన హైదరాబాద్, ఇంచుమించుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సమకాలీనంగా ఉండటం ఆసక్తి రేపుతోందని అన్నారు.
అభిరుచితో పాటు అద్భుతమైన దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒకసారి తెలంగాణకు రావాలని, హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్లో ఉన్న అనుకూలతలతో పాటు అక్కడున్న అవకాశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కలిసికట్టుగా గొప్ప భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
తెలంగాణను చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి దార్శనికతను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రపంచంలోనే టాప్ టెన్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని, ఆ దిశగా రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించారు. ఈ సమావేశం తెలంగాణలో కొత్త పెట్టుబడులకు మరింత ఊతమిస్తుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
కార్నింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్క్లీరెన్, కేకేఆర్ పార్టనర్ దినేష్ పలివాల్, సిగ్నా ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ హెడ్ ఎక్రమ్ సర్పర్, న్యూజెర్సీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బిల్ నూనన్, సేఫ్‌సీ గ్రూప్ ఛైర్మన్ ఎస్వీ అంచన్, టిల్మాన్ హోల్డింగ్స్ ఛైర్మన్ సంజీవ్ అహుజా, అమ్నీల్ ఫార్మా కో సీఈవో చింటూ పటేల్, జేపీ మోర్గాన్ చేజ్ ఈడీ రవి లోచన్ పోలా, ఆక్వాటెక్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సుబ్బారావు, యాక్సెంచర్ ఎండీ అమిత్కుమార్, డెలాయిట్ ఎండీ పునిత్ లోచన్, హాబిట్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వీర బుద్ధి, బీఎన్వై మెల్లన్ ఎండీ అట్లూరి, పేస్ యూనివర్సిటీ డీన్ డా. జోనాథన్ హిల్, అకుజెన్ చీఫ్ సైంటిఫిక్ హెడ్ అరుణ్ ఉపాధ్యాయ, ఎస్ అండ్ పీ గ్లోబల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్వామి కొచ్చెర్లకోట, ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ ఎండీ అశ్విని పన్సే ఈ సమావేశంలో పాల్గొన్నారు.